Pumpkin Fries: ఫ్రెంచ్ ఫ్రైస్‌లాగే గుమ్మడికాయ ఫ్రైస్ కూడా చాలా సులువుగా చేసేయొచ్చు, రెసిపీ ఇదిగో
Pumpkin Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు చెబితేనే పిల్లలకు నోరూరిపోతుంది. బంగాళదుంపలతో చేసే ఈ ఫ్రైస్ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే గుమ్మడికాయతో కూడా ఫ్రైస్ చేయవచ్చు. గుమ్మడికాయ ఫ్రైస్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎంతో మందికి ఇష్టం. వీటిని బయట కొనడమే కాదు ఇంట్లో కూడా చేసుకుంటారు. వాటిలాగే గుమ్మడికాయలతో కూడా పంప్‌కిన్ ఫ్రైస్ చేయవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. బంగాళదుంపలతో ఎలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారో గుమ్మడికాయలతో కూడా అదే విధంగా ఈ ఫ్రైస్‌ను ప్రయత్నించవచ్చు. ఎయిర్ ఫ్రైయర్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది మరింత సులభంగా ఉండే అవకాశం ఉంది. లేదా ఇంట్లో డీప్ ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. గుమ్మడికాయలతో ఫ్రైస్ ఎలా చేయాలో తెలుసుకోండి.
గుమ్మడికాయ ఫ్రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ ముక్కలు - రెండు కప్పులు
పచ్చి ఆలివ్ నూనె - రెండు స్పూన్లు
చిల్లీ ఫ్లెక్స్ - అర స్పూను
వెల్లుల్లి పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూను
పసుపు - అరస్పూను
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
గుమ్మడికాయ ఫ్రైస్ రెసిపీ
1. ఫ్రెంచ్ ఫ్రైస్‌లాగే గుమ్మడికాయ ఫ్రైస్ చాలా సులువుగా ఉండవచ్చు.
2. ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే మరింత సులువుగా అయిపోతుంది. లేకుంటే ఓవెన్‌లో కూడా ఈ గుమ్మడికాయ ఫ్రైస్ చేయవచ్చు.
3. ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్ లేని వారు కళాయిలోనే వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
4. ముందు గుమ్మడికాయ పైన పొట్టును తీసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలోనే నిలువుగా కట్ చేసుకోవాలి.
5. ఒక గిన్నెలో ఈ ముక్కలన్నీ వేసి ఆలివ్ నూనె వేయాలి.
6. అలాగే రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి పొడి, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
7. దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేసుకోవాలి.
9. ఆ నూనెలో గుమ్మడికాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
10. టిష్యూ పేపర్ మీద వేస్తే అదనపు నూనెను ఇది పీల్చేసుకుంటుంది. అంతే గుమ్మడికాయ ఫ్రైస్ రెడీ అయినట్.టే
ఓవెన్‌లో వండాలనుకుంటే ఓవెన్‌ను 200° డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేపై అల్యూమినియం ఫాయిల్ వేసి వాటిపై గుమ్మడికాయ ముక్కలను ఒకదానికొకటి అతుక్కోకుండా పరచాలి. వాటిని ఓవెన్ లో పెట్టి అవి ఫ్రై అయ్యేవరకు ఉంచాలి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇంకా సింపుల్‌గా వీటిని వండవచ్చు. ఎలా చేసినా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటాయి.