Keerthy Suresh: కీర్తి సురేష్ ఎరుపురంగు పెళ్లి చీర 30 ఏళ్ల నాటిది, అంత పాత చీర కొత్తగా ఎలా మారింది?-keerthy sureshs red wedding saree is 30 years old how did such an old saree become new ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Keerthy Suresh: కీర్తి సురేష్ ఎరుపురంగు పెళ్లి చీర 30 ఏళ్ల నాటిది, అంత పాత చీర కొత్తగా ఎలా మారింది?

Keerthy Suresh: కీర్తి సురేష్ ఎరుపురంగు పెళ్లి చీర 30 ఏళ్ల నాటిది, అంత పాత చీర కొత్తగా ఎలా మారింది?

Haritha Chappa HT Telugu
Jan 02, 2025 08:30 AM IST

Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి తన ప్రియుడితో వైభవంగా జరిగింది. ఆమె పెళ్లి ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె పెళ్లి పీటలపై ఎరుపు రంగు చీరను కట్టుకుని కూర్చుంది. ఆ చీర గురించి ప్రత్యేకంగా చెప్పింది కీర్తి సురేష్.

కీర్తి సురేష్ పెళ్లి చీర
కీర్తి సురేష్ పెళ్లి చీర (Instagram/@keerthysureshofficial)

కీర్తి సురేష్ పెళ్లి గత ఏడాది డిసెంబర్ లో వైభవంగా జరిగింది. ఆమె పదిహేనేళ్ల నుంచి ప్రేమిస్తున్న తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ డిసెంబర్ 20న గోవాలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఫోటోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఆమె బ్రైడల్ లుక్ ఎంతో మందికి నచ్చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లికి ధరించిన ఎరుపు రంగు చీర వెనుక ఉన్న కథను వెల్లడించింది. అది తెలుసుకుంటే ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. పెళ్లికాని యువతులు కీర్తిలాగే పెళ్లి చీర రెడీ చేయించుకోవాలని అనుకోవడం ఖాయం.

yearly horoscope entry point

కీర్తి సురేష్ పెళ్లి చీర వెనుక కథ

గలాటా ఇండియాతో మాట్లాడిన కీర్తి తన ఐకానిక్ ఎరుపు చీర లుక్ వెనుక కథను పంచుకుంది. "అది మా అమ్మ పెళ్లి చీర, నేను దానిని ఫ్యాషన్ డిజైనర్ అనితా డోంగ్రేకు ఇచ్చి కొత్తగా మార్చాను. ఆమె దానిని అందంగా కొత్త చీరలా మార్చింది. అమ్మ చీరను కట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పింది. 30 ఏళ్ల క్రితం తన తల్లి పెళ్లి చీర అదని చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. తల్లి పెళ్లి చీరనే కూతురు పెళ్లి చీరగా మార్చి కట్టుకోవడం నిజంగా అద్భుతమైన అనుభూతి.

అమ్మ పెళ్లి చీరనే తన పెళ్లి చీరక కట్టుకుంటానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పింది కీర్తి సురేష్. చివరి నిమిషంలో ఈ ఆలోచన వచ్చిందని వివరించింది. నిజానికి పెళ్లి చీర వరుడు తరుపు వారు కొనిస్తారని, కానీ చివర్లో అమ్మ చీర కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. నిజానికి మా అమ్మ పెళ్లి చీర చూడగానే కట్టుకోవాలనిపించిందని కీర్తి సురష్ వివరించింది. తన తల్లి కట్టుకోమని అనుమతి ఇచ్చాకే ఆ చీరను పెళ్లి చీరగా మార్చుకున్నానని చెప్పింది.

చీర పాతదే అయినప్పటికీ ధరించడానికి వెనుకాడలేదని ఆమె వివరించారు. "ఇది ఎంత పాతది? ఎంత నాణ్యత కలది? అనేది మా మధ్య చర్చకు రాలేదు. అది మా అమ్మ పెళ్లి చీర. కాబట్టి నేను కట్టుకోవాలని అనుకున్నాను… అంతే" అని కీర్తి అన్నారు. 30 ఏళ్లు అయినా కూడా ఆ చీరను అంత అందంగా, చెక్కు చెదరకుండా ఉంచిన తన తల్లిని ప్రశంసించింది కీర్తి సురేష్.

ఎరుపు రంగు చీర లుక్ గురించి

తన పెళ్లి చీర గురించి కీర్తి మరింత లోతుగా వివరించింది. ఎరుపు రంగు చీరను అందమైన సిల్వర్ ఫ్లోరల్ మోటిఫ్స్ తో, మెరిసే జరీ ఎంబ్రాయిడరీతో కొత్తగా డిజైన్ చేసినట్టు చెప్పింది. దానికి సరిపోయే ఎరుపు బ్లౌజ్ ను కొత్తగా కుట్టించుకున్నట్టు చెప్పింది. ఇందులో అదే క్లిష్టమైన సిల్వర్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. డైమండ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, మాంగ్ టిక్కా, మల్టీ గాజు సెట్ తో ఆమె బ్రైడల్ లుక్ లో మెరిసింది.

Whats_app_banner