Anti-ageing tips: ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం-know anti ageing tips signs of premature ageing and hacks to prevent it in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Know Anti Ageing Tips Signs Of Premature Ageing And Hacks To Prevent It In Telugu

Anti-ageing tips: ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 12:10 PM IST

Anti-ageing tips: అకాల వృద్ధాప్యం మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. దాని లక్షణాలు, నివారణ చర్యలు ఇక్కడ తెలుసుకోండి.

Anti-ageing tips: అకాల వృద్ధాప్య లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకోండి
Anti-ageing tips: అకాల వృద్ధాప్య లక్షణాలు, నివారణ చర్యలు తెలుసుకోండి (Photo by Nathan Anderson on Unsplash)

మీ వయస్సు పెరిగేకొద్దీ మీ చర్మం, కళ్ళు, నోటి చుట్టూ ముడతలు, గీతలు ఏర్పడటం కనిపిస్తుంది. చర్మ నిర్మాణం, బలం, ఎలస్టిసిటీకి కారణమైన కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లు బలహీనపడటం ప్రారంభిస్తాయి. అయితే కొందరిలో ఈ మార్పులు ఇతరులకన్నా వేగంగా కనిపిస్తాయి. దీనినే అకాల వృద్ధాప్యంగా పిలుస్తారు. మీరు ఆచరిస్తున్న జీవనశైలి ఫలితంగా అకాల వృద్ధాప్యం సంభవించవచ్చు. అయితే దీనిని సరిదిద్దవచ్చు. అకాల వృద్ధాప్యాన్ని ఎలా నివారించాలో మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, ఆరోగ్యకరమైన, యవ్వనమైన శరీరం మీ సొంతమవుతుంది.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్మోటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా అకాల వృద్ధాప్య సంకేతాలను ఎలా గుర్తించాలో వెల్లడించారు. ‘వృద్ధాప్యం గురించి మాట్లాడుతున్నప్పుడు గీతలు, ముడతలు తెల్ల జుట్టు సాధారణంగా గుర్తుకు వచ్చే మొదటి విషయాలు. మీ చర్మం ప్రత్యేకమైనదని గుర్తుంచుకోవడం ముఖ్యం. ప్రతి ఒక్కరికీ ఒకేరకంగా వృద్ధాప్య లక్షణాలు కనిపించవు. కానీ మీరు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారైతే, వృద్ధాప్య చర్మానికి సంబంధించిన ఈ క్రింది ఏవైనా సంకేతాలను మీరు గమనించినట్లయితే, మీరు అకాలంగా వృద్ధాప్యంలోకి ఎంటర్ అవుతున్నట్టు లెక్క. చర్మం పొడిబారడం, దురద ఉండడం, చర్మం కుంగిపోవడం, చర్మం బుగ్గల్లా జారిపోవడం, ఛాతీ చుట్టూ హైపర్‌పిగ్మెంటేషన్‌ ఉండడం వంటి లక్షణాలు అకాల వృద్ధాప్య లక్షణాలను సూచిస్తాయి..’ అని వివరించారు.

అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే అంశాల గురించి ఆమె ఇలా వివరించారు. ‘కొల్లాజెన్, ఎలాస్టిన్ కోల్పోవడం వల్ల మీ చర్మం యవ్వనాన్ని, అలాగే ఎలస్టిసిటీని కోల్పోతుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రోటీన్‌లు తగ్గినప్పుడు మీ చర్మం నిస్తేజంగా మారుతుంది. ముడతలు పడుతుంది. దీర్ఘకాలికంగా సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు కనిపిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పర్యావరణ, జీవనశైలి కారకాల శ్రేణి కూడా మన రూపాన్ని, అనుభూతిని ప్రభావితం చేస్తుంది. అధిక స్థాయిలో చక్కెర, కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్, కెఫిన్‌తో కూడిన చెడు ఆహారం నష్టం చేకూరుస్తాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను కలిగిస్తాయి. అదేవిధంగా ధూమపానం కేవలం అంతర్గత నష్టాన్ని కలిగించదు. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని కలిగించడం ద్వారా మీ చర్మంలో అకాల వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తుంది. మీ సిస్టమ్‌లో యాంటీఆక్సిడెంట్ల కంటే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ ఉన్న ఫలితంగా చర్మం కుంగిపోతుంది. ముడతలు పడుతుంది. చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. నిద్ర లేకపోవడం, మానసిక, భావోద్వేగ ఒత్తిడి కూడా మీ చర్మాన్ని వేగంగా వృద్ధాప్యం చెందేలా చేస్తాయి..’ అని వివరించారు.

అకాల వృద్ధాప్యం రాకుండా నివారణ చర్యలు

1. Protect from UV rays: యూవీ కిరణాల నుంచి రక్షణ

అల్ట్రావయొలెట్ కిరణాల నుండి మీ ముఖాన్ని రక్షించుకోవడం మీరు చేయగలిగే సులభమైన పనులలో ఒకటి. సూర్య రశ్మి బలంగా ఉండే పగటిపూట మీరు నేరుగా ఎండలో గడిపే సమయాన్ని పరిమితం చేయండి. మీ నుదురు, ముక్కు, కళ్లకు నీడనిచ్చేలా టోపీ ధరించండి. సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడండి. చలికాలంలో కూడా బయటకు వెళ్లేటప్పుడు ఎస్‌పీఎఫ్ 30, లేదా అంతకంటే ఎక్కువ ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను ఎంచుకోండి. అలాగే సన్‌స్క్రీన్ యూవీఏ, యూవీబీ కిరణాల నుండి రక్షణ కల్పించే సన్ స్క్రీన్ వాడాలి. సన్‌స్క్రీన్‌ని తరచుగా అప్లై చేయాలి. మీరు ఎండలో ఉండవలసి వస్తే వదులుగా, తేలికైన, చర్మాన్ని కవర్ చేసే దుస్తులు ధరించండి.

2. Consume more antioxidants: యాంటాక్సిడెంట్లు అవసరం

యాంటీఆక్సిడెంట్లు చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంతో పాటు వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవసరమైన మొత్తంలో యాంటీఆక్సిడెంట్లను పొందడానికి అత్యంత సహజమైన, సులభమైన మార్గం ఆహారం. బ్రోకలీ, బచ్చలికూర, క్యారెట్లు, అవకాడోలు, బీట్‌రూట్, ముల్లంగి, పాలకూర, చిలగడదుంపలు, గుమ్మడికాయ, బెర్రీలు, యాపిల్స్, ఎర్ర ద్రాక్ష, రేగు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు త్రాగాలి.

3. Cleanse and use an exfoliating toner: ముఖం తరచూ కడుక్కోండి

ముఖాన్ని తరచూ కడుక్కోవడం వల్ల, ముఖ్యంగా ఉదయం సాయంత్రం రెండు పూటలా కడగడం వల్ల దుమ్ము, దూళి, జిడ్డు వదులుతుంది. మొటిమలు వచ్చే ఆస్కారం తగ్గుతుంది. మేకప్ వేసుకున్నట్టయితే మేకప్ రిమూవర్‌తో తొలగించడం అవసరం. ఇందుకోసం తగిన క్లెన్సర్ వాడాలి. గోరు వెచ్చని నీటితో కడగాలి. మృదువైన టవల్ ఉపయోగించి తడవాలి. దీని వల్ల చర్మంపై చిరాకు ఉండదు. సహజసిద్ధమైన నూనెలు పోకుండా ఉంటాయి. ఆల్ఫా, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్, రోజ్ వాటర్, గ్రీన్ టీ, విటమిన్ ఇ, విటిమన్ సి ఉండే క్రీమ్‌లు వాడొచ్చు.

4. Moisturise: తేమ

మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ప్రతి ఉదయం లేదా పడుకునే ముందు ఫేషియల్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. మాయిశ్చరైజర్‌లోని నూనెలు తేమను లాక్ చేసి నీరు బయటకు రాకుండా చేస్తాయి. విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌, విటమిన్ ఎ లేదా రెటినాయిడ్స్‌తో కూడిన లోషన్‌ను వాడడానికి ప్రయత్నించండి. చర్మం పొడి బారితే ముడుతలను మరింత అధ్వాన్నంగా కనిపించేలా చేస్తుంది.

5. Exercise and sleep well: వ్యాయామం, నిద్ర

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఒత్తిడి తగ్గి నిద్ర బాగా వస్తుంది. అలాగే చర్మం, ఎముకలు, మీ మానసిక స్థితి మెరుగుపడుతాయి. వ్యాయామం వల్ల మీ చర్మం నుంచి మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఎండార్ఫిన్లు పెరగడం, కార్టిసాల్ తగ్గడం వల్ల చర్మం అకాల వృద్ధాప్యం నుంచి బయటపడుతుంది.

WhatsApp channel