యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది కీళ్లు, కండరాలను బలోపేతం చేస్తుంది. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. యోగాలో సూర్య నమస్కారాలకు ఉన్న ప్రాముఖ్యత తెలిసిందే. అయితే వీటితోపాటే చంద్ర నమస్కారాలూ ఉన్నాయి. కాకపోతే వీటి గురించి చాలా మందికి తెలీదు. సూర్య, చంద్ర నమస్కారాలు రెండూ శరీరంలో కండరాలు సాగేలా చేసి అనేక ప్రయోజనాలనిస్తాయి.
అక్షర యోగ కేంద్రం వ్యవస్థాపకుడు, కాలమిస్ట్, రచయిత హిమాలయన్ సిద్ధ అక్షర్ చంద్ర నమస్కారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 'చంద్ర నమస్కారం అంటే చంద్రుడికి చేసే నమస్కారం. చంద్రుడు మన భావోద్వేగాలను, భావోద్వేగ మేధస్సును, అభిరుచికి చిహ్నం. శరీరంలో ఎడమ వైపు చంద్రుని శక్తి అని, ఈ ప్రవాహం ద్వారా ప్రతీకాత్మకంగా సూచిస్తారని, సూర్యుడు కుడి వైపు ప్రాతినిథ్యం వహిస్తాడని ఆయన వివరించారు.
ఆసనం 1: ప్రణామ్ అసనం - ప్రార్థన స్థితి
ఆసనం 2: హస్తా ఉత్తనాసనం - పైకెత్తిన చేతుల భంగిమ
ఆసనం 3: పాదహస్తాసనం - ముందుకు వంగిన భంగిమ
ఆసనం 4: అశ్వసంచాలన్ ఆసనం - ఒక కాలు వంచి, మరో కాలు సమాంతరంగా ఉంచి పైకి చూసే భంగిమ
ఆసనం 5: అర్ధ చంద్రాసనం - ఒక కాలు, చేయి భూమిని తాకి, మరో చేయి పైకి నిటారుగా, కాలు భూమికి సమాంతరంగా గాల్లో ఉంటాయి.
ఆసనం 6: సంతోలాసనం - ప్లాంక్ భంగిమ
ఆసనం 7: అష్టాంగ ప్రాణాసనం - విల్లు లాగా భూమిమీద వంగిన భంగిమ
ఆసనం 8: భుజంగాసనం - నాగుపాము భంగిమ
ఆసనం 9: అధోముఖి స్వప్నాసనం - ముఖం కిందికి ఉన్న కుక్క భంగిమ
ఆసనం 10: అశ్వసంచాలన్ ఆసనం - ఒక కాలు వంచి, మరో కాలు సమాంతరంగా ఉంచి పైకి చూసే భంగిమ
ఆసనం 11: అర్ధ చంద్రాసనం - ఒక కాలు, చేయి భూమిని తాకి, మరో చేయి పైకి నిటారుగా, కాలు భూమికి సమాంతరంగా గాల్లో ఉంటాయి.
ఆసనం 12: పదహస్తసనం - ముందుకు వంగిన భంగిమ
ఆసనం 13: హస్తా ఉత్తన్ ఆసనం - పైకెత్తిన చేతుల భంగిమ
ఆసనం 14: ప్రణామ్ అసనం - ప్రార్థన స్థితి
ఈ చంద్ర నమస్కారాలు నడము భాగాన్ని బలోపేతం చేస్తాయి. మీ భుజాలను సులువుగా కదిలేలా చేస్తుంది. ఇది మోకాళ్లను లూబ్రికేట్ చేయడం ద్వారా మోకాళ్ళు పట్టేయకుండా చేస్తాయి. క్రమంగా చేయడం వల్ల కటి ప్రాంతం కూడా ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. చంద్ర నమస్కారాలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. మీ శరీరంలో సమతుల్యతను సృష్టిస్తాయి. ఇది వెన్నెముకను బలోపేతం చేయడానికి, సాగేలా చేసి మంచి వ్యాయామం అవ్వడానికి కూడా సహాయపడుతుంది. తొడ కండరాలు, కాళ్ళ వెనుక, కడుపు కండరాలకు మద్దతు ఇవ్వడానికి కూడా సహాయపడుతుంది. చంద్ర నమస్కారం క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల జీర్ణ, శ్వాసకోశ, ప్రసరణ వ్యవస్థలు వంటి అనేక శారీరక విధులను ఆరోగ్యకరంగా చేసేలా సహాయపడుతుంది. సాయంత్రం 6 గంటలకు చంద్రుడికి అభిముఖంగా నిలబడి చంద్ర నమస్కారం చేయాలి.
టాపిక్