కండ్ల కలక సోకిందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా రికవర్ అవుతారు-is your conjunctivitis infected here are 12 precautions to take and recover quickly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కండ్ల కలక సోకిందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా రికవర్ అవుతారు

కండ్ల కలక సోకిందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా రికవర్ అవుతారు

HT Telugu Desk HT Telugu
Aug 13, 2023 03:30 PM IST

కండ్ల కలక సోకిందా.. అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తే త్వరగా మీరోజు వారీ పనులు చేసుకోవడానికి వీలవుతుంది.

 కండ్లకలక సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి
కండ్లకలక సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి

కండ్ల కలక వచ్చినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకోండి. ఇలా చేస్తే మీరు త్వరగా కోలుకుని మీ రోజువారీ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు

 1. మీ చేతులను తరచుగా కడగాలి. కండ్లకలక వ్యాప్తిని నివారించడానికి మీరు చేయగలిగే అతి ముఖ్యమైన పని ఇది. ముఖ్యంగా మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు సబ్బు మరియు నీటితో మీ చేతులను కడగాలి.
 2. మీ కళ్ళను తాకడం మానుకోండి. ఇది ఇతర కంటికి లేదా ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ వ్యాపించేలా చేస్తుంది. మీరు మీ కళ్ళను తాకవలసి వస్తే, ముందుగా మీ చేతులను కడగాలి. తాకిన తరువాత కూడా కడుక్కోవాలి.
 3. కళ్లు పొడిబారకుండా కంటి చుక్కల మందు వైద్యుడి సిఫారసు మేరకు వాడండి. ఇది మీ కళ్లకు ఉపశమనం కలిగించడానికి, లూబ్రికేట్ చేయడానికి సహాయపడతాయి. మీరు వీటిని చాలా మందుల దుకాణాలలో ఓవర్-ది-కౌంటర్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
 4. మీ కళ్లు ఉబ్బుగా, నొప్పిగా, లోపల ఇరిటేషన్ కలిగిస్తుంటే మీరు ఐస్ ప్యాక్ వాడండి. ఒక కర్చీప్‌లో ఐస్ ముక్కలు వేసి మీ కళ్లపై కాసేపు పట్టి ఉంచండి. చాలా ఉపశమనం లభిస్తుంది. రెండు మూడు రోజులు కూడా వాపు ఉంటే శుభ్రమైన వాష్‌క్లాత్‌ను గోరువెచ్చని నీటిలో నానబెట్టి, మీ కళ్ళకు 10-15 నిమిషాల పాటు అప్లై చేయండి.
 5. పుష్కలంగా విశ్రాంతి తీసుకోండి. మీ శరీరానికి నయం కావడానికి సమయం కావాలి. కాబట్టి మీరు పుష్కలంగా విశ్రాంతి తీసుకోవాలి. వీలైనంత సేపు నిద్ర పోవాలి.
 6. కాంటాక్ట్ లెన్సులు ధరించడం మానుకోండి. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినట్లయితే, మీ కండ్లకలక క్లియర్ అయ్యే వరకు వాటిని ధరించకుండా ఉండాలి. ఇది సంక్రమణ వ్యాప్తిని నివారించడానికి సహాయపడుతుంది.
 7. మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా కొన్ని రోజుల తర్వాత మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించండి. కొన్ని సందర్భాల్లో, కండ్లకలక మరింత తీవ్రమైన పరిస్థితి వల్ల సంభవించవచ్చు. మీ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా జ్వరం వస్తే కొన్ని రోజుల తర్వాత మెరుగుపడకపోతే వైద్యుడిని సంప్రదించండి.
 8. కండ్లకలక కొన్ని రోజులలో దానంతంటే అదే క్లియర్ అవుతుంది. అయితే, మీరు వేగంగా కోలుకోవడానికి, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
 9. మీ కంటి మేకప్ కిట్స్, టవల్ లేదా వాష్‌క్లాత్‌లను ఇతరులతో పంచుకోవద్దు.
 10. ఈతకొలనులు లేదా హాట్ టబ్‌లలో ఈత కొట్టడం మానుకోండి.
 11. మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును కప్పుకోండి.
 12. మీ పిల్లలు కండ్లకలకతో బాధపడుతున్నట్టయితే అది నయమయ్యేవరకు ఇంటి వద్దే ఉంచండి.

WhatsApp channel