రాత్రి పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి చాలు, మొండి కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు-just do these 5 things before going to bed at night and you will melt stubborn fat and lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాత్రి పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి చాలు, మొండి కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు

రాత్రి పడుకునే ముందు ఈ 5 పనులు చేయండి చాలు, మొండి కొవ్వు కరిగిపోయి బరువు తగ్గుతారు

Haritha Chappa HT Telugu

సరైన ఆహారం, శారీరక వ్యాయామాలతో పాటు, మీరు చేసే చిన్న చిన్న పనులు బరువు సులువుగా తగ్గిస్తాయి. రాత్రిపూట పాటించే కొన్ని అలవాట్ల ఊబకాయం బారి నుంచి బయటపడవచ్చు. బరువ తగ్గడానికి సహకరించే అలవాట్లు లేదా పనులు గురించి ఇక్కడ ఇచ్చాము.

బరువును తగ్గించే రాత్రి అలవాట్లు (Shutterstock)

ఊబకాయం సమస్యతో బాధపడుతున్నవారు మనదేశంలో ఎంతో మంది ఉన్నారు.సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం స్థూలకాయానికి ప్రధాన కారణాలుగా మారాయి. పెరుగుతున్న బరువుతో ఇబ్బంది పడుతున్నవారు ప్రపంచంలో పెరిగిపోతున్నారు. బరువును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకునేందుకు ప్రయత్నాస్తున్నారు. బరువు తగ్గేందుకు రాత్రిపూట మీరు కొన్ని పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చు. అయితే వీటితో పాటు కొన్ని చిన్న చిన్న మార్పులు, అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గించే ప్రయాణాన్ని కాస్త వేగవంతం చేయవచ్చు. ఈ రోజు మేము అటువంటి కొన్ని రాత్రిపూట అలవాట్ల గురించి వివరించాము. వీటిని పాటించడం ద్వారా మీరు మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని సులువుగా పూర్తిచేయవచ్చు.

రాత్రి భోజనం

మీ రాత్రి భోజనాన్ని త్వరగా ముగించాలి. కొంతమంది రాత్రి 9 దాటాక భోజనం చేస్తూ ఉంటారు. రాత్రి ఏడు కల్లా రాత్రి భోజనం పూర్తిచేయాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం నుంచి ఆధునిక విజ్ఞానం వరకు వీలైనంత త్వరగా డిన్నర్ తినడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి రాత్రి 7 గంటల లోపు డిన్నర్ ముగించి ఆ తర్వాత ఏమీ తినకూడదు. నిద్రకు, తినడానికి మధ్య సుమారు మూడు గంటల వ్యవధి ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది.

తేలికపాటి ఆహారం

మీరు బరువు తగ్గాలనుకుంటే, రాత్రి భోజనాన్ని చాలా తేలిక పాటి ఆహారంతో పూర్తి చేయాలి. డిన్నర్ లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చండి. ఇది మీ పొట్టను త్వరగా నింపుతుంది. బరువు పెరుగుతామనే ఆందోళన ఉండదు. డిన్నర్ లో వెజిటబుల్ సూప్, ఉడికించిన కూరగాయలు, సలాడ్, కాయధాన్యాలు కిచిడీ, గంజి వంటివి చేర్చుకోవచ్చు. మొత్తం మీద బరువు తగ్గాలనుకుంటే ఉదయం అల్పాహారం రాజులా, రాత్రి భోజనం బిచ్చగాడిలా చేయాలి. అంటే చాలా తక్కువ పరిమాణంలో తినాలనే నియమాన్ని గుర్తుంచుకోండి.

గోరువెచ్చని పాలు

రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. ఇది అద్భుతమైన నిద్ర, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాస్తవానికి, పసుపు పాలలో థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి, ఇవి కొవ్వును కాల్చడానికి సహాయపడతాయి. ఇది జీవక్రియ, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీరు మలబద్దకంతో బాధపడుతుంటే, పసుపు పాలు తాగడం మీకు ఎంతో మంచిది. పాలు తాగకూడదనుకుంటే వేడినీటిలో అర టీస్పూన్ పసుపు కలిపి తింటే బరువు తగ్గడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీరు బరువు తగ్గాలనుకుంటే, నిద్రకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ క్లినికల్ సెంటర్ పరిశోధన ప్రకారం, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న గదిలో నిద్రపోయే వ్యక్తులు… అధిక ఉష్ణోగ్రతలలో నిద్రపోయే వారి కంటే ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తారు. ఈ సందర్భంలో, మీరు గది ఉష్ణోగ్రతను కూడా చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇది కాకుండా, కొన్ని పరిశోధనలు చీకటిలో నిద్రపోవడం వల్ల ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయని చెబుతున్నాయి.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడానికి, మీరు తగినంత మంచి, గాఢమైన నిద్ర పొందడం చాలా ముఖ్యం. కనీసం 7 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. వాస్తవానికి, ఊబకాయానికి, నిద్రకు సంబంధం ఉంది. మీరు సరిగ్గా నిద్రపోనప్పుడు, మీ జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల ఆహారం కొవ్వురూపంలోకి మారిపోతుంది. కాబట్టి నిద్ర బాగా పట్టేలా చూసుకోండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం