Obesity: ప్రతిరోజూ ఈ నాలుగు ఇంటి పనులు చేయండి చాలు బరువు సులువుగా తగ్గిపోతారు, వ్యాయామాలు అవసరం లేదు-just do these four household chores every day and you will lose weight easily no exercise required ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Obesity: ప్రతిరోజూ ఈ నాలుగు ఇంటి పనులు చేయండి చాలు బరువు సులువుగా తగ్గిపోతారు, వ్యాయామాలు అవసరం లేదు

Obesity: ప్రతిరోజూ ఈ నాలుగు ఇంటి పనులు చేయండి చాలు బరువు సులువుగా తగ్గిపోతారు, వ్యాయామాలు అవసరం లేదు

Haritha Chappa HT Telugu
Published Feb 07, 2025 07:00 PM IST

Obesity: మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే జిమ్ లో వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల ఇంటి పనులు మీకు మంచి శారీరక వ్యాయామాల్లా పనిచేస్తాయి. చిన్న చిన్న ఇంటి పనులను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా, మీరు జిమ్ కు వెళ్లకుండానే బరువును తగ్గించుకోవచ్చు.

వెయిట్ లాస్ టిప్స్
వెయిట్ లాస్ టిప్స్ (Shutterstock)

స్థూలకాయం సమస్య నేడు అధికమైపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి దీనికి కారణమవుతాయి. ప్రస్తుతం మన దినచర్యలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. మన ఆహారంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అధికంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో, ఊబకాయం మాత్రమే కాదు… అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. మీరు కూడా ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గాలనుకుంటే, మీరు చేయవలసిన మొదటి పని… మీ ఆహారం, పనులు విషయంలో జాగ్రత్తపడడం.

బరువు తగ్గడానికి ప్రతిరోజూ భారీ వ్యాయమాలు చేయాల్సిన అవసరం లేదు. జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు కొన్ని ఇంటి పనులు చేయడం ద్వారా బరువు సులువుగా తగ్గవచ్చు. రోజూ కాసేపు ఈ పనులు చేస్తే బరువు తగ్గడంతో పాటూ మీ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మీ బరువు తగ్గించే ప్రయాణంలో సహాయపడే ఇంటి పనులు ఏమిటో తెలుసుకుందాం.

బరువు తగ్గించే ఇంటి పనులు

ఇంటిని ప్రతిరోజూ చీపురుతో వంగి తుడవడం అలవాటుగా మార్చుకోండి. బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, ఈ రోజువారీ పనిని మీరే చేయండి. అరగంట పాటూ ఇల్లు తుడవడం వల్ల 145 కేలరీలు ఖర్చవుతాయి. ఇది జిమ్ లో 15 నిమిషాల పాటు ట్రెడ్ మిల్ పై పరిగెత్తడంతో సమానం. చేతులు, పాదాలు, కోర్ కండరాలకు ఇది మంచి వ్యాయామం.

వాషింగ్ మెషీన్ వద్దు

ఇప్పుడు బట్టలు ఉతకడానికి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బట్టలు ఉతికే పనిని ఎప్పుడో వదిలేశారు. మీరు ఇంట్లోనే బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, మీ చేతులతో బట్టలను ఉతకడం ప్రారంభించండి. బట్టలు ఉతుక్కునేటప్పుడు నీటి నుంచి తొలగించడం, పిండడం, ఆరబెట్టడం ద్వారా శరీర కదలికలు బాగుంటాయి. చేతులు, పాదాలు, నడుము, కోర్, వీపు, భుజాలు వంటి ప్రాంతాల కండరాలకు ఇది మంచి వ్యాయామం. కాబట్టి బట్టలు చేత్తోనే ఉతకండి.

గిన్నెలు తోమడం

గిన్నలను కడగడం కొంచెం బోరింగ్ పని. ఇది మీ శరీరానికి సులభమైన, మంచి శారీరక శ్రమ. వాస్తవానికి, పాత్రలు కడగేటప్పుడు చేతులు, మణికట్టు కండరాలు చాలా చురుకుగా ఉంటాయి. ఇది కాకుండా, మీరు పాత్రలు కడగేటప్పుడు నిలబడి ఆ పనిచేస్తారు. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీకు భారీ శారీరక శ్రమ చేయాలని అనిపించకపోతే, సింక్లో ఉన్న అన్ని పాత్రలను కడిగినా మంచిదే.

వంట చేయడం కూడా వ్యాయామంలో ఒక భాగమే. రోజూ వంట చేయడం కూడా శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కూరగయాలు కోయడం, వేయించడం, వంట చేసేటప్పుడు నిలబడటం వల్ల చేతులు, పాదాలు, మణికట్టు, నడుము కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇది కాకుండా, వంట చాలా మందికి ఒత్తిడిని విడుదల చేయడానికి కూడా పనిచేస్తుంది. మీ చేతులతో వంట చేయడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ కోసం ఆలోచించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు, ఇది మీ బరువు తగ్గించే ప్రయాణంలో చాలా ముఖ్యమైనది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం