Jonna khichdi: రాగిజావలాగే ఓసారి జొన్న జావను కూడా ట్రై చేయండి, బరువు త్వరగా తగ్గుతారు-jonna khichdi recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Jonna Khichdi Recipe In Telugu, Know How To Make This Breakfast

Jonna khichdi: రాగిజావలాగే ఓసారి జొన్న జావను కూడా ట్రై చేయండి, బరువు త్వరగా తగ్గుతారు

Haritha Chappa HT Telugu
Mar 31, 2024 06:00 AM IST

Jonna khichdi: రాగి జావ తాగే వారి సంఖ్య ఎక్కువే. కానీ జొన్నలతో చేసే ఆహారాలను తినే వారి సంఖ్య తక్కువే. ఓసారి జొన్న కిచిడీ చేసుకుని తిని చూడండి. ఇది బరువును తగ్గిస్తుంది.

జొన్న కిచిడీ రెసిపీ
జొన్న కిచిడీ రెసిపీ

Jonna khichdi: డయాబెటిస్ బారిన పడినవారు బ్రేక్ ఫాస్ట్ గా ఏం తినాలో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎక్కువగా రాగి జావ మేలు చేస్తుంది. కేవలం రాగిజావ మాత్రమే కాదు, దానిలాగే జొన్న జావను కూడా చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ రెండూ చప్పగా అనిపిస్తాయి అనుకుంటే జొన్న కిచిడీ చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిరుధాన్యాల్లో ఒకటి జొన్నలు. కానీ జొన్నలతో జొన్న రొట్టెలు తప్ప ఇంకేమీ చేసుకోవడం లేదు. నిజానికి జొన్న కిచిడీని వారంలో నాలుగైదు సార్లు తాగడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

జొన్న కిచిడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

జొన్న రవ్వ - ముప్పావు కప్పు

పచ్చిశనగపప్పు - పావు కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

నూనె - రెండు స్పూన్లు

వెల్లుల్లి తరుగు - ఒక స్పూను

ఉల్లిపాయ - ఒకటి

క్యారెట్ తరుగు - పావు కప్పు

మిరియాల పొడి - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

జొన్నకిచిడీ రెసిపీ

1. జొన్నకిచిడీను చేసేందుకు జొన్నరవ్వను లేదా జొన్న పిండిని తీసుకోవచ్చు.

2. కుక్కర్లో జొన్న పిండి లేదా జొన్న రవ్వ, పచ్చిశనగపప్పు, నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి.

3. ఐదు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి తర్వాత స్టవ్ కట్టేయాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి.

5. నూనె మరిగాక తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన క్యారెట్ వేసుకొని బాగా కలపాలి.

6. అవి వేగాక మిరియాల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇవన్నీ బాగా వేగాక ముందుగా మిక్సీలో ఉడికించుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

8. పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉంచాలి. అంతే టేస్టీ జొన్న కిచిడీ రెడీ అయినట్టే.

9. రాగి జావతో పోలిస్తే ఇవి చాలా రుచిగా ఉంటుంది.

10. జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఇలా జొన్నజావను చేసుకొని తాగితే ఎంతో మంచిది.

జొన్నల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనదేశంలో పూర్వకాలం నుంచి వీటిని ఆహారంగా తినే అలవాటు ఉంది. అయితే ఎంతోమంది తెల్ల బియ్యం వచ్చాక జొన్నల్ని పక్కన పెట్టారు. జంక్ ఫుడ్ లోకంలో ఈ జొన్నల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ అక్కడక్కడ జొన్న రొట్టెలు కనిపిస్తున్నాయి. నిజానికి జొన్నలు చేసే మేలు ఇంతా అంతా కాదు. డయాబెటిస్ ఉన్నవారు రాగులతో పాటు జొన్నలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే బరువు తగ్గాలనుకున్న వారికి కూడా జొన్న జావా మంచి ఎంపిక అని చెప్పుకోవాలి.

మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి లేకుండా జొన్నలు కాపాడతాయి. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే సంఖ్య తగ్గిపోతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారు జొన్నలని ఆహారంలో భాగం చేసుకుంటే కొన్ని రోజులకే ఆ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి జొన్నలను ఆహారంగా తీసుకొని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం మంచిది. కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి కూడా జొన్నపిండికి ఉంది.

WhatsApp channel

టాపిక్