Kick Day 2025: కిక్ డే రోజున తంతే ప్రశాంతత బుట్టలో పడాల్సిందే! ఇంతకీ ఎవరిని తన్నాలి, ఎందుకు తన్నాలి తెలుసుకోండి!
Kick Day 2025: యాంటీ వాలెంటైన్ వీక్‌లో రెండవ రోజు అంటే ఫిబ్రవరి 16న కిక్ డేగా జరుపుకుంటారు. కిక్ అంటే తన్నడం కదా. వెళ్లి ఎక్స్ లవర్‌ను తన్నేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అంత పని చేయకండి. కిక్ డే ఉద్దేశం అది కాదు. కిక్ డే రోజున ఎవరిని తన్నాలి?, ఎందుకు తన్నాలి? తెలుసుకుందాం రండి.

ప్రేమికుల పండగ అయిన వాలైంటైన్ వీక్ ముగిసిపోయింది. ప్రేమలో మోసపోయిన, ప్రేమ వారాన్ని చూసి విసిగిపోయిన ప్రేమ వ్యతిరేకుల పండగ వచ్చేసింది. యాంటీ వాలైంటైన్ వీక్ పేరుతో జరుపుకునే ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఫెస్టివల్‌లో మొదటి రోజైన స్లాప్ డే ఫిబ్రవరి 15న ముగిసిపోయింది. రెండవ రోజైన ఫిబ్రవరి 16ను కిక్ డేగా జరుపుకుంటారు. కిక్ డే అంటే తన్నడమే కదా.. వెళ్లి నా ఎక్స్ ను తన్నేస్తా! అని రెడి అయిపోకండి. కిక్ డే ఉద్దేశం అది కాదు. ఈ రోజున ఎవరిని తన్నాలి, ఎలా జరుపుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ప్రేమలో విఫలమైన వారు, ప్రేమ కారణంగా బాధలను, భారాన్ని అనుభవిస్తున్న వారు వాటి నుంచి బయటపడేందుకు జరుపుకునే పండుగ. గతం తాలూకా బాధలను, కోపాన్ని, ద్వేషాన్ని బయటికి పంపించేసి ప్రశాంతంగా, స్వేఛ్ఛగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనేదే యాంటీ వాలెంటైన్ వీక్ ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే స్లాప్ డే , కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే అంటూ వారం రోజుల పాటు దీన్ని జరుపుకుంటారు.
కిక్ డే ఉద్దేశం ఏంటి?
కిక్ డే అనగానే మిమ్మల్ని మోసం చేసిన వారినీ, ప్రేమ పేరుతో బాధపెట్టిన మీ మాజీని ఒక్క తన్ను తన్ని మనసులోని భారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారేమో! సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే కిక్ డే ఉద్దేశం హింస కాదు ప్రశాంతత. మోసం చేసిన వారిని తన్నకుండా ప్రశాంతత ఎలా వస్తుంది అంటారేమో! అక్కడికే వస్తున్నా..
మనల్ని మోసం చేసిన వారిని కోపంతోనో, ద్వేషంతోనో లేక బాధతోనే ఇంకా మనసులో ఉంచుకోవడం అనవసరం. వారు మిమ్మల్ని బాధపెట్టిన రోజే మీ మనసులో వారి స్థానాన్ని కోల్పోయినట్టే. అందుకే వారి తాలూకా ఆలోచనలు, గురుతులు అన్నింటినీ తన్ని పారేసి స్వేచ్ఛగా జీవించాలి ఇదే కిక్ డే ఉద్దేశం. అది కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు లేద మరేదైనా భావం కావచ్చు. వారి విషయంలో మీకున్న భావాలు అన్నింటినీ ఒక్క తన్ను తన్నేసి మీ మనసును కొత్తగా, ప్రశాంతంగా, స్వేచ్ఛగా మార్చేసుకుని సంతోషంగా జీవించాలనేదే కిక్ డే పండగకు అర్థం.
కిక్ డే ను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి?
మిమ్మల్ని మోసం చేసిన వారి గురించి మీరు ఇంకా ఆలోచిస్తుంటే ముందుగా మీ మనసులో నుంచి ఆ ఆలోచనలను తన్నిపారేయండి. వారి తాలూకా జ్ఞాపకాలన్నింటినీ కూడా తన్ని తరిమేయండి. వారు ఇచ్చిన బహుమతులు, లేఖలు, బట్టలు వంటి వారికి సంబంధించిన ప్రతి దాన్ని దూరంగా తన్ని పడేయండి. వారి ఆలోచనల్లో పడి మీరు పొగొట్టుకున్న వాటిని సాధించే దిశగా మనసును ప్రేరేపించుకోండి.
మీ ఎదుగుదలకు, మీ కొత్త బంధానికి పాతవి, చెడ్డవి అయిన వారి గురుతులు, ఆలోచనలు, అలవాట్లు అడ్డుగా రాకుండా చూసుకోండి. వాటన్నింటికీ గట్టిగా ఒక్క కిక్‌తో గుడ్ బై చెప్పేయండి. సంతోషంగా, సానుకూలంగా కొత్త జీవితంలోకి అడుగుపెట్టండి. వీలైతే కొత్తగా ఏదైనా మంచి అలవాటును మొదలు పెట్టండి. ఈ రోజంతా కుటుంబ సభ్యులతో స్నేహితులతో సరదాగా, సంతోషంగా గడపండి.
సంబంధిత కథనం