Speech Development In Children । పిల్లలు ఆ వయస్సు నుంచి మాట్లాడటం ప్రారంభిస్తారు, మాటలు ఆలస్యం అయితే?-know at what age children start talking reasons for delayed speech and language milestones ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Know At What Age Children Start Talking, Reasons For Delayed Speech And Language Milestones

Speech Development In Children । పిల్లలు ఆ వయస్సు నుంచి మాట్లాడటం ప్రారంభిస్తారు, మాటలు ఆలస్యం అయితే?

Speech Development In Children
Speech Development In Children (Unsplash)

Speech Development In Children: పిల్లలు ఏ వయస్సులో మాట్లాడటం ప్రారంభిస్తారు, మాటలు ఆలస్యం కావడానికి కారణాలు, వయసు ప్రకారంగా పిల్లలు చేరుకునే భాషా మైలురాళ్లను తెలుసుకోండి

Speech Development In Children: చిన్న పిల్లలు మాట్లాడుతుంటే ఎంతో అందంగా ఉంటుంది. వారి ముద్దుముద్దు మాటలు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆయితే కొంతమంది పిల్లలు అసలేం మాట్లాడరు, లేదా వారికి మాటలు రావడం ఆలస్యం కావచ్చు. దీనివల్ల పిల్లలు ఏది తెలియజేయలేకపోతారు, ఇది వారి తల్లిదండ్రులకు ఆందోళన కలిగించవచ్చు. అసలు పిల్లలకు ఏ వయసులో మాటలు రావడం ప్రారంభిస్తాయి, వారు వారి మాతృభాషను ఏ వయసులో నేర్చుకుంటారు. మాటలు ఆలస్యం కావడానికి కారణాలు ఏమిటి? తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

అందరి పిల్లల్లో నైపుణ్యాలు ఒకేలా ఉండవు. ఒకే కుటుంబంలోని పిల్లల మధ్య కూడా మాటలు పలకడం, భాష నేర్చుకోవడం అనేది మారుతూ ఉంటుంది. వారు పెరిగేకొద్దీ కాలక్రమేణా వారిలో భాషాభివృద్ధి కూడా జరుగుతుంది. పిల్లల్లో మాట్లాడే సామర్థ్యం ఒకేలా ఉండనప్పటికీ, సాధారణంగా పిల్లల్లో మాటలు ఎప్పుడు మొదలవుతాయి అని చెప్పటానికి కొన్ని నమూనాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.

  • 1 నుండి 3 నెలల వయస్సు వరకు పిల్లలు ఏడుస్తారు, కూస్తారు.
  • 4 నుండి 6 నెలల వయస్సులో పిల్లలు నిట్టూర్చడం, గుసగుసలు చేయడం, అరువడం, నవ్వడం, ఏడ్వడం, ఈ ఏడుపులోనూ వివిధ శబ్దాలు చేయడం చేస్తారు.
  • 6 మరియు 9 నెలల మధ్య పిల్లలు కొన్ని శబ్దాలను ఉచ్ఛరిస్తారు. ముఖ్యంగా ఏవైనా స్వరాలు, మాటల్లోని శబ్దాలను అనుకరించడం ప్రారంభిస్తారు.
  • 12 నెలల నాటికి, శిశువు మొదటిసారిగా పదాలు పలకడం ప్రారంభిస్తారు.
  • 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు పిల్లలు దాదాపు 50 పదాలు మాట్లాడగలుగుతారు. ఇందులో రెండు, మూడు పదాలను కలిపి పదబంధాలు లేదా చిన్న వాక్యాలను పలకడం ప్రారంభిస్తారు.
  • 2 నుండి 3 సంవత్సరాల వరకు వాక్యాలు చెప్తారు, ఈ వయసులో పిల్లలు దాదాపు వారు చూసిన అన్ని వస్తువులు, చిత్రాలను గుర్తించగలరు, కనిపెట్టగలరు. అలాగే సర్వనామాలు (నేను, నువ్వు, అతను, ఆమె) , కొన్ని బహువచనాలను ఉపయోగించవచ్చు.
  • 3 నుండి 5 సంవత్సరాలు వచ్చేసరికి సంభాషణలు సుదీర్ఘంగా చేస్తారు, వాటిలో కొన్ని అర్థం కాకపోవచ్చు.
  • పిల్లలకి 5 ఏళ్లు వచ్చే సమయానికి, వారు సాధారణంగా 2,500 పదాల పదజాలం కలిగి ఉంటారు. వ్యాకరణపరంగా సరైన వాక్యాలలో మాట్లాడతారు. వారు చాలా ఎందుకు?, ఏమిటి? ఎవరు? వంటి ప్రశ్నలు అడుగుతారు.

పిల్లలు మాట్లాడలేకపోవడం, భాష అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు

పైన పేర్కొన్నట్లుగా పిల్లలు వయసు పెరిగే క్రమంలో కొద్దికొద్దిగా నేర్చుకోవడం ప్రారంభిస్తారు. పిల్లలకు 2 సంవత్సరాల వయసు వచ్చే సరికి విషయాలను 50% అర్థం చేసుకోవాలి, 3 సంవత్సరాల నాటికి 75% గురించి అర్థం చేసుకోవాలి, 4 సంవత్సరాల వయస్సులో పిల్లలకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులే చెప్పేవి మాత్రమే కాకుండా తెలియని వారెవరైనా మాట్లాడించినప్పటికీ, ఆ మాటలను వారు అర్థం చేసుకోగలగాలి. కానీ ఆలా అర్థం చేసుకోవడం లేదు మాటలకు ప్రతిస్పందించడం లేదంటే ఏదైనా సమస్య ఉందని గుర్తించాలి. కొందరికి మాటలు పలకడంలో లోపాలు (Speech Disorders), మాతృ భాషాభివృద్ధి (Language Delay) ఆలస్యంగా జరగవచ్చు.

అందుకు కొన్ని సాధారణ కారణాలు ఇలా ఉండవచ్చు..

- నాలుక లేదా అంగిలితో సమస్యలు

- ఒక నాలుక క్రింద ఉన్న మడత (frenulum of tongue) పొట్టిగా ఉండటం, ఇది నాలుక కదలికను పరిమితం చేస్తుంది

- ఓరల్-మోటార్ సమస్యలను కలిగి ఉండటం, మెదడు సంకేతాలలో లోపాలు, నాలుక, పెదవులు, దవడ మధ్య సమన్వయం లేకపోవడం.

- వినికిడి సమస్యలు, చెవిలో దీర్ఘకాలికమైన ఇన్ఫెక్షన్లు.

ఈ సమస్యలు ఉంటే సరైన వైద్యుడిని సంప్రదించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా పరిస్థితి మెరుగుపడవచ్చు.

సంబంధిత కథనం