Pearl Millet: సజ్జ రొట్టెలు ఆరోగ్యానికి మంచివే కానీ ఇలాంటి వారు తిన్నారంటే ప్రమాదంలో పడతారు?
ఆరోగ్యం పట్ల అప్రమత్తత ఉన్న చాలా మంది మిల్లెట్స్‌ను తీసుకుంటున్నారు. దీని వల్ల బరువు తగ్గడంతో పాటు అనారోగ్యకరమైన కొవ్వులకు దూరంగా ఉంటామని భావిస్తున్నారు. ఇందులో నిజం ఉన్నప్పటికీ, సజ్జలు లాంటి మిల్లెట్‌ను తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవానికి ఇది అందరూ తీసుకోకూడదు కూడా.
బరువు తగ్గాలనుకునే వారు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలనుకున్న వారు ఇటీవల కాలంలో మిల్లెట్స్ తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అత్యంత పోషక విలువలున్న సజ్జలు కూడా అందులో ఒకటి. సూపర్ ఫుడ్ లలో ఒకటైన ఈ సజ్జలతో కిచిడి, కీర్, మఠారి, లడ్డూ, రొట్టెలు లాంటివి తయారుచేసుకుని తింటుంటారు. వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో సజ్జలతో చేసిన రొట్టెలు చాలా ఫ్యామస్ కూడా. శీతాకాలంలో చాలా ఎక్కువ మంది వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషక విలువల్లో ఏ మాత్రం తక్కువ కాని సజ్జలకు అంత క్రేజ్ మరి.

ఇంతటి ఆరోగ్యకరమైన ఫుడ్ కొందరికి మాత్రం సరిపడదని తెలుసా. ? అసలు దీనిని తీసుకుందామనే ఆలోచన కూడా చేయకూడదట. అలాంటి వారెవరో, ఎందుకు సరిపడదో తెలుసుకుందామా?
జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు
ఆరోగ్య నిపుణుల ప్రకారం, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు సజ్జలతో తయారుచేసిన రొట్టెలు తక్కువగా తినాలి. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలు, ఉబ్బరం లేదా బరువుగా అనిపించినప్పుడు సజ్జల రొట్టెలు తినడం మానుకోవాలి. నిజానికి, సజ్జలు వెచ్చగా, పొడిగా ఉంటాయి. వీటితో తయారుచేసిన వంటకాలు జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. చాలా సార్లు దీన్ని జీర్ణం చేయడం కష్టంగా మారుతుంది కూడా. కాబట్టి, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో సజ్జలకు బదులుగా వేరే ఏదైనా తేలికపాటి ధాన్యాలను చేర్చుకోవడం ఉత్తమం.
గర్భిణీ స్త్రీలు సజ్జల రొట్టెలకు దూరంగా ఉండాలి
గర్భిణీ స్త్రీలకు సజ్జల రొట్టెలు తినడం మంచిది కాదు. నిజానికి, వీటి వెచ్చదనం కారణంగా, ఇది గర్భంలోని శిశువుకు ఇబ్బంది కలిగించవచ్చు. దీన్ని జీర్ణం చేయడం కూడా కష్టంగా ఉండవచ్చు. కాబట్టి, నిపుణులు గర్భధారణ సమయంలో సజ్జలతో తయారుచేయని కిచిడి, దోస లేదా సులభంగా జీర్ణం అయ్యే ధాన్యాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. జీర్ణక్రియలో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తాయి.
చర్మ అలర్జీ సమస్య ఉన్నవారు
చర్మ అలర్జీ, దురద లేదా దద్దుర్లు ఉన్నవారు తమ ఆహారంలో సజ్జల రొట్టెలను పరిమితంగా తీసుకోవాలి. సజ్జల వెచ్చదనం, పొడి స్వభావం కారణంగా, ఇది చర్మ సమస్యలను ప్రేరేపించవచ్చు. అప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతుంటే వాటిని మరింత తీవ్రతరం చేయవచ్చు. కాబట్టి, ఇటువంటి వారు సజ్జల రొట్టెలు తినాలనుకుంటే, ముందుగా వైద్యుడిని సంప్రదించండి.
థైరాయిడ్ సమస్య ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి
ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం, థైరాయిడ్ సమస్య ఉన్నవారు సజ్జలతో తయారు చేసిన రొట్టెలు తినడం మానుకోవాలి. నిజానికి, సజ్జలలో గైట్రోజెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నేరుగా థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. దీని వలన థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. కాబట్టి, సజ్జల రొట్టెలను పరిమితంగా తినడం మంచిది. మీకు బాగా ఇష్టంగా ఉండి ఇంకా ఎక్కువగా తినాలని అనిపిస్తే, ముందుగా మీ వైద్యుడ్ని సంప్రదించడం మర్చిపోకండి.
సంబంధిత కథనం