Kandi Pappu Pachadi: స్పైసీ కంది పచ్చడి ఇలా చేసుకుంటే అన్నం, దోశెలు, ఇడ్లీల్లోకి అదిరిపోతుంది
Kandi Pappu Pachadi: కందిపప్పును పచ్చడిగా మార్చి చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. దీన్ని చేయడం చాలా సులువు. పావుగంటలో ఇది రెడీ అయిపోతుంది.
Kandi Pappu Pachadi: కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీని ఎక్కువగా పప్పుగానే వండడానికి ఇష్టపడతారు. పాలకూర పప్పు, గోంగూర పప్పు ఇలా తింటారు. కానీ కందిపప్పుతో పచ్చడి చేసుకుని చూడండి. ఇది టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సులువు. కందిపప్పు పచ్చడి ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
కందిపప్పు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు - ఒక కప్పు
వెల్లుల్లి - ఐదు రెబ్బలు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఎండు మిర్చి - ఎనిమిది
ఆవాలు -ఒక స్పూను
నూనె - తగినంత
నీరు - సరిపడినన్ని
కరివేపాకులు - గుప్పెడు
కందిపప్పు పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి కందిపప్పును వేసి దూరంగా వేయించుకోవాలి.
2. అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
3. మిక్సీలోకి మొత్తం మిశ్రమాన్ని వేసి పచ్చడిలా రుబ్బుకోవాలి. అవసరమైనంత నీళ్లు పోసుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకులు, ఒక ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని ఆ మొత్తాన్ని కంది పచ్చడి పైన వేయాలి.
5. అంతే టేస్టీ కంది పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది స్పైసీగా ఉంటుంది. తినేందుకు కూడా చాలా బాగుంటుంది.
6. ఈ పచ్చడి అన్న లోనే కాదు రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ, ఉప్మాలో కూడా తినవచ్చు. ఇది ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.
హైబీపీ ఉన్నవారు కంది పప్పును తినడం చాలా అవసరం. కందిపప్పు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. అందుకే రక్తపోటు పెరగకుండా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కందిపప్పును తినడం చాలా అవసరం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు ఇలా కందిపప్పు పచ్చడిని చేసుకునే తింటే మంచిది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు అప్పుడప్పుడు కందిపప్పుతో చేసిన పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది. చికెన్, గుడ్లు వంటివి తిననివారు కందిపప్పును తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా పొందగలరు.
టాపిక్