Jonna khichdi: డయాబెటిస్ పేషెంట్ల కోసం జొన్న కిచిడి ఇలా చేసుకోండి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు-jonna khichdi recipe in telugu know how to make this diabetes friendly recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Jonna Khichdi: డయాబెటిస్ పేషెంట్ల కోసం జొన్న కిచిడి ఇలా చేసుకోండి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు

Jonna khichdi: డయాబెటిస్ పేషెంట్ల కోసం జొన్న కిచిడి ఇలా చేసుకోండి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వదు

Haritha Chappa HT Telugu
Sep 19, 2024 11:30 AM IST

Jonna khichdi: డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారికి జొన్న కిచిడి మంచి ఎంపిక అని చెప్పుకోవాలి. దీన్ని తినడం వల్ల పొట్ట నిండినట్టుగా ఉంటుంది. అలాగే కావాల్సిన పోషకాలు అందుతాయి. రెసిపీ చాలా సులువు.

జొన్న కిచిడీ రెసిపీ
జొన్న కిచిడీ రెసిపీ

Jonna khichdi: డయాబెటిక్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మేము వారి కోసం జొన్న కిచిడి రెసిపీ ఇచ్చాము. దీన్ని తినడం వల్ల వారి పొట్ట నిండుగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. జొన్న కిచిడీ తినడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉండడం జరుగుతుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

జొన్న కిచిడి రెసిపీకి కావలసిన పదార్థాలు

జొన్న రవ్వ - ఒక కప్పు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

కరివేపాకులు - గుప్పెడు

పచ్చి శనగపప్పు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాలు - ఐదు

నెయ్యి - రెండు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

వెల్లుల్లి పాయ తరుగు - ఒక స్పూను

పచ్చిమిర్చి - రెండు

ఉల్లిపాయలు - ఒకటి

మినప్పప్పు - ఒక స్పూను

జొన్న కిచిడి రెసిపీ

1. జొన్న రవ్వను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి.

2. అది ఉడకడానికి సరిపడా నీళ్లను వేసి ఉప్పు, మిరియాలు, దాల్చిన చెక్క, కొన్ని కరివేపాకులు వేసి బాగా కలుపుకోవాలి.

3. నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేసి ఆవిరిపోయేదాకా ఉండి మూత తీయాలి.

4. ఒకసారి ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి. కుక్కర్లో ఉన్న జొన్న రవ్వ మిశ్రమంలో కొంచెం నీళ్లు వేసి బాగా కలపాలి. అది మెత్తగా జారుడుగా ఉండేలా చూసుకోవాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె లేదా నెయ్యి వేయాలి.

6. పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి.

7. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా వేయించుకోవాలి.

8. తర్వాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

9. క్యారెట్ తరుగు, పాలకూర తరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.

10. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న జొన్న రవ్వను వేసి బాగా కలపాలి.

11. రెండు నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద ఉంచాలి.

12. మూత తీసి కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే జొన్న కిచిడి రెడీ అయిపోతుంది.

13. దీన్ని బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా లంచ్, డిన్నర్ సమయంలో తిన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది.

14. కేవలం డయాబెటిస్ పేషెంట్లే కాదు ఇతరులు కూడా దీన్ని తినవచ్చు.

జొన్నలు కొంచెం తింటే చాలు పొట్ట త్వరగా నుండేలా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. డయాబెటిస్ రోగులకు జొన్న కిచిడి ఉత్తమమైన ఆహారం. దీన్ని తినడం వల్ల వారికి మధుమేహం అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఒకేసారి పెరగవు. కాబట్టి వారానికి బ్రేక్ ఫాస్ట్ రూపంలో లేదా లంచ్, డిన్నర్ రూపంలో కనీసం నాలుగు ఐదు సార్లు జొన్న కిచిడి తినేందుకు ప్రయత్నించండి. మీరు మీ రక్తం లో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం గమనిస్తారు.