Clove tea recipe: లవంగం టీ తాగారా? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు-know clove tea recipe it helps in weight loss and diabetes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Clove Tea Recipe It Helps In Weight Loss And Diabetes

Clove tea recipe: లవంగం టీ తాగారా? ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

HT Telugu Desk HT Telugu
Feb 20, 2023 02:43 PM IST

Clove tea recipe: లవంగం టీ బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

లవంగం టీతో బోలెడు ప్రయోజనాలు
లవంగం టీతో బోలెడు ప్రయోజనాలు

Clove tea recipe and health benefits: లవంగం ఛాయ్ ఎప్పుడైనా తాగారా? రకరకాల టీ రెసిపీల్లో లవంగం ఛాయ్ కూడా ఒకటి. తేనీరు ఆరోగ్యకరమే అయినా, చక్కెర కలపడం వల్ల దానిలో ఉన్న సహజ పోషకాలు మాయమవుతాయని న్యూట్రీషనిస్టులు చెబుతారు. పోషకాలు కోల్పోకుండా, తేనీటి ప్రయోజనాలతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే లవంగం టీ ఒకసారి ట్రై చేసి చూడండి.

లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు

లవంగాలు శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లకు పెట్టింది పేరు. ఫ్రీరాడికల్స్ చేసే నష్టాన్ని తగ్గించి ఇవి ఇమ్యూనిటీ పెంచుతాయి. వీటిలో ఉండే యుజెనాల్ పంటి నొప్పులు, చిగుళ్ల నొప్పులు, నోటి అల్సర్లకు ఔషధంగా పనిచేస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు గొంతు నొప్పి, దగ్గు, తలనొప్పికి ఉపశమనం ఇస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి, అలాగే బరువు తగ్గడానికి కూడా యుజెనాల్ ఉపయోగపడుతుంది. జీవక్రియ సజావుగా సాగడానికి లవంగాలు దోహదం చేస్తాయి. లవంగాలలోని గుణాలు ఫ్రీరాడికల్స్‌తో పోరాడడం వల్ల మీ చర్మం కూడా ప్రకాశవంతమవుతుంది. అలాగే లవంగాల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఒక అధ్యయనం కూడా నిరూపించింది.

లవంగం టీ ఎలా చేయాలి?

లవంగాల వల్ల ప్రయోజనాలు దక్కాలంటే లవంగం టీ ట్రై చేసి చూడండి. ముందుగా ఒక టీ స్పూన్ లవంగాలు పొడి చేయండి. ఒక గిన్నెలో కప్పు నీటిని తీసుకుని అందులో ఈ లవంగాల పొడిని జత చేయండి. ఇప్పుడు నీటిని బాగా మరిగించండి. మూడు నాలుగు నిమిషాలు మరిగాక కప్పులో పోసుకుని తాగొచ్చు. లేదా కాస్త చల్లారిన తరువాత తాగొచ్చు. టీ పొడి కూడా కలపాలనుకుంటే నీళ్లు మరిగేటప్పుడు కాస్త టీ పొడి కూడా వేయొచ్చు. కొంచెం తీయగా ఉండాలనుకుంటే కాస్త తేనె కూడా కలపొచ్చు. ఉదయాన్నే ఈ లవంగం టీ తాగడం వల్ల మీ శరీరం, మనస్సు ఉల్లాసంగా ఉంటాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్