Telugu News / Lifestyle /
పరీక్షల సమయం.. మీ పిల్లలకు ఈ 12 అందేలా చూడండి
ఎగ్జామ్స్ సీజన్: పేరెంటింగ్ టిప్స్ (HT_PRINT)
పరీక్షలు పిల్లలకు ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ కాలంలో వారి ఆరోగ్యం పట్ల ఇంకాస్త శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. పరీక్షా సమయంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు చదవండి.
పిల్లలు పరీక్షల్లో విజయవంతంగా రాణించాలంటే తల్లిదండ్రులు పరీక్షల సీజన్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ పేరెంటింగ్ టిప్స్ అనుసరిస్తే మీ పిల్లలు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
- తగినంత నిద్ర లభించేలా చూడండి: నిద్ర లేకపోవడం వల్ల పిల్లల గ్రహణ శక్తి, ఏకాగ్రత సామర్థ్యాలు తగ్గుతాయి. ప్రతి రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోయేలా మీ పిల్లలను ప్రోత్సహించండి.
- సమతుల్య ఆహారాన్ని అందించండి: పరీక్షల సమయంలో తగినంత ఓపిక ఉండేందుకు ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం అవసరం. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రొటీన్ గల ఆహారం, తృణధాన్యాలు తినేలా మీ పిల్లలను ప్రోత్సహించండి.
- వ్యాయామాన్ని ప్రోత్సహించండి: వ్యాయామం ఒక అద్భుతమైన ఒత్తిడి నివారిణి, మీ పిల్లల మనస్సును తేలికపరచడానికి, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇందుకోసం నడక లేదా జాగింగ్ వంటి శారీరక చురుకుదనం కలిగించే తేలికపాటి వ్యాయామాలు ఎంచుకునేలా చూడాలి.
- ఎమోషనల్ సపోర్ట్: మీరు వారికి అండగా ఉన్నారని మీ పిల్లలకు తెలియజేయండి. వారి భావోద్వేగాల్లో మద్దతుగా నిలవండి. వారి భావాల గురించి, పరీక్షల గురించి వారికి ఏవైనా ఆందోళనలు ఉంటే మాట్లాడమని వారిని ప్రోత్సహించండి.
- రిలాక్సేషన్ టెక్నిక్‌లను ప్రాక్టీస్ చేయండి: మీ పిల్లలకు ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడటానికి డీప్ బ్రీత్ లేదా ధ్యానం వంటి కొన్ని రిలాక్సేషన్ పద్ధతులను నేర్పండి. విశ్రాంతి తీసుకోవడానికి, వారి శక్తిని రీఛార్జ్ చేయడానికి క్రమం తప్పకుండా విరామం తీసుకునేలా మీ పిల్లలను ప్రోత్సహించండి. చిన్న విరామాలు ఏకాగ్రత, ప్రొడక్టివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పరీక్షల సీజన్‌లో ఎలాంటి ఫుడ్ అందించాలి
పిల్లల ఆరోగ్యం, గ్రహణ శక్తి మెరుగుపడేందుకు పరీక్షా సమయాల్లో వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. పరీక్షల సమయంలో పిల్లలకు అందించాల్సిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల జాబితా ఇక్కడ చూడొచ్చు.
- తృణధాన్యాలు: హోల్ వీట్ బ్రెడ్, బ్రౌన్ రైస్, ఓట్ మీల్ వంటి ఆహారాలు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. ఇవి రోజంతా ఏకాగ్రత నిలపడానికి, శక్తిని అందించడానికి సహాయపడతాయి.
- పండ్లు, కూరగాయలు: సంపూర్ణ ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరగాయలు అవసరం. గ్రహణ శక్తి, ఏకాగ్రతకు తోడ్పడే అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. యాపిల్స్, అరటిపండ్లు, క్యారెట్లు, సెలెరీ వంటి పండ్లు కూరగాయలతో అల్పాహారం తీసుకునేలా పిల్లలను ప్రోత్సహించండి.
- గింజలు, విత్తనాలు: గింజలు, విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లకు వనరులు. ఇవి పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. వ్యాధి నిరోధకతకు తోడ్పడే యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. మెదడు పనితీరుకు అవసరమైన జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు వీటిలో లభిస్తాయి.
- ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు: చికెన్, చేపలు, గుడ్లు, టోఫు వంటి లీన్ ప్రోటీన్ గ్రహణ శక్తి పనితీరు, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి మెదడు పనితీరుకు తోడ్పడే ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కూడా అందిస్తాయి.
- నీరు: ఏకాగ్రతను కాపాడుకోవడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. రోజంతా పుష్కలంగా నీరు త్రాగేలా పిల్లలను ప్రోత్సహించండి. కూల్ డ్రింక్స్, సోడా, జ్యూస్ వంటి చక్కెర పానీయాలకు దూరంగా ఉంచండి.
- డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, కెఫిన్ ఉంటాయి. ఇవి మూడ్, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి.
- పెరుగు: పెరుగులో ప్రోటీన్, కాల్షియం లభిస్తాయి. ఇది గ్రహణ శక్తి పనితీరును మెరుగుపరచడానికి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. షుగర్‌తో కలిపి తినడం కాకుండా అన్నంలో కలుపుకుని తినడం మంచిది.