Kashmiri chicken Masala: నోరూరించే కాశ్మీరీ చికెన్ మసాలా ఇలా వండితే సూపర్ టేస్ట్, రెసిపీ ఇదిగో-kashmiri chicken masala recipe in telugu know how to make curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kashmiri Chicken Masala: నోరూరించే కాశ్మీరీ చికెన్ మసాలా ఇలా వండితే సూపర్ టేస్ట్, రెసిపీ ఇదిగో

Kashmiri chicken Masala: నోరూరించే కాశ్మీరీ చికెన్ మసాలా ఇలా వండితే సూపర్ టేస్ట్, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

Kashmiri chicken Masala: మీరు హోటల్ స్టైల్ లో కాశ్మీరీ చికెన్ మసాలాను రుచి చూసి ఉంటారు. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని పదార్ధాలను ఉపయోగించి రుచికరమైన కాశ్మీరీ చికెన్ మసాలా తయారు చేయడానికి ఇక్కడ రెసిపీ ఇచ్చాము.

కాశ్మీరీ చికెన్ మసాలా రెసిపీ

చికెన్ రెసిపీలు ఎంతో రుచిగా ఉంటాయి. రెస్టారెంట్లలో కాశ్మీరీ చికెన్ మసాలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇది చూడగానే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాశ్మీరీ స్టైల్ చికెన్ రెసిపీని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. చికెన్ వంటకాలు ఇష్టపడేవారికి ఇది కూడా బాగా నచ్చుతుంది. కాశ్మీరీ రెసిపీలలో జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు అధికంగా వాడుతూ ఉంటాము. రుచిలో మాత్రం ఈ కూర అద్భుతంగా ఉంటుంది.

కాశ్మీరీ స్టైల్ చికెన్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

జీడిపప్పు - 100 గ్రాములు

ఎండుద్రాక్ష - 50 గ్రాములు

పసుపు - అర స్పూను

జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్

ధనియాల పొడి - 1 టీస్పూన్

గరం మసాలా - 1/2 టీస్పూన్

కాశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

చికెన్ - అర కేజీ

నీరు - ఒక కప్పు

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు

టొమాటో - ఒకటి

ఉప్పు - రుచికి సరిపడా

కాశ్మీరీ చికెన్ మసాలా రెసిపీ

  1. మీరు ముందుగా జీడిపప్పు, ఎండుద్రాక్షను విడిగా పేస్టు చేయాలి.

2. మరో గిన్నె తీసుకుని అందులో కొద్దిగా పసుపు, జీలకర్ర పొడి, గరంమసాలా, ధనియాల పొడి, కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి.

3. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి అన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ లో చికెన్ వేసి బాగా మ్యారినేట్ చేయాలి.

4. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు మ్యారినేట్ చేయాలి.

5. బాణలిలో నెయ్యి వేడిచేసి మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి.

6. చికెన్ ఉడికిన తర్వాత పాన్ నుంచి తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి.

7. ఇప్పుడు అదే కళాయిలో తరిగిన టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

8. తరువాత అర కప్పు నీరు పోసి 2-3 నిమిషాలు మరిగించాలి.

9. ఇప్పుడు మీరు ఇప్పటికే తయారు చేసుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష పేస్ట్ వేయాలి.

10. ఇప్పటికే ఉడికిన చికెన్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి 10 నుంచి 15 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి.

11. అంతే కాశ్మీరీ చికెన్ మసాలా రెడీ అయినట్టే.

12. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

చికెన్ తో వండిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. కండరాల పెరుగుదలకు చికెన్ ఎంతో ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో ప్రొటీన్, విటమిన్ బి6, విటమిన్ బి12, సెలీనియం, ట్రిఫ్టోఫాన్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం