Skin Care with Rice Water : పండుగ రోజు మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..
Skin Care with Rice Water : పండుగ సమయంలో కూడా వాడిపోయినా ముఖంతో ఉంటే ఏమి బాగుంటుంది చెప్పండి. అందుకే అమ్మాయిలు మీరు మెరిసే, ప్రకాశవంతమైన చర్మం కావాలంటే.. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని మీరు డైలీ ఫాలో అయిపోతే.. మీ ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మెరుస్తుంది.
Skin Care with Rice Water : మెరిసే, మచ్చలు లేని చర్మాన్ని కోరుకోని వాళ్లు చాలామంది ఉంటారు. దీనికోసం ఖరీదైన క్రీములు, ఫేషియల్స్ వాడుతారు. కానీ అవేమి లేకుండా అందమైన చర్మాన్ని పొందడం సాధ్యమేనా? అంటే సాధ్యమే అంటున్నారు నిపుణులు. కొన్ని హోమ్ ట్రిక్స్ పాటిస్తూ.. మీ ముఖ చర్మాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు.
కొరియన్ చర్మ సంరక్షణలో బియ్యం నీటికి చాలా ముఖ్యపాత్ర ఇస్తారు. అయితే మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ పొందాలంటే.. రైస్ వాటర్‌తో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో మీ ముఖాన్ని మెరిసేలా చేసేయండి. ఇంతకీ వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్స్
ఉదయాన్నే ముఖంపై ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయడం లేదా ఐస్ వాటర్‌లో ముఖాన్ని ఉంచడం చాలా మంచిది. ఇది మీ స్కిన్‌కి గ్లో ఇస్తుంది. పైగా నిద్రలేచిన తర్వాత ముఖంపై ఉన్న వాపు, కళ్ల కింద ఉబ్బిన వాటిని తగ్గిస్తుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. ఐస్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల సన్‌టాన్, సన్‌బర్న్ సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
బియ్యంతో ఐస్ క్యూబ్స్
2 టేబుల్ స్పూన్ల తెల్ల బియ్యాన్ని బాగా కడగాలి. ఇప్పుడు దానిని 2 గ్లాసుల నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు ఆ నీటిని వడకట్టండి. ఆ నీటిలో 1 చిటికెడు పసుపు, 2 చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌కి 1 స్పూన్ గంధపు పొడిని కలపండి. ఇప్పుడు పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యాక ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయాలి.
ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మీ ముఖానికి అప్లై చేయండి. మీకు జలుబు సమస్య ఉంటే దీనిని డే టైమ్‌లో మాత్రమే అప్లై చేయండి. దానిని మీ చర్మం గ్రహించేవరకు చేతులతో మసాజ్ చేయండి. 10-15 నిమిషాల తర్వాత నీళ్లతో మీ ముఖాన్ని కడగాలి. తర్వాత టోనర్, మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీనిని మీరు ప్రతిరోజూ అప్లై చేయవచ్చు. వారంలో రోజుల్లో మీరే ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు.
బయట నుంచే కాదు.. లోపల నుంచి కూడా
స్కిన్ బాగుండాలంటే బయటనుంచే కాదు.. లోపల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. రోజుకు కనీసం 4-5 లీటర్లు నీరు అయినా తీసుకోండి. రోజూ మీ ఆహారంలో పండ్లను చేర్చుకోండి. ఇది కాలానుగుణంగా ఉంటే చాలా మంచిది. నూనె, మసాలా, ఫ్రై చేసిన ఫుడ్‌కి దూరంగా ఉండండి. మీ పొట్టను క్లియర్ చేయడానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. హెల్తీ ఫుడ్ తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్