Vagina smell:మీ యోని నుంచి దుర్వాసన వస్తుందా? వదిలించుకోవడానికి ఈ ఆహారాలు మీకు తప్పకుండా సహాయపడతాయి!
Vagina smell: యోని నుంచి వాసన రావడం అనేది సాధారణమైన విషయమే.అయితే అది దుర్వాసనగా మారితే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. యోని దుర్వాసన నుంచి తప్పించుకోవాలంటే మీరు ఈ ఆహారాలను ప్రయత్నించండి.
యోని నుంచి వాసన రావడం అనేది సహజంగా అందరిలోనూ జరిగేదే. అయితే అది దుర్వాసనగా మారితేనే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా బుతుక్రమంలో ఉన్నప్పుడు, కలయిక సమయంలో,గర్భధారణ సమయంలో యోని నుంచి ప్రత్యేకమైన వాసనలు వస్తుంటాయి. అలా కాకుండా సాధారణ రోజుల్లో కూడా యోని నుంచి వాసన వస్తుంటే అది దుర్వాసన అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా ఆహారం విషయంలో యోని నుంచి వాసనకు మీరు తినే ఆహారం కూడా కారణమవచ్చు. ఎందుకంటే యోని ప్రేగు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రేగలను ఆరోగ్యంగా ఉంటేనే యోని కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా యోని వ్యాధులు, దుర్వాసన వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీ యోని నుంచి తరచుగా దుర్వాసన వస్తున్నట్లయితే మీ డైట్లో కోన్ని ఆహార పదార్థాలను తప్పకుండా చేర్చుకోండి. ఇవి యోని ఆరోగ్యాన్ని పెంచి మంచి వాసన వచ్చేలా చేస్తాయి.
యోని దుర్వాసను పొగొట్టేందుకు సహాయపడే ఆహార పదార్థాలు..
పెరుగు:
యోని దుర్వాసన తగ్గించే ఆహారాల్లో పెరుగు ఒకటి. ఇది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. ఇది మీ ప్రేగులు, మూత్ర నాళం, యోనిలో సహజంగా కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన ఈస్ట్ బ్యాలెన్స్ ను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. తద్వారా ఇన్ ఫెక్షన్లను తగ్గిస్తుంది. యోని నుంచి వచ్చే దుర్వాసనను అడ్డుకుంటుంది.
పైనాపిల్:
యోనిలో మంచి వాసన వచ్చేలా చేసే ఆహారాలలో పైనాపిల్ చాలా ముఖ్యమైనది. ఇది యోని స్రావాల వాసనను మార్చగలదని నమ్ముతారు. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి, బి, ఫైబర్ లు మీ గట్ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో, యోనిని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
దాల్చిన చెక్క:
యోని నుంచి వచ్చే దుర్వాసనకు దాల్చిన చెక్క గొప్ప సహజ నివారణ. యోనిలోని యాసిడ్‌ని బ్యాలెన్స్ చేయడంలో ఇది చాలా పనిచేస్తుంది. అదనపు ఆమ్లతను తటస్తం చేయడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది తేలికపాటి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది, ఈస్ట్ ఇన్ఫెక్షన్‌లను నివారిస్తుంది.
పుచ్చకాయ:
యోని ఆరోగ్యాన్ని పెంపొందించే అత్యుత్తమ ఆహారాలలో పుచ్చకాయ ఒకటి. ఇది మీ ప్రేగుల నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. మీ యోనిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడి ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. తద్వారా అసహ్యకరమైన వాసనలను కూడా తొలగిస్తుంది.pH స్థాయిలను సమతుల్యం చేయగల, యోనిలో మంచి బ్యాక్టీరియాను పెంచగలిగే ప్రీబయోటిక్స్ కలిగి ఉన్న పండు పుచ్చకాయ.
సెలెరీ:
యోని సువాసన విషయంలో అద్భుతమైన ఫలితాలను చూపించే శక్తి సెలెరీ ఆకుకూరలో ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అదనంగా, దాని ఆల్కలీన్ స్వభావం యోని బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను దరిచేరకుండా చేస్తుంది.
పిప్పరమింట్
యోని నుంచి తాజా సువాసన రావడంలో పిప్పరమింట్ చాలా బాగా సహాయడుతుంది. యోనిలో దుర్వాసన సమస్య మీకు ఉన్నట్లయితే పిప్పరమెంటు టీ తాగడానికి ప్రయత్నించండి. సుగంధ లక్షణాలకు ప్రసిద్ధి గాంచిన పిప్పరమింట్ మీ యోని వాసనలో తేడాను త్వరగా తెప్పించగలదు. దుర్వాసనను తరిమి కొట్టి మంచి సువాసన వచ్చేలా చేస్తుంది.
క్రాన్బెర్రీస్:
క్రాన్బెర్రీ జ్యూస్ తాగడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని మీరు వినే ఉంటారు. కానీ ఇది యోని ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది. క్రాన్‌బెర్రీస్‌లోని సమ్మేళనాలు యోనిలోని పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయగలవు. దాని ఆమ్ల లక్షణాలు సంక్రమణకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలవు.