9-1 Rule: ఈ తొమ్మిది అంకెలతో.. మీ జీవితం మారిపోతుంది..-know 9 1 rule which changes your life completely ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  9-1 Rule: ఈ తొమ్మిది అంకెలతో.. మీ జీవితం మారిపోతుంది..

9-1 Rule: ఈ తొమ్మిది అంకెలతో.. మీ జీవితం మారిపోతుంది..

Koutik Pranaya Sree HT Telugu
Jul 07, 2024 05:00 AM IST

9-1 Rule: ఒకటి నుంచి తొమ్మిది దాకా ప్రతి అంకె ఒక ఆరోగ్య సూత్రం చెబుతుంది. వాటిని గుర్తుపెట్టుకుని పాటిస్తే మంచి లాభాలు పొందొచ్చు.

9-1 రూల్
9-1 రూల్ (freepik)

రోజూ ఎంత సమయం నిద్రపోవాలి? ఎన్ని నీళ్లు తాగాలి? అసలు రోజూవారీ జీవితం ఎలా ఉంటే ఆరోగ్య సమస్యలు రావు అనే సందేహం వస్తూ ఉంటుంది. ఎలాంటి గజిబిజి లేకుండా ఈ 9-1 రూల్ గుర్తుంచుకోండి. ఒక్కో అంకె ఒక్కో ఆరోగ్య సూత్రం చెబుతుంది. అవేంటో వివరంగా తెల్సుకోండి. ఈ తొమ్మిది అంకెలు గుర్తుంచుకుంటే మీరు రోజూవారీ చేసే ప్రతి విషయంలో స్పష్టత ఉంటుంది.

yearly horoscope entry point

9:

నంబర్ 9 మీరు నడవాల్సిన అడుగులను సూచిస్తుంది. అంటే రోజుకు కనీసం 9000 అడుగులు వేస్తే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

8:

ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగాలని నంబర్ 8 సూచిస్తుంది. అంటే రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగితే డిహైడ్రేషన్ సమస్య ఉండదు. నీళ్లు కనీసం ఇన్ని తాగాలని గుర్తుంచుకున్నా కూడా దీనికే పరిమితం అవ్వక్కర్లేదు. మీకు దాహం వేసిన ప్రతిసారి ఆగకుండా నీళ్లు తాగడమే మంచి సూత్రం.

7:

రోజుకు కనీసం 7 గంటల నిద్ర తప్పకుండా ఉండాలి. దానివల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. నిద్రలేమి వల్ల దాని ప్రభావం రోగ నిరోధక శక్తి మీద, రోజంతా మీరు చేసే పనుల మీద కూడా పడుతుందని గుర్తుంచుకోండి.

6:

ఆరు నిమిషాలు ధ్యానం చేయడం మీ రోజూవారీ దినచర్యలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ప్రశాంతత పెరుగుతుంది. లేదా మీ ఇష్ట దైవం ముందు కూర్చుని కనీసం 6 నిమిషాలన్నా కళ్లు మూసుకుని ప్రార్థన చేస్కోండి.

5:

తాజా కూరగాయలు, పండ్ల ముక్కలు రోజుకు 5 సార్లు కొద్దికొద్దిగా అయినా తినాలి. తాజా ఆహారం మీ జీవితంలో భాగం అయిపోవాలి. అంటే మీరు అన్నం తినేటప్పుడు పక్కన కీరా, ఉల్లిపాయ, టమాటా ముక్కలు తినడం. లేదంటే ఏవైనా పండ్ల ముక్కలు, సలాడ్లు తినడం అలవాటు చేసుకోవాలి.

4:

రోజంతా కూర్చునే పనిచేసేవాళ్లు కనీసం పని మధ్యలో 4 చిన్న బ్రేకులు తీసుకోవాలి. ఎక్కువ సేపు అక్కర్లేదు. అలా కాసేపు నడిచి వచ్చి మళ్లీ మీ పని మొదలు పెట్టొచ్చు. అస్సలే కదలకుండా కూర్చోవడం మంచిది కాదు.

3:

రోజుకు 3 సార్లు కడుపునిండా తినడం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అల్పాహారం తినాలి. ఏమీ తినకుండా పడుకోవడం కూడా మంచిది కాదు.

2:

మీరు రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత మాత్రమే నిద్ర పోవాలి. అంటే మీ భోజనానికి, నిద్రకి కనీసం రెండు గంటల విరామం ఉండాలి. పూర్తిగా ఆహారం జీర్ణం అవుతుంది. ప్రశాతంగా నిద్ర పడుతుంది.

1:

రోజూ కనీసం ఏదో ఒకటి శారీరక శ్రమ ఉండేలా చూడాలి. ఏదైనా ఒక ఆట ఆడటం, లేదా జిమ్ వెళ్లడం, డ్యాన్స్ చేయడం.. ఏదో ఒకటి తప్పకుండా చేయడం అలవాటు చేసుకోండి.

ఈ తొమ్మిది అంకెలను, అవి చెప్పే ఆరోగ్య సూత్రాలు గుర్తుంచుకోండి. సింపుల్ గా అన్నీ ఫాలో అయిపోవచ్చు.

Whats_app_banner