Brahma-inspired dress: ఈ డిజైనర్ డ్రెస్ వెనక అర్థం ఇదే.. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆశ్చర్యపరిచిన డిజైనర్..-know details about rahul mishras brahma inspired look ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brahma-inspired Dress: ఈ డిజైనర్ డ్రెస్ వెనక అర్థం ఇదే.. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆశ్చర్యపరిచిన డిజైనర్..

Brahma-inspired dress: ఈ డిజైనర్ డ్రెస్ వెనక అర్థం ఇదే.. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆశ్చర్యపరిచిన డిజైనర్..

Brahma-inspired dress: డిజైనర్ రాహుల్ మిశ్రా పారిస్ ఫ్యాషన్ వీక్ లో బ్రహ్మ దేవుడి స్ఫూర్తితో రూపొందించిన దుస్తులతో అభిమానులను ఆశ్చర్యపర్చారు. దాని వివరాలు పూర్తగా చూడండి.

బ్రహ్మ దేవుణ్ని స్పూర్తిగా తీసుకుని రాహుల్ మిశ్రా రూపొందించిన దుస్తులు

పారిస్ ఫ్యాషన్ వీక్ లో రాహుల్ మిశ్రా అద్భుత ప్రదర్శన చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు కొన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫోటోలో మోడల్ వేసుకున్న దుస్తులు అందరినీ ఆశ్చర్యపరచాయి.

ఈ దుస్తులకు స్ఫూర్తి ఏంటంటే..

నలుపు రంగు దుస్తులు ధరించి రన్ వేపై నడుస్తున్న మోడల్ ఫొటోలను రాహుల్ పోస్ట్ చేశారు. మోడల్ నలుపు రంగు సీక్వెన్లున్న డ్రెస్ వేసుకుని తల దగ్గర ఒక హెడ్ గేర్ లాగా ఉంది. ఈ లుక్‌కు ప్రత్యేకత అంతా హెడ్ గేర్ వల్లనే వచ్చింది. రెండు వైపుల నుంచి రెండు తలలు బయటకు వస్తున్నట్లు ఈ దుస్తులను డిజైన్ చేశారు. ఈ దుస్తులు మూడు తలల దేవుడైన బ్రహ్మదేవుడికి నివాళి అని రాహుల్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

త్రికాల దర్శి అని హిందూ దేవుడైన బ్రహ్మను అంటారు.. అంటే భూత, వర్తమాన, భవిష్యత్తు..  సమస్త కాలాల సృష్టికర్త. పురాణాలలో, నాలుగు తలలతో అన్ని దిక్కులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ దుస్తులు బ్రహ్మదేవుణ్ని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసినవి. దుస్తుల నుంచి రెండుతలలు బయటకు వస్తున్నట్టుగా డిజైన్ చేశారు. ఇవి భగవంతుని అతీతమైన శక్తిని, దాని వెనక ఉన్న పరమార్థాన్ని సూచిస్తాయి.

రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులు
రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన దుస్తులు

విప్లవాత్మక ఫ్యాషన్:

అభిమానులు ఈ డిజైనర్ పీస్ చూసి అవాక్కయ్యారు. " మీరు అప్పటికే ఫ్యాషన్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు, కానీ మీరు నిజంగా దీనితో ఇరగదిశారు" అని ఒకరు రాశారు. "వావ్. ఇది చాలా గొప్పగా ఉంది ' అని మరొకరు రాశారు. 'మీ క్రియేటివిటీకి అభినందనలు." అని మరొక వ్యాఖ్య.

రాహుల్ మిశ్రా గత కొన్నేళ్లుగా నమ్మశక్యం కాని విజయాలను సాధించారు. గతేడాది ముంబైలో జరిగిన ఎన్ఎంఏసీసీ ప్రారంభోత్సవానికి ప్రముఖ హాలీవుడ్ నటి తను డిజైన్ చేసిన సారీ డ్రెస్ ధరించారు. ఫ్యాషన్ స్టైలిస్ట్ లా రోచ్ ఈ ఏడాది మెట్ గాలాకు రాహుల్ డిజైన్ చేసిన సూట్ ను ధరించాడు.