Kanchipuram idli: రెగ్యులర్ ఇడ్లీ బోర్ కొడితే ఓసారి కాంచీపురం ఇడ్లీ చేసుకుని చూడండి, సూపర్ టేస్ట్
Kanchipuram idli: ప్రతి ఇంట్లోను వారంలో నాలుగు సార్లు ఇడ్లీనే బ్రేక్ ఫాస్ట్ గా ఉంటుంది. ప్రతిసారి ఒకేలాంటి ఇడ్లీ బోర్ కొడితే కాంచీపురం ఇడ్లీ ప్రయత్నించండి. దీని రెసిపీ చాలా సులువు.
\Kanchipuram idli: కాంచీపురం పేరు వినగానే ప్రవిత్ర పుణ్యక్షేత్రం గుర్తుకువస్తుంది. అంతేకాదు అక్కడ ఆహారం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాంచీపురం ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. మీకు సాధారణ ఇడ్లీ బోర్ కొడతే ఓసారి కాంచీపురం ఇడ్లీలు ట్రై చేయండి. దీని రుచి అదిరిపోతుంది. వీటిని చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

కాంచీపురం ఇడ్లీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ పిండి - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
కరివేపాకులు - గుప్పెడు
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం పొడి - అర స్పూను
జీలకర్ర - ఒక స్పూను
మిరియాల పొడి - చిటికెడు
పచ్చి మిర్చి - రెండు
శెనగపప్పు - ఒక స్పూను
కాంచీపురం ఇడ్లీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, కరివేపాకులు తరుగు వేసి వేయించాలి.
2. అందులోనే ఇంగువ పొడి, అల్లం పొడి, మిరియాల పొడి కూడా వేయించాలి.
3. ఈ మొత్తం మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి.
4. అందులో రుచికి సరిపడా ఉప్పును కూడా బాగా కలపాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని రాత్రంతా పులియబెట్టండి.
6. ఉదయం లేచాక ఇడ్లీ పాత్రలకు నెయ్యి రాసి ఇడ్లీ పిండిని వేయాలి.
7. ఇడ్లీ బాగా ఉడికాక స్టవ్ కట్టేయాలి.
8. అంతే కాంచీపురం ఇడ్లీ రెడీ అయినట్టే. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
సాధారణ ఇడ్లీతో పోలిస్తే కాంచీపురం ఇడ్లీ చాలా రుచిగానే ఉండడం కాదు, ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో వాడిన మిరియాల పొడి వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అలాగే ఇది క్యాన్సర్ తో పోరాడే శక్తిని ఇస్తుంది. అధిక బరువును అదుపులో ఉంచే శక్తి దీనికుంది. ఇందులో వాడిన ఇంగువ శ్వాస కోశ సమస్యలు రాకుండా ఉంటాయి. కఫం తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. దగ్గును తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది. సాధారణ ఇడ్లీ తింటే పోషకాల కన్నా కాంచీపురం ఇడ్లీ తినడం వల్ల మంచిది. ఒకసారి కాంచీపురం ఇడ్లీ ట్రై చేయండి.