Fathers's age: పురుషులు ఆ వయసు తర్వాత పిల్లల్ని కంటే కొడుకులు పుట్టరంట.. ఆలస్యంగా పిల్లల్ని కంటే మరిన్ని నష్టాలు
Fathers's age: ఆలస్యంగా పితృత్వం వల్ల కలిగే ప్రమాదాలు, పిల్లల ఆరోగ్యంపై పడే పరిణామాలను తాజా అధ్యయనం ఎత్తిచూపింది.
మారుతున్న అవసరాలు, జీవనశైలి వల్ల పిల్లల్ని కనే విషయంలో అనేక మార్పులొస్తున్నాయి. చాలా మంది పురుషులు పిల్లల్ని ఆలస్యంగా కనాలని అనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఏకంగా పితృత్వాన్ని 50 ఏళ్ల దాకా వాయిదా వేస్తున్నారట. ఆ వయసు తర్వాతే పిల్లల్ని కంటున్నారు.
మహిళలకు సంతానం విషయంలో అనేక పరిమితులుంటాయి. ఒక వయో పరిమితిని మించి గర్భధారణను వాయిదా వేయలేరు. పురుషులకు కొన్ని ప్రాంతాల్లో సామాజికంగా కూడా నిబంధనలు లేని కారణంగా పితృత్వాన్ని వాయిదా వేస్తున్నారు. వాళ్లకు శరీర పరంగా కూడా అలాంటి కఠిన పరిమితులుండవు.
ఏదేమైనా, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన అధ్యయనం ప్రకారం పురుషులు ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల ఆరోగ్యానికి వచ్చే గణనీయమైన ప్రమాదాలను వెల్లడించింది. ఆలస్యంగా పితృత్వం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటే, పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనలను పెంచుతాయి.
పితృత్వంలో వైవిధ్యం:
ఈ సర్వే మన దేశానికి సంబంధించింది కాకపోయినా.. మన దగ్గరా ఆలస్యంగా పిల్లల్ని కనే దోరణి స్ఫష్టంగా కనిపిస్తోంది. ముఫ్పై ఏళ్లు దాటాక గానీ పెళ్లి చేసుకోవట్లేదు. పిల్లలు మళ్లీ వాయిదా వేస్తే 35 ఏళ్లకు మొదటి సంతానం, రెండో సంతానం నలభై ఏళ్లకు దగ్గర్లో పుట్టినా ఆశ్చర్యం లేదు. ఈ వయసు పాశ్చాత్య దేశాల్లో యాభై ఏళ్లకు చేరిపోయినట్లుంది. అక్కడ ఈ వయసులో పిల్లలను కనడం కూడా అందరూ అంగీకరించే విషయంగా మారిపోయింది. కాలేజీ ప్రొఫెసర్ల నుంచి చిన్న వృత్తులు చేసుకునే వారి దాకా ఇదే దోరణి కనిపిస్తోందట.
కెరీర్‌లో సెటిల్ అవ్వడం, ఆర్థిక స్తిరత్వం వంటి అంశాలు సాధారణంగా పితృత్వాన్ని వాయిదా వేయడానికి కారణాలవుతాయి. జీవితంలో ఏ సమయంలోనైనా తండ్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వయసు ఎక్కువున్న తండ్రులు కుటుంబాలను ప్రారంభించడానికి పునరుత్పత్తి సాంకేతిక చికిత్సల సాయం తీసుకోడానికి మొగ్గు చూపుతున్నారు.
పిల్లలపై ప్రభావం:
50 ఏళ్ల వయస్సు ఉన్న తండ్రులకు పుట్టిన పిల్లలు నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉంది. అలాగే శిశువు తక్కువ బరువుతోనూ పుట్టే అవకాశాలుంటాయి. ఇవి చిన్న విషయాలనే అనుకోడానికి లేదు. పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి ఇవన్నీ ముప్పు కలిగిస్తాయి. దీని ప్రభావం ఇంకెలా ఉంటుందో పూర్తిగా పరిశోధనలు చేయాల్సి ఉంది.
అబ్బాయిలు పుట్టరా?
ఆరోగ్య సమస్యలతో పాటే పుట్టబోయే శిశువు లింగం కూడా ఆలస్యంగా పిల్లలు కనడం వల్ల ప్రభావితం అవుతుంది. ఈ సర్వే మరో ఆసక్తికర విషయాన్నీ బయటపెట్టింది. డెబ్భై ఏళ్లలో, ఆ తర్వాత వయసులో గనక పిల్లల్ని కనాలనుకుంటే వాళ్లకు కొడుకులు పుట్టే అవకాశం తక్కువ. డెబ్భై ఏళ్లలో పిల్లలు కనడం గురించి పక్కన పెడితే ఈ విషయం లింగ నిర్ధారణకు, తండ్రి వయసుకు ఉన్న ఆశ్చర్యకర సంబంధాన్ని మాత్రం తెలియజేస్తుంది.
సమాజంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న పితృత్వ వయసు కారణంగా ఈ విషయం గురించి పరిశోధన చేశారు. దీనివల్ల ప్రజల్లో పిల్లలకు వచ్చే క్లిష్టమైన ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించడమే దాని లక్ష్యం.
టాపిక్