Kaju Mushroom Masala: జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ, దీని ఇగురు వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది-kaju mushroom masala curry recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kaju Mushroom Masala: జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ, దీని ఇగురు వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Kaju Mushroom Masala: జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ, దీని ఇగురు వేడి వేడి అన్నంతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Jan 24, 2025 05:30 PM IST

Kaju Mushroom Masala: పుట్టగొడుగులు లేదా మష్రూమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటితో చేసే రెసిపీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ ఇచ్చాము.

జీడిపప్పు పుట్టగొడుగుల మసాలా కూర
జీడిపప్పు పుట్టగొడుగుల మసాలా కూర

పుట్టగొడుగుల కూర గుర్తొస్తేనే నోరూరిపోతుంది. దీనితో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము కాజు మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈ కర్రీ వండడం కూడా చాలా సులువు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో కూర వండితో అద్భుతంగా ఉండడం ఖాయం.

yearly horoscope entry point

జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

జీడిపప్పులు- అర కప్పు

పుట్టగొడుగులు - నాలుగు వందల గ్రాములు

టమోటాలు - మూడు

కొబ్బరి తురుము - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - మూడు స్పూన్లు

పసుపు - ఒక స్పూను

ఉల్లిపాయ - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

ఫ్రెష్ క్రీమ్ - రెండు స్పూన్లు

కసూరి మేథి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - పావు కప్పు

నీళ్లు - తగినన్ని

కాశ్మీరీ కారం - రెండు స్పూన్లు

జీడిపప్పు మష్రూమ్ మసాలా రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి. అందులో జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

2. ఇందులో పుట్టగొడుగులు ముక్కలు వేసి వేయించాలి. అర స్పూను ఉప్పు వేసి కలపాలి, పసుపు పొడి వేసి కలుపుకోవాలి. వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడదే కుళాయిలో నూనె వేసి అందులో ఉల్లిపాయల తరుగు వేసి రంగు మారే వరకు వేసి వేయించుకోవాలి.

4. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

5. ఈలోపు మిక్సీలో కొబ్బరి తురుము, టమోటాలు, జీడిపప్పులు వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.

6. ఈ పేస్టును కూడా కుళాయిలో వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇందులో కాశ్మీరీ కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.

8. ఈ మిశ్రమాన్ని బాగా వేగించి అందులో పుట్టగొడుగులను వేసుకోవాలి.

9. పైన కసూరి మేథి, కొత్తిమీర తరుగ వేసి బాగా కలుపుకోవాలి. అది ఇగురులాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయినట్టే.

జీడిపప్పు మష్పూమ్ కర్రీని వేడి వేడి అన్నంలో, చపాతీలో, రోటీలో తినవచ్చు. పైగా పోషకాలు కూడా ఎక్కువ. స్పూసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి లేదా కారం అధికంగా వేసుకుంటే సరిపోతుంది.

Whats_app_banner