Brown Rice Dosa: బ్రౌన్ రైస్‌తో దోశ తయారీ.. సింపుల్ గ్రీన్ చట్నీతో సహా..-know how to make brown rice dosa and simple green chutney ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brown Rice Dosa: బ్రౌన్ రైస్‌తో దోశ తయారీ.. సింపుల్ గ్రీన్ చట్నీతో సహా..

Brown Rice Dosa: బ్రౌన్ రైస్‌తో దోశ తయారీ.. సింపుల్ గ్రీన్ చట్నీతో సహా..

Brown Rice Dosa: బ్రౌన్ రైస్‌తో చేసిన దోశెలు ఒక సింపుల్ గ్రీన్ చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే అదిరిపోతాయి. ఆ రెండింటి తయారీ ఎలాగో చూసేయండి.

బ్రౌన్ రైస్ దోశ

ఏ వంటనైనా ఆరోగ్యకరంగా మార్చాలంటే కొన్ని మార్పులు చేయాలి. ఒకసారి మామూలు బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్ తో దోసెలు ప్రయత్నించండి. కాస్త ఆరోగ్యంతో పాటూ రుచిలో కూడా మార్పు తప్పకుండా ఉంటుంది. తయారీ అయితే మామూలు దోసెలకన్నా కాస్త మార్పులతో ఉంటుంది. దీనికి జతగా ఒక సింపుల్ చట్నీ సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. దోసెలు, చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

బ్రౌన్ రైస్ దోస కోసం కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల బ్రౌన్ రైస్

పావు కప్పు అటుకులు

2 చెంచాల శనగపప్పు

సగం కప్పు మినప్పప్పు

సగం చెంచా మెంతులు

తగినంత ఉప్పు

చట్నీ కోసం:

సగం కప్పు కొబ్బరి

సగం కప్పు కొత్తిమీర

సగం కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు

చెంచా నిమ్మరసం

తగినంత ఉప్పు

బ్రౌన్ రైస్ దోస తయారీ విధానం:

  1. ముందుగా బ్రౌన్ రైస్ లేదా దంపుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కొన్ని వేడి నీళ్లు చేసి నానబెట్టుకుంటే ఇంకా చక్కగా నానిపోతాయి.
  2. ఇప్పుడు బియ్యంలో మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, అటుకులు కూడా వేసుకుని కనీసం అయిదు నుంచి ఆరు గంటల పాటూ నానబెట్టుకోవాలి.
  3. తర్వాత కొద్దికొద్దగా నీళ్లు పోసుకుంటూ దోసెలు పోసుకునే వీలుండే లాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని ఒక పూటంతా పులిసేదాకా ఆగాలి.
  4. తర్వాత పెనం పెట్టుకుని దోసె పిండిలో నీల్లు సరిచూసుకుని సన్నటి దోసెలు వేసుకోవడమే. కొనల వెంబడి నూనె వేసుకుని కాల్చుకుంటే రుచికరమైన దోసెలు రెడీ అవుతాయి.

సింపుల్ చట్నీ తయారీ:

  1. ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడుక్కుని మిక్సీలో కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి.
  2. అందులోనే నిమ్మరసం, ఉప్పు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి పాలు వేసుకుని వీలైనంత చిక్కగా మిక్సీ పట్టుకుంటే చాలా సింపుల్ గా కొత్తిమీర కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఈ దోసెలకు ఈ చట్నీ రుచి బాగా నప్పుతుంది.