Bedtime Habits | పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారా? అయితే మీకొచ్చే జబ్బుల జాబితా పెద్దదే!-know how technology disturbing your sleep and causing severe health issues ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know How Technology Disturbing Your Sleep And Causing Severe Health Issues

Bedtime Habits | పడుకునే ముందు ఫోన్ చూస్తున్నారా? అయితే మీకొచ్చే జబ్బుల జాబితా పెద్దదే!

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 08:08 PM IST

Bedtime Habits: చాలామంది అర్ధరాత్రి వరకు ఫోన్ బ్రౌజింగ్ చేస్తూనే ఉంటారు, ఓటీటీలో వెబ్ సిరీస్ చూస్తారు, ల్యాప్‌టాప్‌‌లో వర్క్ చేస్తారు. కానీ ఇవన్నీ ఎలాంటి అనారోగ్యాలు కలిగిస్తున్నాయో చూడండి.

Bedtime Habits- Technology
Bedtime Habits- Technology (Unsplash)

Bedtime Habits: మనలో ప్రతి ఒక్కరికి వేర్వేరు నిద్ర అలవాట్లు ఉంటాయి. కొందరికి లైట్‌ వేస్తే నిద్ర పట్టదు, గది అంతా చీకటిగా ఉండాలి. మరి కొంతమందికి చీకటిగా ఉంటే భయం వేస్తుందని, లైట్ వేసుకొనే నిద్రపోతారు. కొంతమందికి చలికాలంలో కూడా ఫ్యాన్ లేకుండా నిద్ర పట్టదు. ఇంకొందరు వేసవిలో కూడా దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారు. కొందరికి ప్రశాంత వాతావరణంలో నిద్రించే అలవాటు ఉంటుంది. కొందరికి రైలు శబ్దంతో ఉయ్యాల ఊగుతున్నట్లుగా ఉంటే నిద్రపడుతుంది. ఇక, చాలా మందికి సంగీతం వింటూ టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇలాంటి అలవాట్లే ఒకరి నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి.

అయితే ఎవరి అలవాట్లు ఎలా ఉన్నప్పటికీ, రాత్రి పడుకునే ముందు టీవీ, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించే వారికి నిద్ర సమస్యలతో పాటుగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఒక సర్వే ప్రకారం, ప్రతి 9 మందిలో ఒకరు రాత్రి పడుకునే ముందు ఏదో ఒక ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. నిద్రపోయే ముందు టీవీ ఆన్ చేసి ఫోన్ వైపు చూసే అలవాటు కూడా మనలో చాలా మందికి ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా పాడుచేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Technology - Sleeping Disorders

రాత్రి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

ఊబకాయం వచ్చే అవకాశాలు

అధ్యయనాల ప్రకారం, టీవీ ఆన్‌లో ఉంచుకుని నిద్రించడం వల్ల సమీప భవిష్యత్తులో అధిక బరువు , ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. టీవీ ద్వారా వెలువడే నీలి కాంతి ఆరోగ్యానికి చాలా హానికరం.

కళ్లకు నష్టం

టీవీ ద్వారా వెలువడే నీలి కిరణాలు రెటీనాను దెబ్బతీస్తాయి. మీరు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పటికీ, గదిలో బాగా వ్యాపించే ఈ కిరణాలు మీ కంటి ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తాయి.

మెదడుకు ప్రమాదం

మొబైల్ ఫోన్‌లు హానికరమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మన మెదడును దెబ్బతీస్తాయి. ఇది తలనొప్పి, కండరాల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది

బ్లూ లైట్ వివిధ రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. రాత్రిపూట టీవీ లేదా ల్యాప్‌టాప్‌ని వాడుతూ నిద్రపోయే వారికి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం

రాత్రిపూట ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు మిగగా వారికంటే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారు. టీవీ నుండి వచ్చే నీలి కిరణాలు నిద్ర తర్వాత కూడా మెదడును అలర్ట్ మోడ్‌లో ఉంచుతాయి. దీని వల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభించదు, బాగా అలసిపోతుంది.

స్కిన్ డ్యామేజ్

బ్లూ లైట్ కూడా చర్మానికి చాలా ప్రమాదకరం. ఇది సమీప భవిష్యత్తులో చర్మ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం