Beauty tips: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, మరుసటి రోజు ఉదయం ముఖం మెరిసిపోతుంది-just do this little thing before going to bed at night and your face will glow the next morning ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, మరుసటి రోజు ఉదయం ముఖం మెరిసిపోతుంది

Beauty tips: రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేయండి చాలు, మరుసటి రోజు ఉదయం ముఖం మెరిసిపోతుంది

Haritha Chappa HT Telugu
Sep 05, 2024 10:30 AM IST

Beauty tips: పండుగ సీజన్ ప్రారంభం కాబోతోంది. ముఖం కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇక్కడ మేము స్కిన్ వైటనింగ్ ఫేషియల్స్ గురించి ఇచ్చాము. రాత్రి పడుకునే ముందు ఈ ఫేషియల్ చేసుకుని నిద్రపోండి. ఉదయం లేచేసరికి చర్మానికి మెరుపు వస్తుంది.

రాత్రిపూట చేయాల్సిన ఫేషియల్
రాత్రిపూట చేయాల్సిన ఫేషియల్ (Shutterstock )

చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం ఎప్పటికప్పుడు ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ప్రతిసారీ మీరు ఫేషియల్స్ కోసం పార్లర్ కు వెళితే వందల రూపాయలు ఖర్చవుతుంది. ఇంట్లోనే సులభంగా చేసుకునే షేషియల్స్ కొన్ని ఉన్నాయి. వీటికి పెద్దగా ఖర్చు కాదు.

పండుగల సీజన్ ప్రారంభం కాబోతోంది కాబట్టి ఒక్కరాత్రి మెరుపును తెచ్చే షేషియల్స్ ఇక్కడ ఇచ్చాము. చర్మాన్ని శుభ్రపరచడంతో పాటూ రంగును పెంచే బ్యూటీ టిప్స్ కొన్ని ఉన్నాయి. వీటిని రాత్రిపూట పాటించి కంటి నిండా నిద్రపోవాలి. ఉదయం లేచేసరికి మీ చర్మం మెరిసిపోతూ ఉంటుంది. పండుగ రోజు అందంగా కనిపించడానికి ముందు రోజు రాత్రే ఏం చేయాలో తెలుసుకోండి.

టానింగ్ చేయండి

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని క్లీన్ చేసుకోండి. డీ టాన్ ప్యాక్ వేయండి. అంటే ముఖంపై ఉన్న మురికిని పొగొట్టుకోవాలి. టానింగ్ క్రీములు బయట దొరుకుతాయి. వాటితో ముఖాన్ని బాగా రుద్ది నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి మొత్తం పోతుంది. ఇంట్లో దొరికే పదార్థాలోనే టానింగ్ చేయాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ పాలు, రోజ్ వాటర్, అలోవెలా జెల్ కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. చేత్తో మసాజ్ చేసి కాసేపటికి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంటే ముఖానికి పట్టిన మురికి పోతుంది.

ముఖానికి పట్టిన మురికిని తొలగించడానికి బియ్యప్పిండి ఉత్తమమైనది. అది లేకపోతే శనగపిండినైనా తీసుకోవచ్చు. అయితే మంచి ఫలితాల కోసం బియ్యప్పిండి ఉత్తమం. ఈ పిండిలో పెరుగు, టొమాటో గుజ్జు కలపాలి. బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కనీసం 8-10 నిమిషాలు మసాజ్ చేసి తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేసుకున్నాక రాత్రి బాగా నిద్రపోవాలి. ఉదయం చూసే సరికి ముఖం చాలా క్లీన్ గా, కాంతివంతంగా ఉంటుంది.

ఫేస్ ప్యాక్ ఇలా

రాత్రి పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. ముల్తానీ మిట్టి, గంధం పొడి, పాలు, తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. తర్వాత ఈ ప్యాక్ ను తడి చర్మంపై అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇది ముఖాన్ని మెరిపిస్తుంది. మరుసటి రోజు ఉదయానికి ఎంతో అందంగా మారుతుంది.

టోనర్ వాడండి

టోనర్ ముఖాన్ని క్లీన్ చేయడానికి చాలా ముఖ్యమైనది. ఇందుకు బియ్యం నీళ్లు ఉత్తమం వాడడం ముఖ్యం. అమ్మాయిలు గాజులాంటి మెరిసే చర్మాన్ని పొందడానికి బియ్యం నీటిని ఉపయోగిస్తారు. కొరియన్ల బ్యూటీ సీక్రెట్ కూడా ఇదే. బియ్యం నీటిని కేవలం చర్మానికే కాదు, జుట్టుకు కూడా వాడవచ్చు. ఇది చాలా తక్కువ ఖర్చయ్యే బ్యూటీ సీక్రెట్.

పైన మేము చెప్పిన ఫేషియల్స్ రాత్రిపూట అప్లై చేసుకుని, నీళ్లతో శుభ్రం చేసుకుని రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోండి చాలు. మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.