వేడికి ఆహారం త్వరగా పాడవుతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఫ్రిజ్ లేకున్నా కాపాడుకోవచ్చు!-kitchen tips how to prevent food from spoiling store it with these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వేడికి ఆహారం త్వరగా పాడవుతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఫ్రిజ్ లేకున్నా కాపాడుకోవచ్చు!

వేడికి ఆహారం త్వరగా పాడవుతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలతో ఫ్రిజ్ లేకున్నా కాపాడుకోవచ్చు!

Ramya Sri Marka HT Telugu

వేసవిలో వేడికి ఉదయం చేసిన వంటలు సాయంత్రానికే పాడైపోతాయి. పాడవకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఫ్రిజ్ లేకపోతే ఆహారాలను కాపాడుకోవడం మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఆహారాలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఇక్కడ ఉన్నాయి.

ఆహారాలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్స్ తో నిల్వ చేయాలి (Shutterstock)

వేసవి కాలం సెలవులు, మామిడిపండ్లతో సరదాలను తెచ్చిపెట్టడంతో అనేక రకాల ఇబ్బందులను కూడా తీసుకువస్తుంది. వాటిలో ఒక సాధారణ సమస్య ఆహారం త్వరగా చెడిపోవడం. వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఉదయం తయారుచేసిన ఆహారం సాయంత్రానికే చెడిపోవడం మొదలవుతుంది. ముఖ్యంగా ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ఆహారాన్ని నిల్వ చేయడం చాలా కష్టం అవుతుంది. ఫ్రిజ్ ఉన్నప్పటికీ ప్రతిసారీ ఆహారాలను ఫ్రిజ్ లో నిల్వ చేయలేము. ఇది ఆహారం రుచితో పాటు పోషకాలను కూడా నాశనం చేస్తుంది.

ఇలా వండిన ఆహారాలు పాడవడం వల్ల సమయంతో పాటు డబ్బు కూడా వృథా అవుతుంది. అందుకే చాలా మంది గృహిణులు వేసవిలో ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచుకోవాలో తెలియక ఆందోళన చెందుతారు. మీ ఇంట్లో కూడా ఇదే సమస్య అయితే వండిన ఆహారాలను పడేయడం మీకు బాధగా ఉంటే ఇది కథనం మీ కోసమే. మీ ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడంలో సహాయపడే కొన్ని చిన్న చిన్న చిట్కాలను మీకోసం మేం తీసుకువచ్చాము. అవేంటో తెలుసుకోండి ఆహారం పాడవకుండా కాపాడుకోండి.

ఆహారం పాడవకుండా ఉండటానికి సహాయపడే చిట్కాలు:

1. ఆహారాన్ని కలపకండి

ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవాలనుకుంటే,రెండు రకాల ఆహారాలను ఎప్పుడూ కలపకూడదు. ముఖ్యంగా పాత ఆహారాన్ని కొత్త ఆహారంతో కలపకండి. రెండు వేరు వేరు ఆహార పదార్థాలను కలపడం, ఉదయం తయారు చేసిన ఆహారాన్ని సాయంత్రం ఆహారంతో కలిపడం వల్ల అవి చెడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

2. ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయకండి

ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల అది త్వరగా చెడిపోదు అని చాలా మంది భావిస్తారు. నిజానికి ఇందులో నిజం లేదు. మీరు ఆహారాన్ని మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే, అది త్వరగా చెడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా, దీని వల్ల ఆహారం రుచి చెడిపోతుంది, పోషకాలు కూడా నశిస్తాయి. కాబట్టి వీలైనంత వరకూ ఆహారం తయారు చేసిన వెంటనే తినడానికి ప్రయత్నించండి, ఎక్కువ వండుకుని తర్వాత కోసం మిగిల్చకండి.

3. మసాలాలు, టామాటోలను తగ్గించండి

వేసవిలో ఆహారం త్వరగా చెడిపోవడానికి మసాలాలు, టమాటోలు కూడా కారణం అవుతాయి. కాబట్టి వేసవిలో ఆహారం వండేటప్పుడు వీలైనంత వరకూ తక్కువ మసాలాలను ఉపయోగించండి. ముఖ్యంగా శరీరానికి వేడి చేసే మసాలాలను వీలైనంత తక్కువగా ఉపయోగించండి. మీరు కోరుకుంటే, ఆహారం తినే ముందు కొద్దిగా మసాలా జోడించవచ్చు. వంటల్లో టమాటోలు ఎక్కువగా వేయడం వల్ల కూడా ఆహారాలు కొన్ని గంటల్లోనే పాడైపోవడం మొదలవుతుంది. కాబట్టి వేసవి పోయేంత వరకూ తక్కువ టమాటోలను ఉపయోగించి ఆహారం వండండి.

4. ఆహారాలను మూత చాలా ముఖ్యం

వేసవిలో ఆహారాన్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద పెట్టిన మూత సరిగ్గా ఉందా లేదా అని నిర్ధారించుకోండి. వేసవిలో వేడిమి కారణంగా అనేక రకాల బ్యాక్టీరియా గాలిలో పెరగడం మొదలవుతుంది. ఈ బ్యాక్టీరియా ఒకసారి ఆహారంలో కలిస్తే అది ఆహారాలను త్వరగా పాడు చేస్తుంది.ఆరోగ్యానికి కూడా హాని చేస్తుంది.

5. నీటిని ఉపయోగించి నిల్వ చేయండి

మీ ఇంట్లో ఫ్రిజ్ లేకపోయినా, ఈ సింపుల్ ట్రిక్‌ను అనుసరించి ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు. ఇది పాత కాలం నాటి పద్ధతే అయినా ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం ముందు పెద్ద పాత్రను తీసుకుని దాంట్లో చల్లటి నీటిని పోయండి. ఇప్పుడు దీంట్లో మీరు నిల్వ చేయాలకున్న ఆహార పదార్థాల గాలి చొరబడని పాత్రలో పెట్టి ఆ పాత్రను నీటిలో ఉంచండి. ఈ చిట్కా ఫ్రిజ్ పనిని పూర్తిగా చేస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలిగించదు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం