Humidity in air: వర్షం వల్ల ఇంట్లో తేమగా ఉందా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..
Humidity in air: వర్షాకాలంలో ఇంటి లోపల తేమ శాతం పెరిగిపోయి ఉక్కపోతగా అనిపిస్తోందా? అయితే ఈ పరిష్కారాలు తెల్సుకోండి.
గదిలో తేమ తగ్గించే మార్గాలు (shutterstock)
వర్షాకాలం మొదలయ్యిందంటే బయట వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ ఇంటి లోపల మాత్రం ఉక్కపోత ఒక్కోసారి భరించలేనంత ఉంటుంది. దానికి కారణం గాలిలో తేమశాతం పెరగడమే. గోడలు, స్లాబు మీద చెమ్మగా ఉండటం గమనిస్తూనే ఉంటాం. దానివల్ల ఇంటి లోపల బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. వాటివల్ల అనారోగ్యాల బారిన పడతాం. తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశమూ ఉంటుంది.

ఈ సమస్య తగ్గించుకోడానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. తేమ శాతం తగ్గించుకోవచ్చు. అవేంటో తెల్సుకోండి.
- కిచెన్‌లో, బాత్రూంలలో తేమ మరింత ఎక్కువనిపిస్తుంది. కాబట్టి వంట చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడే కాకుండా గదిలో తేమ ఎక్కువుంది అనిపిస్తే.. వెంటనే ఎగ్జాస్ట్ లేదా వెంటిలేషన్ ఫ్యాన్ ఆన్ చేసి పెట్టండి. దానివల్ల ఉక్కపోత తగ్గుతుంది.
- అలాగే ఏసీ ఆన్ చేసి పెట్టడం వల్ల కూడా గదిలో తేమ పూర్తిగా తగ్గిపోతుంది. మరీ ఉక్కపోతగా అనిపిస్తే కాసేపు ఏసీ ఆన్ చేసి పెట్టుకోండి. గది చల్లగా కూడా అవుతుంది.
- మీరుండే ప్రాంతంలో కాలంతో సబంధం లేకుండా తేమ ఇబ్బంది పెడితే.. డీ హ్యుమిడిఫయర్లు వాడండి ఇవి ఆన్ చేసి గదిలో పెడితే తేమను పూర్తిగా తొలిగిస్తాయి. ఇంటి లోపల వాతావరణాన్ని పొడిగా, చల్లగా ఉంచుతుంది.
- ఇంటి లోపల మొక్కలను పెంచుకునే అలవాటు మంచిది. అవి గదిని శుభ్రపరుస్తాయి. కానీ వాటివల్ల ఇంటి లోపల తేమ శాతం పెరుగుతుంది. అందుకే మీకు భరించలేనంత తేమ సమస్య అనిపిస్తే మొక్కలను బయట పెట్టేయండి.
- ఉప్పుకు తేమను గ్రహించే గుణం ఉంటుంది. కాబట్టి రాళ్ల ఉప్పును తెచ్చి గదిలోని మూలల్లో పెట్టాలి. దానివల్ల కొద్దిగా సమస్య తగ్గుతుంది.
- గదిలో కిటికీలు వీలైనప్పుడల్లా బారుగా తెరిచి పెట్టాలి. స్వచ్ఛమైన గాలి రావడంతో పాటూ తేమ ఉండదు.
- ఏదైనా పైప్ లైన్ లీకేజీ ఉన్నా వెంటనే మరమ్మతు చేయించుకోవాలి. వాటి లీకేజీ వల్ల గోడల్లో తేమ పెరగదు.
- వర్షాకాలంలో బట్టలు తొందరగా ఆరవు. అందుకే ఇంట్లోనే కాస్ తడిగా ఉన్న బట్టలు వేసి ఆరబెడతాం. అలా చేస్తే తేమ మరింత పెరిగిపోతుంది.
టాపిక్