Kids milk: ప్రతిరోజూ పాలల్లో ఈ పొడిని కలిపి పిల్లల చేత తాగించండి, మెదడు చురుకుదనం పెరుగుతుంది
Kids milk: ప్రతిరోజూ పాలు తాగించినప్పుడు ఆ పాలలో చిటికెడు అశ్వగంధ పొడిని కలపండి. వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Kids milk: ప్రతిరోజూ పాలు తాగడం అనేది మన భారతీయ ఆహారపు అలవాట్లలో ఒకటి. పాలు తాగడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు అందుతాయని... ప్రాచీన కాలం నుంచి పాలు తాగే అలవాటు ఉంది. అలాగే పాలు తాగడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ప్రతిరోజూ పాలు తాగించమని చెబుతారు వైద్యులు. కేవలం పాలు మాత్రమే తాగించడం వల్ల ఫలితం లేదు, గోరువెచ్చని పాలలో ప్రతిరోజూ చిటికెడు అశ్వగంధ పొడిని వేసి తాగించడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. వారికి చలికాలంలో వచ్చే రోగాలను తట్టుకునే శక్తి వస్తుంది.
అశ్వగంధ అనేది ఒక ఆయుర్వేద మూలిక. శతాబ్దాలుగా దీన్ని ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. అశ్వగంధలో నిద్రను ప్రేరేపించే లక్షణాలు ఎక్కువ. నిద్రలేమి సమస్య ఉన్నవారు ప్రతిరోజు అశ్వగంధ పొడిని కలిపిన పాలను తాగడం మంచిది. ఈ పాలను తాగడం వల్ల నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక అలజడి తగ్గుతుంది.
ఒత్తిడి నుంచి బయటపడేసే గుణాలు అశ్వగంధలో ఎక్కువ. కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడానికి ఇది సహాయపడుతుంది. దీర్ఘకాలికంగా ఒత్తిడితో బాధపడుతున్న వారు రోగనిరోధక శక్తిని కోల్పోతారు. అలాంటివారు ప్రతిరోజూ అశ్వగంధ పొడిని పాలల్లో కలుపుకుని తాగితే మంచిది.
అశ్వగంధ పొడిలో యాక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. ఇవి శరీరంలో చేరిన ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని కాపాడతాయి. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీర కణాల పునరుత్పత్తికి సహాయపడతాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు అశ్వగంధ పొడిని పాలల్లో కలుపుకుని తాగడం చాలా మంచిది. ఇది మెదడును అభివృద్ధి పరచడంలో ముందుంటుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలలో ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడి, ఒక స్పూను తేనె వేసి పిల్లల చేత తాగించండి. ఈ పాలు గోరువెచ్చగా ఉండేలా చూడండి. కేవలం నెల రోజుల్లోనే వారి ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది.