Betel Nut Benefits : వక్క లెక్కే వేరు.. ఇవి తింటే మీకు తెలియకుండానే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది!-know amazing health benefits of betel nuts vakkalu uses arecanut benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Betel Nut Benefits : వక్క లెక్కే వేరు.. ఇవి తింటే మీకు తెలియకుండానే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది!

Betel Nut Benefits : వక్క లెక్కే వేరు.. ఇవి తింటే మీకు తెలియకుండానే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది!

Anand Sai HT Telugu
Jun 21, 2024 04:30 PM IST

Betel Nuts Benefits : వక్కలు ఎక్కువగా పూజ సమయంలో ఉపయోగించడం చూస్తుంటాం. కొంతమంది తమలపాకుతో కలిపి తింటారు. దీనితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వక్కల ఆరోగ్య ప్రయోజనాలు
వక్కల ఆరోగ్య ప్రయోజనాలు (Unsplash)

తమలపాకుల్లో వక్క, సున్నం కలిపి తింటే జీర్ణక్రియకు మంచి జరుగుతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇందులో కలిపే వక్కలతో కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. అసలు ఈ గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అవును వక్కలు నిజానికి అనేక తీవ్రమైన వ్యాధులను నయం చేయడంలో చాలా సహాయపడుతాయి. మందులు కూడా పనికిరాని వ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అందుకే మన పూర్వీకులు దీనిని ఎక్కువగా తినేవారు. పూజ సమయంలో ఈ వక్కలను తీసుకురావడం చూస్తుంటాం. దీని వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..

క్రిములను చంపుతుంది

వక్కలు కడుపులోని క్రిములను చంపుతుంది. కానీ అతిగా తినకూడదని గుర్తుంచుకోండి. అదేవిధంగా వక్కలు దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం దీనిని దంచి దంతాలకు మర్దన చేయడం వల్ల దంత వ్యాధులు నయమై నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

నొప్పిని తగ్గిస్తుంది

మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లయితే వక్కలు తీసుకోవడం మంచిది. ఇది మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే, ఇది వన్-వే రిలీవర్‌గా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ని తగ్గించి, ఎముకలకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి.

రక్తపోటు

మీరు అధిక రక్తపోటు సమస్యతో పోరాడుతున్నట్లయితే వక్కలు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే వైద్యుల సలహా మేరకు తీసుకోండి.

అరటితో కలిపి తింటే

భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరగడానికి కూడా వక్కలు ఉపయోగపడుతుందని తెలుసా? నిజానికి ఈ కాయను అరటిపండుతో కలిపి తింటే దాంపత్యం బాగుంటుందని అంటారు. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు

వక్కల పొడితో చేసిన టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. అంతే కాకుండా ఎసిడిటీ గ్యాస్ డిస్ట్రబెన్స్, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా ఈ టీ మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ చాలా తరచుగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి. లేకపోతే, దుష్ప్రభావాలు సంభవించవచ్చు.

ఆయుర్వేదంలో

వక్కలు ఆయుర్వేద మందుల్లో కూడా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ బి6, సి, భాస్వరం, కాల్షియం, రాగి, ఐరన్ వంటి ఖనిజాలతోపాటుగా.. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు దొరుకుతాయి. ఫైటోకెమికల్స్, ఆల్కలాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి కాంపౌండ్స్ కూడా ఉంటాయి.

దంత సమస్యలు

అయితే వక్కలను మాత్రం అధికంగా తీసుకోకూడదు. వక్కపొడిని ఎక్కువగా తింటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అతిగా తింటే జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది. రోజూ వక్కపొడి నమిలితే చిగుళ్ల చికాకులకు గురి అవుతాయి. దంతక్షయం కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దంతాల శాశ్వతంగా ముదురు ఎరుపు లేదా నల్లటి రంగులోకి మారిపోయే అవకాశం ఉంటుంది.

WhatsApp channel