Storage of oils: గ్యాస్ స్టవ్ పక్కనే వంటనూనె డబ్బా ఉంచుతున్నారా? అదెంతా ప్రమాదకరమో తెలుసా?-keeping a can of cooking oil next to the gas stove do you know how dangerous it is ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Storage Of Oils: గ్యాస్ స్టవ్ పక్కనే వంటనూనె డబ్బా ఉంచుతున్నారా? అదెంతా ప్రమాదకరమో తెలుసా?

Storage of oils: గ్యాస్ స్టవ్ పక్కనే వంటనూనె డబ్బా ఉంచుతున్నారా? అదెంతా ప్రమాదకరమో తెలుసా?

Haritha Chappa HT Telugu
Jun 13, 2024 10:42 AM IST

Storage of oils: చాలామందికి కిచెన్ లో గ్యాస్ స్టవ్ పక్కనే నూనె వేసిన క్యాన్ లేదా డబ్బాను ఉంచడం అలవాటు. అలా ఉంచడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని వివరిస్తున్నారు నిపుణులు. ఇది ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.

వంట నూనె ఎక్కడ స్టోర్ చేయాలి?
వంట నూనె ఎక్కడ స్టోర్ చేయాలి? (Pexels)

Storage of oils: చాలామంది ఇళ్లల్లో కిచెన్ చిన్నగానే ఉంటుంది. గ్యాస్ స్టవ్ పక్కనే వంట సామాను కూడా నిల్వ చేసుకునేవారు ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ పక్కనే వంట నూనె వేసిన డబ్బాలు, క్యాన్లు ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలా స్టవ్ పక్కన నూనె బాటిళ్లను ఉంచడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు కూడా చెప్పాయి. గ్యాస్ స్టవ్ పక్కన ఇలా నూనె నిల్వ చేయడం వల్ల నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. ఆయిల్ ... రాన్సిడ్ గా మారుతుందని వివరిస్తున్నారు. ఈ రాన్సిడ్ అనేది క్యాన్సర్ కారకమని చెబుతున్నారు వైద్యులు.

వంట నూనెల్లో అధిక కొవ్వు పదార్థాలు ఉంటాయి. మీరు ఆ వంట నూనెను బాటిల్‌లో వేయడం ప్రారంభించాక ఆ కొవ్వు పదార్థాలు క్షీణించడం ప్రారంభమవుతాయి. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అణువులు... కొవ్వులో ఉన్న ఆమ్ల గొలుసులపై దాడి చేస్తాయి. దీనివల్ల అధిక ఆక్సీకరణం జరుగుతుంది. ఇది ఆయిల్ ను రాన్సిడ్ అనే సమ్మేళనంగా మారిపోతుంది. ఇలా రాన్సిడ్‌గా మారిన నూనెను తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో సమస్యలు వస్తాయి. దీనివల్ల అకాల వృద్ధాప్యం వస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల ఊబకాయం బారిన పడతారు. ఊబకాయం వల్ల ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నూనెను ప్రతిరోజూ వినియోగించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే అల్జీమర్స్ వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందట. ఈ రాన్సిడ్ నూనెలతో వండిన ఆహారాలు తినడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా సాగదు. ఫ్రీ రాడికల్స్ కు సంబంధించిన వ్యాధులు అధికంగా వస్తాయి. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయిలు కూడా పడిపోతాయి.

నూనెలను ఇలా భద్రపరచండి

వంట నూనెలు అనేక రకాలు. మీరు ఏ నూనెను వాడుతున్నారో దాన్నిబట్టి నిలువ చేసే పద్ధతులు ఆధారపడి ఉంటాయి. కూరగాయల నూనెలు అంటే వెజిటబుల్ ఆయిల్స్. వాటి నాణ్యతను కాపాడుకోవడానికి చల్లని ప్రదేశాల్లో ఉంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదు. కిచెన్‌లో ఏ ప్రాంతంలో చల్లగా అనిపిస్తుందో... ఆ ప్రాంతంలో పెట్టండి. కాస్త చీకటిగా ఉండే ప్రదేశంలో పెడితే మంచిది. స్టవ్ పక్కన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. గాలి, వెలుతురు ఈ నూనెలు అధికంగా తగలకూడదు.

విత్తనాల నూనె

విత్తానాల నూనె అంటే గింజల నుండి తీసిన నూనె. బాదం నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ కూడా గింజల నుంచి ఉత్పత్తి చేసినవి. వీటిని సంరక్షించే పద్ధతులను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ నూనె ఎప్పుడైతే వాతావరణనికి గురవుతుందో అప్పుడు వాటిలో ఆక్సీకరణం, రాన్సిడిటీ ప్రారంభమవుతాయి. కాబట్టి వీటిని తాజాగా ఉంచడం కోసం రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు. ఈ నూనెలను గాలి చొరబడని కంటైనర్లలోనే ఉంచాలి. కాంతి అధికంగా పడే చోట ఉంచకూడదు. అలాగే వేడి అధికంగా తగిలేచోట కూడా ఉంచకూడదు. చాలామంది నూనె పెద్దగా పట్టించుకోరు. అది ఎలాగూ కళాయిలో వేసాక వేడెక్కేదే కాబట్టి ఎక్కడ పెట్టినా ఫరవాలేదు అనుకుంటారు. నిజానికి నూనెను చల్లని ప్రదేశాల్లోనే నిల్వ చేయాలి. అప్పుడే అవి సురక్షితంగా ఉంటాయి. వాటిలో క్యాన్సర్ కారకాలు జనించకుండా ఉంటాయి. ఆలివ్ నూనెలో వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. వీటిని స్టవ్ కి దూరంగా చల్లటి చీకటి ప్రదేశంలోనే ఉంచితే మంచిది. దీన్ని మూత తీసాక మూడు నుండి 6 నెలలలోపు వినియోగించాలి. ఆ తర్వాత పాడైపోయే అవకాశం ఉంది.

WhatsApp channel