Clothes storage: బీరువాలో బట్టలు ఇలా సర్దారంటే, ఏ మూలలో ఉన్నా టక్కున దొరికేస్తాయి-know best tips to organize clothes in almairah and cupboard with organizers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Clothes Storage: బీరువాలో బట్టలు ఇలా సర్దారంటే, ఏ మూలలో ఉన్నా టక్కున దొరికేస్తాయి

Clothes storage: బీరువాలో బట్టలు ఇలా సర్దారంటే, ఏ మూలలో ఉన్నా టక్కున దొరికేస్తాయి

Koutik Pranaya Sree HT Telugu
Aug 23, 2024 10:30 AM IST

Clothes storage: బీరువాల్లో, కబోర్డులో బట్టలు సర్దడానికి కొన్ని చిట్కాలున్నాయి. తక్కువ ధరలోనే దొరికే కొన్ని ఆర్గనైజర్లు వాడి సర్దారంటే ఎంత పాతబట్టలైనా మీ కనుచూపు మేరలో ఉంటాయి. టక్కుమని తీసుకోవచ్చు. అలా సర్దడానికి చిట్కాలు తెల్సుకోండి.

బట్టలు సర్దడానికి చిట్కాలు
బట్టలు సర్దడానికి చిట్కాలు (amazon.in)

ఎంత చక్కగా సర్దినా సరే అవసరమున్న బట్టలు, వస్తువులు టక్కుమని దొరకడం మాత్రం కష్టమే. ఈ సమస్య ప్రతి ఇంట్లోనూ ఉండేదే. ముఖ్యంగా బీరువాల్లో, వార్డ్‌రోబ్ లో సర్దుకున్న బట్టలు సర్దడం మరింత కష్టం. అవసరమున్నవి కావాలంటే పైన చక్కగా సర్దిన బట్టలన్నీ చిందరవందర అయిపోతాయి. పాత బట్టల్లాంటివైతే అసలు దొరకనే దొరకవు. ఈ సమస్య రావొద్దంటే కొన్ని టిప్స్ తెల్సుకోండి.

షెల్ఫ్ డివైడర్లు

షెల్ఫ్ డివైడర్లు
షెల్ఫ్ డివైడర్లు (amazon.in)

బీరువాలు కాస్త వెడల్పుగానే ఉంటాయి. నాలుగైదు వరసల్లో పక్కపక్కన బట్టలు సర్దేస్తాం. అయితే అవి అలాగే చెక్కు చెదరకుండా ఉండాలన్నా, ఒక వరసలోని బట్టలు తీసినప్పుడు మరో వరస పాడొవ్వద్దన్నా ఈ షెల్ఫ్ డివైడర్లు వాడండి. చాలా తక్కువ ధర.. 200 రూపాయల్లో పది దాకా కాస్త తక్కువ నాణ్యత ఉన్న డివైడర్లు దొరుకుతాయి. వీటిని బట్టల వరసలో మధ్యలో పెట్టారంటే చక్కగా సెట్ అయిపోతాయి. వీటి కింది భాగంలో హుక్ లాంటిదుంటుంది. వాటికీ కొన్ని సామాన్లు తగిలించుకోవచ్చు.

బ్రా, ఇన్నర్స్ ఆర్గనైజర్

ఆర్గనైజర్
ఆర్గనైజర్ (amazon.in)

బీరువా లేదా వార్డ్ రోబ్ తలుపుకే వీటిని అమర్చుకోవచ్చు. పేరుగు ఇవి బ్రా లేదా ఇన్నర్స్ ఆర్గనైజర్లు అయినా కూడా.. వీటిలో కర్చీఫ్స్, చిన్నవి ముఖ్యమైన వస్తువులు లాంటివి పెట్టేయొచ్చు. చిన్న వస్తువుల కోసం తరచూ వెతక్కర్లేకుండా ఉంటాయి. తలుపుకు రంధ్రాలేమీ చేయక్కర్లేదు. వీటికి అడెసివ్ స్టిక్కర్ ఉంటుంది. అది తీసి ఎక్కడైనా అతికించొచ్చు.

షర్ట్ ఆర్గనైజర్

షర్ట్ ఆర్గనైజర్
షర్ట్ ఆర్గనైజర్ (amazon)

అబ్బాయిల షర్టులు, టీషర్టులు చక్కగా ఐరన్ చేసి మరీ సర్దుతాం. కానీ ఒక్కటి తీస్తే మిగతావన్నీ ముడతలైపోతాయి. అందుకే ఈ టీ షర్ట్ ఆర్గనైజర్లు పక్కాగా ప్రయత్నించండి. చూడ్డానికి ట్రేల లాగా ఉంటాయివి. ఒకదాని మీద ఒకటి సర్దేసి పేర్చేయడమే. కింద ఉన్న షర్టు ఆర్గనైజర్ తీయాలంటే పైనవేమీ జరపక్కర్లేదు. అలా మెల్లగా బయటికి తీసేయొచ్చు. దేనికదే బయటకు సులువుగా వస్తుంది.

పట్టు చీరలకు, డ్రెస్సులకు

కొలాప్సబుల్ ఆర్గనైజర్
కొలాప్సబుల్ ఆర్గనైజర్ (amazon.in)

బీరువా అంటేనే ఆడవారికే అన్నట్లుంటాయి వాళ్ల బట్టలు. ఏదో నామమాత్రానికి ఒక షెల్ఫు అబ్బాయిలకు ఇస్తారంటే. సరిపోవట్లేదని ఇంకో బీరువా కొన్నా అందులోనూ ఆడవారికే పెద్ద వాటా కావాలి. ఏదేమైనా ఖరీదైన పట్టుచీరలు, డ్రెస్సులు సర్దడం మాత్రం కాస్త కష్టమైన పనే. ముఖ్యంగా పట్టు చీరలు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు అడుగున ఉన్న చీర మీద పైవాటి బరువంతా పడుతుంది. అది మరీ ముడతలు పడుతుంది. పాడవుతుంది కూడా. అలా బరువు పడొద్దంటే ఈ కొలాప్సబుల్ ఆర్గనైజర్లు ట్రై చేయొచ్చు. పై చీరల బరువు కిందదాకా పడదు. తీయడమూ సులువే. అవసరం లేనప్పుడు మడిచి పక్కన పెట్టేయొచ్చు.

వీటితో మరో సమస్య కూడా తీరుతుంది. సాధారణంగా బీరావాల్లో, వార్డ్ రోబుల్లో పైన షెల్ఫులు కాస్త ఎత్తుగా ఉంటాయి. కానీ బట్టలు అంతెత్తున పేరిస్తే కిందపడతాయి. అక్కడ వీటిని వాడితే పైదాకా సర్దుకోవచ్చు. చీరలు, డ్రెస్సులు వేటికవే సర్దేస్తే సులువుగానూ దొరుకుతాయి.

డ్రా డివైడర్

డ్రా ఆర్గనైజర్
డ్రా ఆర్గనైజర్ (amazon)

డ్రా లో చాలా ముఖ్యమైన వస్తువులే పెట్టుకుంటాం. కానీ ఒక్కోసారి అన్నీ కలిసిపోయి అవసరానికి అస్సలు దొరకవు. అలాంటప్పుడు కేవలం వంద రూపాయల్లో వచ్చేసే ఈ డ్రా డివైడర్ కొనేసుకుండి. పీసులు, మీటర్ల లెక్కన దొరుకుతుందిది. చాలా గట్టిగా ఉంటుంది. డ్రా మధ్యలో వేరు చేయడానికి మీకిష్టమైన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. దీనికి మధ్యలో గాట్లుంటాయి. దాంతో మరో డివైడర్ దీని మీది నుంచి సులువుగా మీరనుకున్నట్లు, నీట్ గా పెట్టేయొచ్చు.

టాపిక్