CCTV Camera in home: ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకునే ముందు ఈ సాంకేతిక విషయాల గురించి తెలుసుకోండి-know about these technical matters before installing cctv cameras at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cctv Camera In Home: ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకునే ముందు ఈ సాంకేతిక విషయాల గురించి తెలుసుకోండి

CCTV Camera in home: ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకునే ముందు ఈ సాంకేతిక విషయాల గురించి తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

CCTV Camera in home: ఇంటి భద్రత గురించి సీసీ కెమెరాలు పెట్టుకుంటారు. సీసీ టీవీలు పెట్టుకునే వారిసంఖ్య ఎక్కువగానే ఉంది. మీరు కూడా మీ ఇంటికి సిసిటివి కెమెరా కొనాలని ఆలోచిస్తుంటే టెక్నికల్ గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకోవాలనుకుంటే తెలుసుకోవాల్సిన విషయాలు

ఇటీవల ఓ వ్యాపారవేత్త ముంబైలో కూర్చొని తన ఉత్తరప్రదేశ్ ఇంట్లో దొంగతనాన్ని సకాలంలో ఆపగలిగాడు. తన ఇంట్లో పెట్టిన సీసీ కెమెరాల సాయంతో ఫోన్లోనే ఇంటి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. అలా ఆయన సీసీ కెమెరాలో ఇంటి దగ్గరకు దొంగలు రావడం చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా ఆ వ్యక్తి ఇంట్లో ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తపడ్డడాు. సీసీటీవీ ఇంతగా ఉపయోగపడటం ఇదే తొలిసారి కాదు. ఈ రోజుల్లో చాలా మంది తమ కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టి తమ ఫోన్లకు కనెక్ట్ చేసుకుంటున్నారు.

ఈ సీసీ కెమెరాల సాయంతో ఇంటికి దూరంగా కూర్చొని ఇంటి దగ్గర ప్రదేశంలోని ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. కానీ మీ అవసరాన్ని బట్టి సరైన సిసి కెమెరాలను కొనుగోలు చేయాలి. ఎంతోమందికి సీసీ కెమెరాలను పెట్టాలనుకున్నా కూడా అవి ఎలా పనిచేస్తాయో తెలియదు. సీసీ కెమెరాల గురించి సాంకేతికంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాలు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి.

స్టోరేజ్ సమాచారం

సిసిటివిలో స్టోరేజ్ ఉండటం చాలా ముఖ్యం. తద్వారా ఎక్కువ వ్యవధి రికార్డింగ్ లు స్టోర్ ఉంటాయి. చవకైనా కెమెరాలు రికార్డింగ్ కోసం హార్డ్ డిస్క్ లపై ఆధారపడతాయి. కానీ మంచి కంపెనీ సిసిటివి కెమెరాలు ఎక్కువ స్టోరేజీ వ్యవస్థను కలిగి ఉంటాయి. స్టోరేజ్ కెపాసిటీ తక్కువగా ఉంటే మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఎంచుకోవాలి. 32, 64 లేదా 128 జీబీ వరకు మెమొరీ కార్డ్‌ను కెమెరాలో చొప్పించడం ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

కెమెరా రిజల్యూషన్

కెమెరా రిజల్యూషన్ ఎంత మెరుగ్గా ఉంటే ఇమేజ్ క్వాలిటీ అంత మెరుగ్గా, క్లియర్ గా ఉంటుంది. మంచి సీసీటీవీ కెమెరాలు 720, 1080 పిక్సల్ రిజల్యూషన్లో వీడియోలు తీస్తాయి. అయితే, అధిక రిజల్యూషన్ ఉన్న వీడియోలకు ఎక్కువ స్టోరేజ్ అవసరం. ఉదాహరణకు, 1 మెగా పిక్సెల్ కెమెరా ఒక పూర్తి రోజు రికార్డింగ్ కోసం 38 జిబి స్థలాన్ని తీసుకుంటుంది. మీరు ఎక్కువసేపు నిరంతర రికార్డింగ్ చేయాలనుకుంటే, మీరు పెద్ద స్టోరేజీతో అంతర్గత డివిఆర్ పొందాలి.

మోషన్, ఆడియో సెన్సార్లు

సాధారణ సిసిటివి దాని లెన్స్ చూడగలిగే ప్రాంతంలో మాత్రమే వీడియోను రికార్డ్ చేయగలదు. ఇది ధ్వనిని రికార్డ్ చేయదు. కానీ మోషన్, ఆడియో సెన్సార్లు ఉన్న సీసీటీవీలు అసాధారణ శబ్దం లేదా కదలిక వచ్చిన వెంటనే మీ మొబైల్ యాప్ కు అలర్ట్ పంపుతాయి. సాధారణ సీసీ కెమెరాల కంటే వీటి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భద్రత పరంగా మెరుగ్గా ఉంటాయి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం