Right Side Heart : మీ గుండె కుడివైపు ఉందా? ఎడమ కుడి అయితే..-is your heart on the right side what is dextrocardia complete details know here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Is Your Heart On The Right Side What Is Dextrocardia Complete Details Know Here

Right Side Heart : మీ గుండె కుడివైపు ఉందా? ఎడమ కుడి అయితే..

Anand Sai HT Telugu
Feb 21, 2023 11:22 AM IST

Dextrocardia : మీరు బాలీవుడ్ చిత్రం 'లక్' చూశారా? అందులో హీరో ఛాతీకి ఎడమవైపు బుల్లెట్ తగులుతుంది. హీరో గుండెకు ఏం కాదు.. ఎందుకంటే అతడికి డెక్స్‌ట్రోకార్డియా ఉంది. గుండె అనేది ఛాతీకి కుడి వైపున ఉండే అరుదైన పరిస్థితి. ఇలా ఉంటే ఏం అవుతుంది?

డెక్స్‌ట్రోకార్డియా
డెక్స్‌ట్రోకార్డియా (unsplash)

మనిషిలో కాలేయం(Liver) కుడివైపు, గుండె(Heart) ఎడమవైపు ఉంటుంది. అయితే గుండె కుడి వైపు, కాలేయం ఎడమవైపు ఉంటే అది విచిత్రం. అయితే ఇలా కొంతమందికి ఉంది. ఇప్పటి వరకూ ఇలా ఐదుగురికి ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో నలుగురు ఇండియన్స్. అలా అంతర్గత అవయవాలు వ్యతిరేక దిశలో ఉంటడం మాత్రం అరుదు. గుండె కుడివైపు(Right Side Heart) ఉండటాన్ని వైద్య పరిభాషలో డెక్స్‌ట్రోకార్డియా(Dextrocardia)గా చెబుతారు. గుండె వైకల్యం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంలా కాకుండా అసాధారంగా ఎడమవైపు ఉంటుంది. ఈ రుగ్మత పుట్టుకతో వస్తుంది.

ఇలా గుండె(Heart) కుడి వైపు ఉండటం అనేది ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉంటుంది. దీనివలన ఇతర అవయవాలు పెద్దగా ప్రభావితం కావు. అయితే కొంత మాత్రం మార్పులు ఉంటాయని చెబుతున్నారు. వివిధ రకాల ఇతర పుట్టుకతో వచ్చే వ్యాధులతో కలిసి ఉండవచ్చు. ఇది శిశువు అభివృద్ధి ప్రారంభంలో లేదా గర్భధారణ సమయంలో జరుగుతుంది.

డెక్స్ట్రోకార్డియా ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుంది?

డెక్స్ట్రోకార్డియా(Dextrocardia) ప్రాణాంతకం కాదు. కానీ తరచుగా గుండె వైకల్యాలు, ఉదరంలో అవయవ లోపాలు వంటి తీవ్రమైన సమస్యలు సంభవించే అవకాశం ఉంది. అప్పుడప్పుడు అలసటగా అనిపిస్తుంది. కామెర్లు లేదా పసుపు చర్మం, బరువు పెరగడం సాధ్యం కాదు. నిరంతర అంటువ్యాధులు, ముఖ్యంగా సైనస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటివి ఉంటాయి. నీలం రంగు చర్మం, ముఖ్యంగా వేళ్లు, కాలి చుట్టూ ఉంటుంది. డెక్స్ట్రోకార్డియా ఉన్న వ్యక్తి అరిథ్మియా లేదా క్రమరహిత హృదయ స్పందనను కూడా అనుభవించవచ్చు. రెండు రకాల డెక్స్ట్రోకార్డియ ఉంటాయి.

ఐసొలేటేడ్ డెక్స్ట్రోకార్డియా

ఈ రకమైన డెక్స్ట్రోకార్డియాలో శరీరానికి కుడివైపు మాత్రమే గుండె ఉంటుంది. ఇతర అవయవ సమస్యలు లేవు. ఐసొలేటేడ్ డెక్స్ట్రోకార్డియా(Isolated Dextrocardia) అసాధారణం.

సిటస్ ఇన్వర్సస్ డెక్స్ట్రోకార్డియా

Situs Inversus Dextrocardia.. ఇందులో గుండె కాకుండా మరికొన్ని అవయవాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇది కూడా పుట్టుకతో వచ్చే సమస్యే. దీనిలో ప్రధాన అవయవాలు వాటి సాధారణ స్థానాలకు బదులుగా వ్యతిరేక స్థానాల్లో ఉంటాయి. అంటే కుడివైపు ఉండాల్సినవి.. ఎడమవైపునకు ఉంటాయన్నమాట. కాలేయం కుడి వైపున కాకుండా ఎడమవైపునకు ఉంటుంది. అంతర్గత అవయవాల సాధారణ అమరికను సిటస్ సాలిటస్ అంటారు.

డెక్స్ట్రోకార్డియా నిర్ధారించాలంటే.. వైద్యుడు చెప్పాలి. రోగి వైద్య చరిత్ర, శారీరక పరీక్షపై ఆధారపడి ఉంటుంది. ఎకోకార్డియోగ్రామ్, ఎక్స్-రే లేదా CT స్కాన్ వంటి ఇమేజింగ్ అధ్యయనాలు ఉపయోగించి చెబుతారు. మీ లేదా మీ పిల్లల హృదయ స్పందన వినడానికి స్టెతస్కోప్‌ని ఉపయోగిస్తారు. ఛాతీ కుడి వైపున హృదయ స్పందన వస్తే.. డెక్స్ట్రోకార్డియాగా నిర్ధారిస్తారు.

WhatsApp channel