Skin Problems: రష్మిక మందన్నాకు ఉన్న చర్మవ్యాధి ఇదేనా? దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే
రష్మిక మందన్నా పేరు చెబితేనే ఎంతోమందికి పులకరింతలు వస్తాయి. ఆమె అందుకే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పా సినిమాతో ఆమెకు అభిమానులు కూడా పెరిగిపోయారు. అయితే రష్మిక ఒక చర్మ సమస్యతో ఇబ్బంది పడుతోంది.
Hరష్మిక మందన్నా చూడగానే ఆకట్టుకునే రూపంతో, మెరిసే మేని ఛాయతో ఉంటుంది. అందుకే అన్ని సినిమా అవకాశాలను దక్కించుకొని నేషనల్ క్రష్ గా మారింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తోంది. అయితే ఈమెకు ఒక చర్మవ్యాధి ఉంది. ఈ సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కెమికల్‌తో కూడిన కాస్మెటిక్స్ ను ఉపయోగించడం వల్ల అనేక రకాల చర్మవ్యాధులు వస్తూ ఉంటాయి. రష్మిక మందన్నా కూడా ఒక అరుదైన తీవ్రమైన చర్మవ్యాధి ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె డెర్మటాలజిస్టును కలిసినప్పుడు ఈ చర్మవ్యాధి గురించి బయటపడింది.
హీరోయిన్లు రసాయనాలతో కూడిన కాస్మెటిక్స్ ను ఉపయోగించాల్సి వస్తుంది. దీనివల్ల కొంతమందికి ఇబ్బందులు ఎదురవుతాయి. అలా రష్మికకు కూడా కాస్మెటిక్స్ లో ఉండే కొన్ని రసాయనాలు వల్ల చర్మవ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది. ఆమె తన చర్మాన్ని కాపాడుకోవడానికి డెర్మటాలజిస్టును కూడా కన్సల్ట్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు. అయితే ఈ చర్మవ్యాధి వల్ల చర్మంపై దురద, మంట, ఎరుపు, దద్దుర్లు వంటివి తరచూ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా కనిపిస్తున్న కూడా ఎక్కువగా వేధిస్తాయి. తరచూ రావడం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది. పదేపదే గోకాలని అనిపిస్తుంది.
తీవ్ర మొటిమల సమస్య
మొటిమలు తీవ్రంగా వస్తాయి. ముఖంపైనే కాదు ఛాతీపై కూడా మొటిమలు వస్తాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోయి పిగ్మెంటేషన్ పెరిగిపోతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి కూడా అధికంగా కనిపిస్తాయి. చర్మం ఎర్రబడటం, పగుళ్ళు రావడం, పొరలుగా ఊడిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. మరికొందరికి పొలుసుల్లా మారి చర్మం ఊడిపోతూ ఉంటుంది. దీన్ని సొరియాసిస్ గా చెప్పుకుంటారు. జుట్టు రాలే ఆటో డిజార్డర్ కూడా ఉంది. కాబట్టి చర్మవ్యాధులు ఏదైనా కూడా తేలికగా తీసుకోకండి. తగిన చికిత్సను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రసాయనాలు కలిగిన కాస్మోటిక్ కు ఎంత దూరంగా ఉంటే మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)