Vegetable Chopper: వంటింటి పనులను సులభతరం చేసే వెజిటేబుల్ చాపర్‌ను మీరు సరిగ్గా ఉపయోగిస్తున్నారా.. లేదా?
Vegetable Chopper: వంటింట్లో చాలా కష్టమైన పని కూరగాయలు తరగడం. ఇది చాలా మందికి బోరింగ్‌గా కూడా అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తే మీరు వెజిటెబుల్ చాపర్ ను ఉపయోగించండి. ఇది మీ వంట పనిని చాలా ఈజీ చేసేస్తుంది. త్వరగా అయ్యేందుకు సహాయపడుతుంది. వెజిటేబుల్ చాపర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?

చాలా మంది మహిళలు రోజంతా కుటుంబ సభ్యులకు నచ్చేలా వంట చేయడంలోనే గడుపుతారు. ఒక అధ్యయనం ప్రకారం, నగర భారతీయ మహిళలు వారానికి సగటున 13 గంటలు వంటగదిలోనే గడుపుతున్నారట. ఇందులో వంట తయారీ కూడా ఉంటుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళలు కొంత తక్కువ సమయం వంటగదిలో గడుపుతారు, ఎందుకంటే వారు ఇతరుల సేవలను అంటే పనివారిని పెట్టుకునే ఆర్థిక సామర్థ్యం కలిగి ఉంటారు. వంట చేయకపోవడం లేదా ఇతరుల సేవలను తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అందుకే మనం వంట పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడానికి సహాయపడే పద్ధతులు, గ్యాడ్జెట్లను ఎంచుకుంటూ ఉంటాం. ఇటువంటి గ్యాడ్జెట్లలో ఒకటి వెజిటెబుల్ చాపర్.
భారతీయ వంటగదిలో వెజిటెబుల్ చాపర్ ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. కూరగాయలు, పండ్లను తరగడం రోజువారీ పని. కానీ, ఇది చాలా సమయం తీసుకుంటుంది అలాగే చాలా మందికి ఇది బోరింగ్‌గా కూడా అనిపిస్తుంది. ఈ బోరింగ్ పనిని త్వరగా పూర్తి చేయడంలో వెజిటేబుల్ చాపర్ మీకు సహాయపడుతుంది.
వెజిటెబుల్ చాపర్లు రెండు రకాలు..
మార్కెట్లో మాన్యువల్, ఎలక్ట్రిక్ అంటూ రెండు రకాల వెజిటేబుల్ చాపర్లు అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్ వెజిటెబుల్ చాపర్‌తో పోలిస్తే, ఎలక్ట్రిక్ చాపర్‌లో కూరగాయలు, పండ్లు మరింత సులభంగా, చక్కగా తరుగుతాయి. పైగా చాపర్‌ను మీ వంటగదిలో భాగం చేసుకోవడానికి మీరు అధిక ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.
వెజిటెబుల్ చాపర్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు..
1. సమయం ఆదా:
చాలా సార్లు వంట కంటే కూరగాయలు తరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమయాన్ని ఆదా చేయడంలో ఈ చాపర్ మీకు సహాయపడుతుంది. దీనితో కూరగాయలు త్వరగా తరుగుతాయి, అలాగే శుభ్రంగా కూడా ఉంటాయి.
2. ప్రమాదాల తగ్గుదల:
కూరగాయలు తరిగేటప్పుడు వేళ్లు గాయపడకుండా ఉండటానికి ఎలక్ట్రిక్ చాపర్ ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి, మీరు పండ్లు లేదా కూరగాయలను శుభ్రం చేసి చాపర్‌లో వేసి, సరైన ఎంపిక చేసి, స్విచ్ ఆన్ చేయాలి. అంతే. కానీ, ఒక విషయం గుర్తుంచుకోండి. చాపర్‌లో నుండి కట్ చేసిన కూరగాయలను ఎల్లప్పుడూ చెంచాతో తీయండి. చాపర్ బ్లేడ్స్ చాలా పదునుగా ఉంటాయి, వాటిని తాకితే వేళ్లు గాయపడే ప్రమాదం ఉంది.
3. ఒక గ్యాడ్జెట్, అనేక ఉపయోగాలు:
మీరు మంచి బ్రాండ్ వెజిటెబుల్ చాపర్‌ను కొనుగోలు చేస్తే, అందులో అనేక ఎంపికలు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు, మాంసం కట్ చేయడానికి ఉపయోగించే చాపర్లు కూడా చాలా ప్రాచుర్యం పొందాయి.
4. క్రిముల భయం లేదు:
చాపర్ బ్లేడ్స్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారవుతాయి, వీటిలో క్రిములు పెరగవు. ఉపయోగించిన తర్వాత, చాపర్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. క్రీముల భయం ఉండదు.
5. వంట బోరింగ్‌గా అనిపించదు:
రోజూ ఒకే పని చేయడం కొంతకాలం తర్వాత బోరింగ్‌గా అనిపిస్తుంది. వంట చేయడం ఇష్టపడేవారికి కూడా కొంతకాలం తర్వాత ఇది బాధ్యతగా అనిపిస్తుంది. వెజిటెబుల్ చాపర్ కూరగాయలు తరగడం వంటి బోరింగ్ పనిని త్వరగా పూర్తి చేసి, మీ పనిని సులభతరం చేస్తుంది. దీని ఫలితంగా, మీకు మళ్ళీ వంట చేయడం ఇష్టంగా అనిపిస్తుంది. అంతేకాదు, అందంగా తరిగిన కూరగాయలు మీ వంట అందాన్ని కూడా పెంచుతాయి. చాలా మందికి వంట చేయాల్సి వస్తే, ఈ గ్యాడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా చూసుకోవాలి
• వెంటనే వెజిటెబుల్ చాపర్‌ను నీటితో కడిగి, బాగా ఆరబెట్టండి, తద్వారా బ్లేడ్స్‌కు తుప్పు పట్టదు
• చాలా గట్టి కూరగాయలు లేదా పదార్థాలను చాపర్‌లో కట్ చేయడం మానుకోండి.
• చాపర్ కంటైనర్‌లో గుర్తు ఉన్నంత వరకు మాత్రమే కూరగాయలు వేయండి. ఎక్కువ పరిమాణంలో కూరగాయలు వేస్తే మోటార్ వేడెక్కి, మెషిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. త్వరగా పాడవుతుంది.
సంబంధిత కథనం
టాపిక్