Drumsticks: మునక్కాడలను వారానికి రెండు సార్లు తినండి చాలు, ఈ సమస్యలేవీ మీకు రావు
Drumsticks: మునక్కాడలను సాంబార్లో వేయడానికి మాత్రమే చూస్తారు. నిజానికి మునక్కాడల కూర వారానికి రెండు మూడు సార్లు తినడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. మునక్కాయల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి .
మునక్కాడల పేరు చెప్తే అందరికీ గుర్తొచ్చేది సాంబార్ మాత్రమే. వీటిని సాంబార్లో వేసే కూరగాయగా మాత్రమే చూస్తున్నారు గాని అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చే ఔషధంగా మాత్రం చూడడం లేదు. మునక్కాడలను సాంబార్లో వేసినప్పుడే తినడం కాదు, ప్రత్యేకంగా వాటిని కూరలా వండుకొని తినాల్సిన అవసరం కూడా ఉంది. వీటి రుచి కూడా బాగుంటుంది. వీటిని పోషకాల పవర్ హౌస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మిరాకిల్ వెజిటబుల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మునక్కాడలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఇది మన శరీరానికి ఎన్నో అద్భుతాలను చేస్తుంది.
మన శరీరం మొత్తానికి దోహదపడే పోషకాలను కలిగి ఉన్న కూరగాయ ములక్కాడ. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ములక్కాడను తినడం వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోండి.
మునగకాయలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ సమ్మేళనాలన్నీ కలిసి శరీరాన్ని బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది.
మునక్కాడలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి పేగుల ఆరోగ్యాన్ని బలంగా మారుస్తాయి. ఫైబర్ పేగుల్లో ఆహారం కదలికలను మెరుగుపరుస్తుంది. దీని వల్ల పొట్టనొప్పి వంటివి రావు. అలాగే జీర్ణవ్యవస్థ కూడా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటుంది. శరీరం అందులోని పోషకాలను గ్రహిస్తుంది.
చర్మకాంతికి మునక్కాడ
చర్మకాంతిని పెంచడానికి మునక్కాడలు ఎంతో ఉపయోగపడతాయి. మునక్కాడలు నీటి శాతం అధికంగానే ఉంటుంది. అలాగే విటమిన్లు, ఖనిజాలు ఎక్కువే దీన్ని తినడం వల్ల చర్మ స్థితిస్థాపకత సవ్యంగా ఉంటుంది. అలాగే ప్రకాశవంతంగా కూడా మారుతుంది.
డయాబెటిస్ తో బాధపడుతున్న వారు తరచూ మునక్కాడలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చూస్తుంది. దీనివల్ల రక్తంలో ఒకేసారి గ్లూకోజ్ ఆకస్మికంగా పెరగడం అనేది ఉండదు.
కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు మునక్కాడల్లో అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కీళ్లు, ఆరోగ్యకరమైన ఎముకలను అందిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ములక్కాడలను తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. స్పష్టమైన దృష్టిని పెంచుతుంది.
మునక్కాడలు తినడం వల్ల శరీరంలో రక్త ప్రవాహం సవ్యంగా ఉంటుంది. ఇది హృదయానాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉండేలా చూస్తుంది. శరీరానికి సహజమైన శక్తిని అందిస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైటో న్యూట్రియెంట్లను ఇది అందిస్తుంది.
మునక్కాయలోని పోషకాలు శ్వాసకోశ వ్యవస్థను కాపాడతాయి. శ్వాస నాళాలను శుభ్రపరుస్తాయి. శ్వాస సవ్యంగా ఆడేలా చూస్తాయి. అలాగే మునగలు మెదడు సామర్థ్యాన్ని పెంచే పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి మానసిక సమస్యలను తగ్గించడమే కాదు, నిర్ణయాలు తీసుకునే మానసిక స్పష్టతను కూడా పెంచుతాయి. మీ ఆహారంలో మునక్కాడలను తరచూ వాడడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.
టాపిక్