Tips To Exercise Regularly: క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యలేకపోతున్నారా? ఆలోచనల్ని మార్చుకోండిలా-know best tips to exercise regularly without any fail ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know Best Tips To Exercise Regularly Without Any Fail

Tips To Exercise Regularly: క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యలేకపోతున్నారా? ఆలోచనల్ని మార్చుకోండిలా

Koutik Pranaya Sree HT Telugu
Nov 09, 2023 09:15 AM IST

Tips To Exercise Regularly: వ్యాయామం మొదలెట్టడం.. కొన్ని రోజులకే మధ్యలో ఆపేయడం.. మన ఆలోచనల్లో లోపం వల్లే ఇది జరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలో చూసేయండి.

వ్యాయామం చేయడానికి టిప్స్
వ్యాయామం చేయడానికి టిప్స్ (pexels)

మనం మంచి జీవన శైలిని పాటించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా రోజు వారీ వ్యాయామం అనేది ఎంతో అవసరం. అందుకనే చాలా మంది రోజూ వాకింగ్‌, వ్యాయామాలు చేయాలని మొదలు పెడతారు. వారం రోజుల తర్వాత ఆ ఉత్సాహం తగ్గిపోతుంది. ఒళ్లు నొప్పులుగా అనిపిస్తాయి. దీంతో మళ్లీ వాటి వైపుకు వెళ్లడానికి బద్ధకించేస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మరి ఇలాంటి మానసిక స్థితిని అధిగమించి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలంటే మెదడును ఇలా ట్యూన్‌ చేసుకోమని నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు. చదివేసి పాటించే ప్రయత్నం చేయండి.

ట్రెండింగ్ వార్తలు

ముందు ఈ ఆలోచనల్ని మానుకోండి :

క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడానికి ముందు మన మెదడులోంచి కొన్ని ఆలోచనల్ని తొలగించుకోవాలి.

  • నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు.
  • నేను రోజంతా చాలా బిజీ బిజీగా ఉంటున్నాను. ఖాళీయే దొరకడం లేదు.
  • నేను రోజు వారీ పనులతో బాగా అలసిపోతున్నాను. ఇంత బలహీనంగా ఉన్నప్పుడు వ్యాయామాలు అవసరమా?
  • వ్యాయామం మొదలు పెడితే ఒళ్లంతా నొప్పులు పెడుతున్నాయి. నా శరీరానికి ఇది సెట్‌ కాదు.
  • నేను వాకింగ్‌ చేయడానికి షూస్‌ లేవు. ట్రెడ్ మిల్‌ లేదు. ఎక్విప్‌మెంట్‌ ఏమీ లేదు. ఎలా చేయడం.
  • నేను ఇప్పటికే చాలా లావుగా ఉన్నాను. వయసూ మీద పడుతోంది. ఈ వయసులో నాకివన్నీ అవసరం లేదు.

ఇలాంటి నెగిటివ్‌ ఆలోచనలు ఏమైనా ఉంటే ముందు వాటిని మీ నుంచి తీసేయండి.

ఇలాంటి ఆలోచనా తీరుతో ఉండండి :

  • రోజూ వ్యాయామం చేయకపోతే నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నట్టు. దాన్ని మళ్లీ ఎవరు తీసుకొచ్చి ఇస్తారు?
  • అందరి కోసం నేను కష్టపడుతున్నా. రోజులో నాకోసం నేను ఈ సమయాన్ని కేటాయించుకోవాల్సిందే.
  • నేను రోజూ కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే.
  • ఒక్కరమే చేయాలంటే బోర్‌గా అనిపిస్తుంది. స్నేహితులకూ దీన్ని అలవాటు చేద్దాం. కలిసి చేయడం వల్ల వారి ఆరోగ్యమూ బాగుంటుంది. బంధాలూ మెరుగవుతాయి.
  • ఒక్క వాకింగ్‌లు, జాకింగ్‌లు అనేముంది? ఆటలు, డ్యాన్సులతోనూ వ్యాయామం చేసేద్దాం. సరదా సరదా ఫిట్‌నెస్‌ యాక్టివిటీలను సృష్టించుకుందాం.
  • ఓ రెండు కేజీల బరువు తగ్గి చూద్దాం. నాజూగ్గా మారితే ఈ వయసులో అయినా సరే నేను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటాను.

ఇలాంటి పాజిటివ్ దృక్పథాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోండి. ఎందుకంటే మనంతట మనం సెల్ప్‌ మోటివేషన్‌తో లేకపోతే ఎవ్వరూ మనకీ విషయంలో ప్రోత్సాహాన్ని ఇవ్వరు.

WhatsApp channel