Fat Wallet Syndrome : ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్.. పర్సుతో జాగ్రత్త గురూ!
Problems With Wallet : అవసరం ఉన్నా.. లేకున్నా.. చాలా మంది పర్సును బ్యాక్ పాకెట్లో పెట్టేసి.. అలానే ఉంచేస్తారు. కూర్చొన్నా.. పడుకున్నా.. అస్సలు తీయరు. దీంతో అనేక సమస్యలు వస్తాయనే విషయం మీకు తెలుసా?
పర్సుతోనూ అనేక సమస్యలు వస్తాయ్. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. ఈ పేపర్.. ఆ పేపర్.. ఇలా ఎన్నో.. ఎన్నో ఆ పర్సులో ఇరికించేసి అలానే ఉంచుతారు. తీసి దానిని వెనక జేబులో పెట్టేసుకుంటారు. కానీ ఇది మంచిది కాదు. అనేక సమస్యలు వస్తాయ్. ఇటీవలే హైదరాబాద్(Hyderabad)లో ఓ వ్యక్తి పర్సు కారణంగానే ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడనే విషయం తెలిసింది. ఓ 30 ఏళ్ల వ్యక్తి.. మూడు నెలల పాటు కుడి పిరుదు నుండి కాలు, పాదం వరకు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అతడికి 'వాలెట్ న్యూరిటిస్' లేదా 'ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్' ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ట్రెండింగ్ వార్తలు
కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుందని, నిలబడి లేదా నడుస్తున్నప్పుడు నొప్పి తక్కువగా ఉంటుందని రోగికి చికిత్స చేసిన వైద్యుడు చెప్పాడు. అయితే అతడి తొడ వెనక భాగం నరాలు కాస్త దెబ్బతిన్నాయి. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే.. అసలు విషయం తెలిసింది. ఆ వ్యక్తి తన కుడి వెనక జేబులో ఎప్పుడూ లావుగా ఉండే వాలెట్(Wallet)ని తీసుకెళ్లేవాడు. ఆఫీసులో అతడు కూర్చొన్నంతసేపు... అది జేబులో ఉండిపోయేది.
ఇలా లావుపాటి పర్సు.. వెనక జేబులో పెట్టుకుని గంటల తరబడి కూర్చోవడం కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బ్యాక్ పెయిన్(Back Pain), పిరుదుల్లో నొప్పి, మోకాలు, అరికాళ్ల నొప్పి, తిమ్మిరి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయ్. దీనినే ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్(Fat Wallet Syndrome) అంటారు. ఇలా పర్సును ఎక్కువ సేపు అలానే వెనకలా పెట్టుకుని కూర్చొంటే.. కండరాల స్థితి మీద ప్రభావం పడుతుంది. తొడ వెనక భాగంలో నరాలు, పిరిఫార్మిస్ కండరాలకు కుదించుకుపోతాయి. కండరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాలు కుదించుకుపోతాయి.
ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు.. కూర్చున్నప్పుడు లేదా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ వెనక జేబులో నుండి మీ వాలెట్ తీసి, మీ ముందు జేబులో లేదా జాకెట్‌లో ఉంచండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు మరింత సరిగ్గా కూర్చోవడానికి సహాయపడుతుంది. వాలెట్(Wallet) పరిమాణం కూడా మరీ పెద్దగా ఉండొద్దు. వైద్యుల ప్రకారం.., ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు.. తమ వాలెట్లను తమ వెనక జేబులో పెట్టుకోకపోవడమే మంచిది.
ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. కూర్చోవడం లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు నొప్పి ఉంటుంది. కాలు మీద సూదులు గుచ్చినట్లుగా అనిపిస్తుంది. పాదంలో తిమ్మిరి నడవడంలో ఇబ్బంది కూడా వస్తుంది. ఇలా లక్షణాలు ఉంటే.. వైద్యుడిని సంప్రదించండి.. వెంటనే.. పర్సును వెనక జేబులో పెట్టుకోవడం మానేస్తే మంచిది.