gynecomastia: మగవారిలో రొమ్ము పరిమాణం పెరగడానికి కారణాలేంటి? చికిత్సలేంటి?-know about gynecomastia treatments and cure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gynecomastia: మగవారిలో రొమ్ము పరిమాణం పెరగడానికి కారణాలేంటి? చికిత్సలేంటి?

gynecomastia: మగవారిలో రొమ్ము పరిమాణం పెరగడానికి కారణాలేంటి? చికిత్సలేంటి?

gynecomastia: మగవారిలో రొమ్ము పరిమాణం పెరగటం వల్ల అభద్రతా భావం మొదలవుతుంది. అనేక ఇతర సమస్యలూ ఉంటాయి. దీన్ని గైనెకోమాస్టియా అంటారు. ఈ సమస్యకు చికిత్సలేమున్నాయో వివరంగా తెల్సుకోండి.

గైనెకోమాస్టియా (Unsplash)

పురుషుల్లో ఛాతీ పరిమాణం లేదా రొమ్ము కణజాలం పెరిగితే దాన్ని గైనెకోమాస్టియా అంటారు. హార్మోన్లలో అసమతుల్యత వల్ల ఈ సమస్య మొదలవ్వచ్చు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో అసమతుల్యత దీనికి కారణం. కొన్ని రకాల మందుల వాడకం, ఆరోగ్య పరిస్థితులు, జీవన శైలిలో మార్పులు వల్ల గైనెకోమాస్టియా రావచ్చు.

దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ఆరోగ్య సమస్య అనే విషయం పక్కన పెడితే దీని వల్ల చాలా మానసికంగా మగవారిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. ధైర్యంగా ఉండలేరు. సమాజం గురించి ఆలోచించి క్రుంగిపోతారు. స్విమ్మింగ్ చేయడం లాంటివి ఇష్టపడరు. లాకర్ రూముల్లో బట్టలు మార్చుకోరు. కానీ అలాగే ఇబ్బంది పడకుండా సమస్య పరిష్కారం కోసం వీలైనంత తొందరగా వైద్యుల్ని సంప్రదించాలి. గైనెకోమాస్టియా కు చికిత్స తీసుకోవాలి.

మగవారి రొమ్ము పరిమాణం పెరగడానికి కారణాలు అడిపోజ్ కణజాలం(అసాధారణంగా పెరిగిన రొమ్ము గ్రంథి), గ్లాండులర్ కణజాలం (అదనంగా కొవ్వు చేరడం), చర్మం (పై చర్మం సాగిపోవడం) సాధారణంగా ఇవే అయి ఉండవచ్చు. లేదంటే కొన్నిసార్లు ఏవైనా మందుల వాడకం ప్రభావం వల్ల గైనెకోమాస్టియా సమస్య మొదలవుతుంది. కారణం మందులే అని తెల్సినప్పుడు ఆ మందుల వాడకం ఆపేస్తే సమస్య తగ్గిపోతుంది.

ఊబకాయం, ఆల్కహాల్, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ సమస్యలు, కాలేయం పనిచేయకపోవడం కూడా దీనికి కారణాలు అయి ఉండొచ్చు. ఏదేమైనా కారణం స్పష్టంగా తెల్సుకోడానికి వైద్యుల్ని సంప్రదిస్తే సత్వర చికిత్స అందుతుంది.

ఎలాంటి చికిత్సలుంటాయి?

లైపో సక్షన్:

ఈ ప్రక్రియలో చంక దగ్గర చిన్న కోత పెట్టి అదనపు కొవ్వును తొలగిస్తారు. చాతీని సరైన అకృతిలోకి వచ్చేలా ఈ ప్రక్రియ చేస్తుంది. పవర్-అసిస్టెడ్ లైపోసక్షన్ (PAL), అల్ట్రాసోనిక్-అసిస్టెడ్ లిపోలిసిస్ (UAL) లాంటివి సామర్థ్యం, భద్రత నిచ్చే చికిత్సా విధానాలు.

గ్లాండ్ ఎక్సిషన్:

ఈ ప్రక్రియలో పెరిగిన గ్లాండులర్ కణజాలాన్ని తీసేస్తారు. చనుమొన చుట్టూ ఉండే నలుపు భాగం బయట లేదా లోపలి వైపు కోత చేసి ఈ కణజాలాన్ని తొలగిస్తారు. సమస్య తీవ్రత బట్టి అనస్తీషియా ఇచ్చి ఈ చికిత్స చేస్తారు.

చికిత్స తర్వాత కోలుకోవడం:

గైనెకోమాస్టియా చికిత్స కోసం లైపో సక్షన్, గ్లాండ్ ఎక్సీషన్ చేస్తారు. దీనివల్ల ఆకృతిలో మార్పు వస్తుంది. సాధారణ స్థితికి రొమ్ము వచ్చేస్తుంది. ముఖ్యంగా మానసిక ధైర్యం పెంచుతుంది. సర్జరీ తాలూకు గాయం కూడా చాలా చిన్నగా ఉంటుంది. తక్కువ సమయంలో కోలుకుంటారు. దీని గురించి ఆందోళన పడకుండా సరైన చికిత్స తీసుకోవడం మేలు. ఇప్పుడు అనేక అత్యాధునిక చికిత్స విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయని ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ధ్రువ్ చావన్ అన్నారు.