Types of jaggery: బెల్లంలో ఇన్ని రకాలు ఉంటాయని తెలుసా? ఏ బెల్లం మంచిదంటే?-know different types of jaggery and its health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Types Of Jaggery: బెల్లంలో ఇన్ని రకాలు ఉంటాయని తెలుసా? ఏ బెల్లం మంచిదంటే?

Types of jaggery: బెల్లంలో ఇన్ని రకాలు ఉంటాయని తెలుసా? ఏ బెల్లం మంచిదంటే?

HT Telugu Desk HT Telugu
Nov 01, 2023 03:30 PM IST

Types of jaggery: బెల్లంలో చాలా రకాలుంటాయి. ఏ బెల్లం వాడితో ఎక్కువ లాభదాయకమో, ఇంతకీ ఎన్ని రకాల బెల్లాలు ఉన్నాయో వివరంగా తెలుసుకోండి.

బెల్లం రకాలు
బెల్లం రకాలు (freepik)

ఈ మధ్య కాలంలో పంచదారకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. రాను రాను మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండే సరికి అందరికి పంచదారను తక్కువగా తినాలన్న అవగాహన పెరిగింది. అందువల్ల చాలా మంది టీలు, కాఫీలు, ఇంట్లో చేసుకునే తీపి పదార్థాల్లో బెల్లాన్ని ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. మరి బెల్లం ఏదైనా మంచిదేనా? అందులో ఏమైనా రకాలుంటాయా? ఏ బెల్లం తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందాం.

సాధారణంగా బెల్లాన్ని చెరకు రసం నుంచి తయారు చేస్తారని మనకు తెలుసు. ఇందులో తెల్ల బెల్లం, నల్ల బెల్లం అని రెండు రకాల బెల్లాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

తెల్ల బెల్లం :

కంటికి ఇంపుగా కనిపించేందుకు బెల్లం తయారీ సమయంలో కొన్ని రకాల రసాయనాలను కలిపి తెల్ల బెల్లాన్ని తయారు చేస్తారు. ఎక్కువ మంది వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి వీరిలా చేస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

నల్ల బెల్లం :

చెరుకు రసాన్ని బెల్లంగా తయారు చేసే సమయంలో రసాయనాలను వాడకపోతే అది నల్ల బెల్లంగా తయారవుతుంది. అది చూసేందుకు అంతగా బాగుండదు. కానీ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సమృద్ధిగా ఐరన్‌ ఉంటుంది.

తాటి బెల్లం :

తాటి చెట్టు నుంచి నీరాను సేకరిస్తారు. ఇది సహజంగానే తియ్యగా ఉంటుంది. దీన్ని మరిగించడం ద్వారా ఏర్పడిన గట్టి పదార్థమే తాటి బెల్లం. ఈ తాటి బెల్లం సాధారణ బెల్లం కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనదని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే ఇది బెల్లం కంటే కూడా తక్కువ గ్లైకమిక్‌ ఇండెక్స్‌ని కలిగి ఉంటుంది. అంటే దీన్ని తినడం వల్ల మన శరీరంలో ఎక్కువగా చక్కెర శాతం పెరగదు. అందుకనే ఆరోగ్యాభిలాషులంతా దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీనిలో మెగ్నీషియం, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. అలాగే దీనిలో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం లాంటివి ఎముకల్ని బలంగా ఉంచుతాయి.

ఇంకా చాలా బెల్లాలు ఉన్నాయ్‌! :

తాటి బెల్లం లాగానే కొబ్బరి బెల్లం, ఈత బెల్లం, ఖర్జూర బెల్లం లాంటివీ తయారు చేస్తారు. అయితే వీటిని మన దగ్గర వాడడం తక్కువ. విదేశాల్లో కొన్ని కొన్ని చోట్ల వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని ఖరీదూ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల బెల్లాలు ఉన్నా అత్యధికంగా ఆరోగ్య ప్రయోజనాలను కోరుకునే వారు తప్పకుండా తాటి బెల్లం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

టాపిక్