Flirting Day 2025: మీ క్రష్‌ను ఇలా తీయని మాటలతో పనులతో పడగొట్టేయండి, కొన్ని చిట్కాలు ఇవిగో
Flirting Day 2025: యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో ఫ్లర్టింగ్ డే వచ్చేసింది. ఒకసారి ప్రేమలో మోసపోయిన వారు మళ్లీ ప్రేమలో పడకూడదని ఎక్కడా లేదు. మీకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే ఫ్లర్టింగ్ డే నాడు వారిని తీయగా ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించండి.

ఫ్లర్టింగ్ డే వచ్చేసింది. యాంటీ వాలెంటైన్స్ వీక్‌లో నాలుగో రోజు ఫ్లర్ట్ డే. ప్రేమలో మోసపోయి సింగిల్స్ మారిన వారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు నిరాశలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. మళ్లీ కొత్త జీవితాన్ని, కొత్త ప్రేమను మొదలుపెట్టవచ్చు. అందుకే వచ్చింది ఫ్లర్టింగ్ డే.
ప్రేమికుల వారం ముగిసిన తరువాత యాంటీ వాలెంటైన్స్ వీక్ వస్తుంది. రొమాంటిక్ రిలేషన్షిప్‌లో లేనివారు, వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేయని వారు ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ వారం ఫిబ్రవరి 15న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగుస్తుంది. ప్రతి రోజూ ఒక్కో థీమ్ తో ఉంటుంది. యాంటీ వాలెంటైన్స్ వీక్ లో నాలుగో రోజైన ఫ్లర్టింగ్ డే… ఎవరూ కూడా ఒంటరి జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదు. తమ మనసుకు నచ్చిన వ్యక్తితో కాసేపు మాట్లాడుతూ వారిని ఫ్లర్ట్ చేయవచ్చు. ఇవి చాలా ఫన్ గా ఉంటుంది.
మీ క్రష్ తో హ్యూమరస్ గా మాట్లాడేందుకు ప్రయత్నించండి. మీకు వారిపై ఆసక్తి ఉందని చూపించడానికి ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన మార్గం ఇది. కానీ ఫ్లర్టింగ్ గౌరవంగా, సముచితంగా, ఆరోగ్యకరమైన రీతిలో ఉండడం చాలా. లేకుంటే మీపై ఎదుటి వ్యక్తికి యావగింపు వచ్చేస్తుంది. ఎలా ఫ్లర్ట్ చేయాలో ఇక్కడ కొన్నొ చిట్కాలు ఇచ్చాము.
1. హాస్యాన్ని ఉపయోగించండి: మీ క్రష్ ను నవ్వించేందుకు ప్రయత్నించండి. ఇందుకు మీరు హ్యూమరస్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీ మధ్య సానుకూల కనెక్షన్ ఏర్పడటానికి ఇది గొప్ప మార్గం. మీ హాస్యం తేలికగా ఉండేలా చూసుకోండి. అభ్యంతరకర పదాలు, వ్యంగ్యం లేకుండా చూసుకోండి.
2. నిజాయితీగా ఉండండి: మీరు నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు ఇష్టంలేని విషయాలపై ఆసక్తి ఉన్నట్లు నటించవద్దు. నిజాయితీగా ఉన్నవారికి ఎవరైనా ఆకర్షితులవుతారు.
3. వారి ఆసక్తులకు విలువ: ఎదుటి వ్యక్తి అభిరుచులు, ఆసక్తుల గురించి తెలుసుకునేందుకు ప్రశ్నలను అడగండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీ శ్రద్ధ వారిలో మీపై సానుకూల ప్రభావం పడేలా చేస్తుంది. వారి గురించి మరింత తెలుసుకోవడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
4. వారిని అభినందించండి: ప్రతి ఒక్కరూ తమనె మెచ్చుకోవాలని కోరుకుంటారు. మీరు కూడా ఆమె డ్రెస్సు, హెయిర్ స్టైల్ వంటి పొగిడేందుకు ప్రయత్నించండి. నిజమైన కాంప్లిమెంట్ ఇవ్వడం మీ ఆసక్తిని చూపించడానికి, వారి విశ్వాసాన్ని పెంచడానికి గొప్ప మార్గం.
5. హద్దులను గౌరవించండి: ఫన్ గా ఉండడం ఎప్పుడూ హద్దులు దాటకుండా ఉండాలి. ఇది ఎప్పుడూ వేధింపులకు దారి తీయకూడదు. ఎదుటివారిని అసౌకర్యానికి గురి చేయకూడదు. ఎల్లప్పుడూ వారి హద్దులను గౌరవించండి. వారి భావాలకు విలువనివ్వండి.
6. ఉల్లాసంగా ఉంచండి: ఫ్లర్టింగ్ ఎప్పుడూ సరదాగా, తేలికగా ఉండాలి. కాబట్టి విషయాలను చాలా సీరియస్ గా తీసుకోకండి. సంభాషణను ఉల్లాసంగా ఉంచండి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.
ఆరోగ్యకరమైన మాటలు, పనులు మీ క్రష్ తో బంధాన్ని నిర్మించేందుకు, మీ ఆసక్తిని సానుకూల, గౌరవప్రదమైన మార్గంలో చూపించడానికి సహాయడపతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండండి.
సంబంధిత కథనం