Salt Uses: ఉప్పుని కేవలం వంటల్లోకి మాత్రమే ఉపయోగిస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి!-kitchen tips salt is not only useful in cooking but also in making kitchen chores easier learn how ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Salt Uses: ఉప్పుని కేవలం వంటల్లోకి మాత్రమే ఉపయోగిస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి!

Salt Uses: ఉప్పుని కేవలం వంటల్లోకి మాత్రమే ఉపయోగిస్తున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి!

Ramya Sri Marka HT Telugu

Salt Uses: ఉప్పును కేవలం ఆహార పదార్థాల్లోకి, పానీయాల్లోకి మాత్రమే ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఉప్పు గురించి చాలా విషయాలు తెలియదని అర్థం. పాలు విరిగిపోకుండా కాపాడటం నుంచి పురుగులను చంపడం వరకూ ఉప్పు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఉప్పు చేసే ఈ చిన్న చిన్న మ్యాజిక్‌ల గురించి మీరూ తెలుసుకోండి.

వంటింటి పనులను సులభతరం చేసే ఉప్పు (shutterstock)

ఉప్పు ప్రతి ఇంట్లోనూ ఉండేది, దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించేదే. కానీ దీన్ని కేవలం వంటల్లోకి మాత్రమే ఉపయెగిస్తున్నారంటే మీరు ఉప్పుతో కలిగిన ప్రయోజనాలను చాలా వరకూ మిస్ అవుతున్నట్టే. ఎందుకంటే ఉప్పు ఆహారం రుచిని మెరుగుపరచడానికి మాత్రమే కాదు, ఇంటి శుభ్రత నుండి ఆహార పదార్థాలను చెడిపోకుండా కాపాడటం వరకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు ఎంతో శ్రమించే వంటింటి పనులను సులభతరం చేయగల శక్తి ఉప్పుకు ఉంది. ఉప్పు గురించి చాలా మందికి తెలియని విషయాలు, అది చేసే చిన్న చిన్న మ్యాజిక్‌లలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి..

వంటల్లోకి కాకుండా ఉప్పును ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు?

పాలు విరిగిపోకుండా ఉండేందుకు

ఈ బిజీబిజీ జీవితంలో ఆహార పదార్థాలను, పాలను ప్రతిసారి బయటకు వెళ్లి తెచ్చుకోవడం కష్టమైన పని. అందుకే ఒకేసారి తెచ్చుకుని నాలుగు అయిదు రోజు లేదా వారం రోజుల పాటు స్టోర్ చేసుకుని ఉపయోగించుకుంటున్నాం. అలా తెచ్చి పెట్టుకున్న పాలు విరిగిపోకుండా ఎక్కువ రోజులు ఉండాలటే వేడి చేసి చల్లార్చిన తర్వాత ఆ పాలలో ఉప్పు వేయండి. లీటరు పాలలో చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పాటు నాలుగు అయిదు రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. తిరిగి వీటిని వేడి చేసినప్పుడు రుచి కూడా బాగుంటుంది.

కాఫీ రుచిని మెరుగుపరిచేందుకు

చాలా సార్లు కంగారు కంగారుగా కాఫీ పెడుతుంటాం. హడావిడిలో కొన్ని సార్లు కాఫీ పొడి ఎక్కువగా పడిపోయి.. కాఫీ చాలా చేదుగా మారుతుంది. ఇలాంటప్పుడు తాగడం నచ్చక పారబోసే వారు చాలా మంది ఉంటారు. ఈసారి నుంచి అలా చేయకండి. చేదెక్కిన కాఫీలోమ చిటికెడు ఉప్పు వేశారంటే చేదంతా మాయమైపోతుంది. మీ కాఫీ క్షణాల్లో రుచిగా మారిపోతుంది.

కూరగాయలు నల్లబడకుండా కాపాడేందుకు

బంగాళాదుంపలు లేదా వంకాయలు కట్ చేసిన వెంటనే నల్లబడతాయి. మిగిలినవి కట్ చేసే లోపు మొదట తరిగినవి నల్లగా మారిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ కూరగాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేయిండి. ఇలా చేశారంటే మీరు తరిగిన కూరగాయలు నల్లబడవు. యాపిల్ ముక్కలు కూడా నల్లబడకుండా ఉండాలంటే కట్ చేసిన తర్వాత పావు గంట పాటు వాటిని ఉప్పునీటిలో ఉంచండి. ఆ తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోండి. పిల్లల లంచ్ బాక్సుల్లోకి ఆపిల్ ముక్కలు పెట్టాలనుకునే వారికి ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

కూరగాయలు, పండ్లను శుభ్రం చేయడానికి

మనం రోజూ తినే పండ్లు, కూరగాయలపై ఎరువులు, పురుగుమందులు ఉంటాయి. (వీటి పెంపకంలో ఇదొక భాగం) వాటిని తొలగించడానికి ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు వేడినీటిలో ఉప్పు, పసుపు వేసి ఆ నీటిలో కూరగాయలను ముంచంది. అరగంట పాటు వీటిని అలాగే ఉంచిన తర్వాత కడగండి. ఈ అరగంటలో కూరగాయలు, పండ్ల మీద ఉన్న పురుగుల మందులు నీటిలో కరిగిపోయి అన్నీ శుభ్రంగా మారతాయి.

పప్పులు, ధాన్యాలను కాపాడటానికి

మార్కెట్లో ఉప్పు గడ్డలు సులభంగా లభిస్తాయి. వీటిని పప్పుుల, ధాన్యాలు, అటుకులు వంటి నిల్వ చేసే ఆహారాల్లో వేసి ఉంచితే పురుగులు పట్టకుండా ఉంటాయి.

చర్మ సంరక్షణ కోసం..

స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసుకున్నారంటే చర్మ సమస్యలు రాకుండా ఉండటమే కాకా.. చర్మం మృదువుగా తయారవుతుంది.

పెట్స్ కోసం..

మీరు ఇంట్లో పెంచుకునే పశువులు లేదా కుక్కలను చర్మాన్ని శుభ్రం చేయడానికి ఉప్పు ఉపయోగపడుతుంది. వాటికి ఉప్ను నీటితో స్నానం చేయించారంటే సీజనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాయి.

గాయాలకు మందుగా…

ఉప్పును గోరువెచ్చటి నీటిలో ఉప్పు కలిపి గాయాలపై లేదా కంటి తెగులపై అప్లై చేశారంటే గాయం త్వరగా మానుతుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం