కాశ్మీరీ కీమా కర్రీ ఇలా చేస్తే రోటీతో, బగారా రైస్‌తో అద్భుతంగా ఉంటుంది-kashmiri keema curry is delicious with roti and bagara rice if you make it like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కాశ్మీరీ కీమా కర్రీ ఇలా చేస్తే రోటీతో, బగారా రైస్‌తో అద్భుతంగా ఉంటుంది

కాశ్మీరీ కీమా కర్రీ ఇలా చేస్తే రోటీతో, బగారా రైస్‌తో అద్భుతంగా ఉంటుంది

Haritha Chappa HT Telugu

కీమా కర్రీ పేరు చెబితేనే చాలామందికి నోరూరిపోతుంది. ఎప్పుడు మీ స్టైల్ లోనే కాకుండా కాశ్మీర్ స్టైల్లో కీమా కర్రీ వండి చూడండి. దీని రెసిపీ అద్భుతంగా ఉంటుంది.

కాశ్మీరీ కీమా రెసిపీ

కాశ్మీరీ స్టైల్లో వండే కొన్ని వంటలు టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము కాశ్మీరీ కీమా కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది. ఇక తింటే ఆపడం కష్టమే. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు. ఈ కాశ్మీరీ కీమా తినేందుకు కాశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే టేస్టీగా వండుకోవచ్చు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి .

కాశ్మీరీ కీమా రెసిపీకి కావలసిన పదార్థాలు

మటన్ కీమా - కిలో

జీలకర్ర - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - అరకప్పు

నెయ్యి - ఒక స్పూన్

బిర్యానీ ఆకులు - రెండు

జీలకర్ర - ఒక స్పూను

ఇంగువ - చిటికెడు

యాలకుల పొడి - అర స్పూను

గరం మసాలా - ఒక స్పూను

సొంఠి పొడి - అర స్పూను

సోంపు పొడి - రెండు స్పూన్లు

కారం - రెండు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కాశ్మీరీ మటన్ కీమా రెసిపీ

1. మటన్ కీమాను ఒక గిన్నెలో వేసి పరిశుభ్రంగా కడుక్కోవాలి.

2. ఇప్పుడు అదే బౌల్ లో మటన్ కీమాను వేసి అందులో ఉప్పు, కారం, సోంపు పొడి, సొంఠి పొడి, ఒక స్పూను ఆవాలు నూనె, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.

3. ఇప్పుడు ఆ మొత్తాన్ని మీకు నచ్చిన ఆకారంలో అంటే బాల్స్ లేదా కోడిగుడ్డు ఆకారంలో చుట్టి పక్కన పెట్టుకోవాలి.

4. కిలో కీమాతో 35 నుంచి 40 వరకు బాల్స్ తయారుచేయవచ్చు.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.

6. ఆ నూనెలో ఇంగువ, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

7.ఆ తర్వాత ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి.

8. ఇది ఉడుకుతున్నప్పుడే ఒక గ్లాసు నీటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

9. ఆ నీరు బాగా మరిగాక ముందుగా చుట్టు పెట్టుకున్న కీమా బాల్స్ ను అందులో వేసేయాలి.

10. ఆ తర్వాత గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి.

11. మొత్తం మిశ్రమాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా ఉడికే వరకు అలా ఉంచాలి. అవసరమైతే నీటిని పోస్తూ ఉండాలి.

12. మటన్ కీమా ఉడికేందుకు సమయం పడుతుంది. కాబట్టి ఓపిక మీద అలా ఉంచాల్సిన అవసరం ఉంది.

13. ఇందులో బిర్యానీ ఆకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. చివర్లో ఒక స్పూను నెయ్యిని వేసి మూత పెట్టేయాలి.

14. మటన్ కీమా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.

15. అంతే కాశ్మీర్ కీమా రెడీ అయినట్టే. దీంట్లో మనం ఎక్కువ పదార్థాలు వినియోగించము. కానీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని రోటితో తింటే అద్భుతంగా ఉంటుంది.

బగారా రైస్, బిర్యాని వంటలు చేసుకున్నప్పుడు పక్కన కాశ్మీరీ కీమా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఇంటి అతిధులు వచ్చినప్పుడు కూడా దీని వండించి చూడండి. కచ్చితంగా వారికి నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఒకసారి కాశ్మీరీ కీమా కర్రీ ప్రయత్నించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.