Kiss Day Wishes: హద్దులు లేని ప్రేమని ముద్దులతో చెప్పాలనుకుంటున్నారా, కిస్ డే స్పెషల్ రొమాంటిక్ మెసేజెస్ ఇవిగోండి!
Kiss Day Wishes: లోతైన ప్రేమను తెలిపేందుకు ముద్దుకు మించినది ఏముంటుంది. కిస్ డే సందర్భంగా మీ ప్రియమైన వారికి ప్రత్యేకమైన, రొమాంటిక్ మెసేజెస్ పంపాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ రోజున మీ భాగస్వామి ముద్దును దోచుకోవడానికి ఇవి మీకు బాగా సహాయపడతాయి.

ప్రేమ పీక్స్ లోకి వెళ్లడానికి ముందు ముద్దు వరకు వెళ్లినట్టే వాలెంటైన్స్ డే కి ఒకరోజు ముందు ప్రేమికులు కిస్ డేను జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికులు తమ క్రష్‌ను ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ హృదయంలో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తారు. మీరు ఈ రోజును మరింత ప్రత్యేకంగా, రొమాంటిక్‌గా చేయాలనుకుంటే, హృదయాన్ని తాకే ఈ కిస్ డే మెసేజెస్ ను మీ ప్రియురాలు లేదా ప్రియుడితో పంచుకోండి. వీటి ద్వారా మీ గాఢమైన ప్రేమను మీ భాగస్వామికి తెలియజేయండి.
- హద్దులు లేని నా ప్రేమను
ముద్దులతో చెప్పాలనుకుంటున్నా
ఇంతకు మించి మాటలేవి లేవంటున్నా
ముద్దు అడగడానికి ఇదే అవకాశమనుకుంటున్నా
హ్యాపీ కిస్ డే డియర్ లవ్!
2. నీ పెదవులను తాకినప్పుడు
నా కళ్లు మురిసిపోయి ముడుచుకుంటాయి
హృదయం వింతగా కొట్టుకుంటుంది
శరీరం గాలిలో తేలినట్టు ఉంటుంది
హ్యాపీ కిస్ డే ప్రియతమా!
3. ఉదయాన్నే టీ, కాఫీలతో కాకుండా
నీ పెదాల మాధుర్యంతో రోజును మొదలు పెట్టాలి
జీవితాంతం నీ నుంచి నేను కోరుకునేది ఇదే
తీర్చడం నీకు ఇష్టమేనా
హ్యాపీ కిస్ డే మై లవ్!
4. నీ నవ్వులో నన్ను చంపేసే అందం ఉంది,
నీ పెదవుల్లో కాపాడే అమృతం ఉంది,
ఈ రెండూ ఎప్పటికీ నాకే కావాలి,
అందించడానికి నువ్వు సిద్దమే అయితే
కిస్ డే శుభాకాంక్షలు ప్రియతమా!
5. నా పెదవులు, నీ పెదవులను తాకుతున్నప్పుడు
నేను నీ ముఖం మాత్రమే చూడాలి
పెదవులతో పాటు మన హృదయాలు కూడా కలిసిపోవాలి
జీవితాంతం మన బంధం ఇలాగే ఉండాలి
హ్యాపీ కిస్ డే!
6. కళ్లలో నువ్వే, కలల్లో నువ్వే
కళ్లు మూసుకుని ప్రతిరోజూ తలచుకుంటుంది నిన్నే
కనిపించినప్పుడైనా కనికరించవా,
కనీసం ఒక ముద్దు అయినా ఇవ్వవా,
హ్యాపీ కిస్ డే శుభాకాంక్షలు తెలపవా!
7. సున్నితమైన నీ స్పర్శకు ముగ్దుడునైపోవాలని ఉంది
హద్దులు లేని నా ప్రేమను ముద్దుతో చెప్పాలనుకుంటున్నా
జన్మ జన్మలకు మన బంధం కొనసాగాలనుకుంటున్నా
హ్యాపి కిస్ డే ప్రియతమా!
8. లోతైన ప్రేమను తెలిపేందకు
ముద్దును మించింది ఏముంటుంది
మనసులోని ప్రేమను మాటలతో కాకుండా
ముద్దులతో చెప్పడమే కదా బాగుంటుంది
హ్యాపీ కిస్ డే డియర్!
9. ఏదో ఒక రోజు అందమైన రాత్రి వస్తుంది
ఆ రోజు నీ కళ్లు నా కళ్లలోకి చూస్తాయి
నా పెదవులు నీ పెదాలను తాకుతాయి
మనదో రంగుల ప్రపంచం అవుతుంది
అప్పటిదాకా ఎదురుచూస్తుంటా
హ్యాపీ కిస్ డే మై డియర్ లవ్!
10. కళ్లలో దాచి ఉంచిన అనురాగాన్ని
మాటల్లో చెప్పలేని అభిమానాన్ని
మనసులో నిండిన ప్రేమను
ముద్దులో చెప్పాలనుంది
కిస్ డే శుభాకాంక్షలు ప్రియతమా!
సంబంధిత కథనం