Jowar Roti: జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరికీ కాదు! శీతాకాలంలో వీరు అస్సలు తినకూడదట!-jowar roti is healthy but not for everyone especially in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jowar Roti: జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరికీ కాదు! శీతాకాలంలో వీరు అస్సలు తినకూడదట!

Jowar Roti: జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరికీ కాదు! శీతాకాలంలో వీరు అస్సలు తినకూడదట!

Ramya Sri Marka HT Telugu
Jan 03, 2025 10:30 AM IST

Jowar Roti: ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది కచ్చితంగా ఏదో ఒక పూట జొన్నరొట్టెను తీసుకుంటున్నారట. మనం అనుకున్నట్లుగా జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరి విషయంలో కాదట! ఇందులో ఉన్న గుణాలు, పోషకాలు కొందరినీ మరింత ప్రమాదంలోకి తీసుకెళ్తాయట! ముఖ్యంగా శీతాకాలంలో..

జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరికీ కాదు
జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిదే కానీ, అందరికీ కాదు

డైటింగ్ చేయాలనుకునే కొందరు, డయాబెటిస్, ఊబకాయానికి భయపడి ఇంకొందరు జొన్న రొట్టెలు తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నూనెతో సంబంధం లేకుండా కాల్చే జొన్న రొట్టెలు ఏదో ఒక పూట తమ డైట్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే, మొక్కజొన్న రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. పైగా ఇందులో ఉండే ఫైబర్ గుణాలు, చక్కెర శాతం కూడా తక్కువ. అందుకే డయాబెటిస్ పేషెంట్లు కూడా వీటిని తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

yearly horoscope entry point

ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులలో మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు తినడం ఆరోగ్యానికి హాని కలుగచేస్తాయట. ఇవి అన్ని సమయాల్లో అందరికీ మంచివి కాదట.! ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇవి లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తాయట. అదెలా..? జొన్న రొట్టెలు ఎవరెవరి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం కలుగజేస్తాయో తెలుసుకుందాం.

మొక్కజొన్న రొట్టె తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

ఆస్తమా రోగులు:

మొక్కజొన్న రొట్టె తినడం వల్ల ఆస్తమా రోగుల సమస్యలు పెరుగుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల వారి లక్షణాలు తీవ్రమవుతాయి. జొన్న రొట్టెల్లో అధికంగా ఉండే ఫైబర్ చాలా మందికి మంచిది, కానీ ఆస్తమా రోగులకు ఇది సమస్యగా మారవచ్చు. అధిక ఫైబర్ శరీరంలో గ్యాస్, బ్లొటింగ్, కడుపు నొప్పులను కలిగించే అవకాశం ఉంటుంది. ఆస్తమా రోగులలో ఇలాంటి సమస్యలు పెరిగితే, వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

డయాబెటిస్ పేషెంట్లు:

రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారు మొక్కజొన్న పిండితో చేసిన రొట్టెలు తినకపోవడమే మంచిది. మొక్కజొన్న పిండిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ కు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి.

అలెర్జీ రియాక్షన్:

కొంతమంది వ్యక్తులు జొన్న రొట్టెలు తినడం పట్ల అలర్జీ కలుగువచ్చు. ఈ అలర్జీ కారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలను రెట్టింపు చేసే అవకాశం ఉంది. జొన్న రొట్టెల వల్ల దుష్ప్రభావాలు కలిగి వాంతులు, మైకం, తలనొప్పి, వికారంతో పాటు చర్మంపై దద్దుర్లు, దురద కూడా ఏర్పడతాయి.

జీర్ణ సమస్యలు:

మీరు ఇప్పటికే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, జొన్నరొట్టె మీ సమస్యను మరింత పెంచుతుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ పొట్టకు హాని కలగజేస్తుంది. అజీర్ణం, కడుపు నొప్పికి దారితీస్తుంది.

స్థూలకాయం:

బరువు తగ్గాలనే ఆలోచనలో ఉన్న వారు జొన్న రొట్టెను ఎక్కువగా తినకూడదు. సాధారణంగా అధిక కేలరీలు ఉండే జొన్న రొట్టెను రోజూ తినడం వల్ల శరీరంలోకి కేలరీలు అధికమొత్తంలో చేరతాయి. పూర్తిగా ఖర్చు అవని కేలరీలు శరీరంలో కొవ్వును పెంచి స్థూలకాయ సమస్యను తీవ్రతరం చేస్తాయి.

మొక్కజొన్న రొట్టె తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • జొన్న రొట్టెలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మందంగా ఉన్న జొన్నరొట్టెలను తీసుకోకపోవడమే మంచిది. సన్నపాటివి చేసుకుని చిన్న మంట మీద కాల్చుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది.
  • జొన్నరొట్టెలను రాత్రుళ్లు తింటే అరిగేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటిని తీసుకునేటప్పుడు కేవలం జొన్నరొట్టెలను మాత్రమే తినాలి. వీటితో పాటు ఆహారంగా మరే ఇతర పదార్థాలను చేర్చకూడదు.
  • జీర్ణానికి ఎక్కువ సమయం పట్టే జొన్నరొట్టెలను మధ్యాహ్న సమయాల్లో తినడమే ఉత్తమం.
  • ఈ రొట్టెలను తినే సమయంలో పచ్చడి, కూరలు చేసుకుని తింటూ ఉంటాం. అవి ఎట్టి పరిస్థితుల్లో పుల్లని రుచి కలిగినవి కాకపోవడమే బెటర్.

Whats_app_banner

సంబంధిత కథనం