Lefover Rice Pancake: అన్నం మిగిలిపోయిందా? పిల్లలకు ఇలా పాన్ కేక్స్ చేసేయండి, బ్రేక్ ఫాస్ట్‌గా ఉపయోగపడతాయి
Lefover Rice Pancake: మిగిలిపోయిన అన్నంతో రైస్ పాన్ కేక్స్ చేస్తే పిల్లలకు అల్పాహారంగా ఉపయోగపడతాయి. ఇవి టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యం కూడా.
Lefover Rice Pancake: ప్రతి ఇంట్లో ఎంతో కొంత అన్నం మిగిలిపోవడం సహజం. అలా మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలో తెలియక కొంతమంది పడేస్తారు. మరికొందరు తాలింపు పెట్టుకొని తినేస్తారు. ఒకసారి మిగిలిపోయిన అన్నంతో పాన్ కేక్స్ చేసి చూడండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ గా ఉపయోగపడతాయి. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.
మిగిలిపోయిన అన్నంతో పాన్ కేక్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
వండిన అన్నం - ఒక కప్పు
గోధుమపిండి - ఒక కప్పు
చక్కెర - ఒక స్పూను
బేకింగ్ సోడా - అర స్పూను
బేకింగ్ పొడి - ఒక స్పూను
మజ్జిగ - ఒక కప్పు
గుడ్డు - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
వెనిల్లా ఎసెన్స్ - ఒక స్పూను
ఉప్పు - పావు స్పూను
బటర్ - ఒక స్పూను
రైస్ పాన్ కేక్స్ రెసిపీ
1. ఒక పెద్ద గిన్నెలో గోధుమపిండి, చక్కెర, బేకింగ్ పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి చేతితోనే బాగా కలపాలి.
2. అందులోనే మజ్జిగ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక స్పూను వెన్న కూడా వేసి బాగా కలపాలి.
3. వెనిల్లా ఎసెన్స్, కోడిగుడ్డు పగలగొట్టి ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
4. ఇప్పుడు మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీలో వేసి కాస్త నీళ్లు జోడించి మెత్తటి జావలాగా చేసుకోవాలి.
5. ఈ అన్నం మిశ్రమాన్ని కూడా గోధుమపిండి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
7. ఈ మిశ్రమాన్ని పాన్ కేకుల్లా మందంగా వేసుకొని రెండు మూడు నిమిషాలు కాల్చుకోవాలి.
8. అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చుకోవాలి.
9. రెండు వైపులా కాల్చుకున్నాక తీసి సర్వ్ చేసుకోవాలి.
10. ఈ పాన్ కేక్స్ తేనెతో తిన్నా, పెరుగుతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి.
మిగిలిపోయిన అన్నంలో ఎన్నో పోషకాలు ఉన్నాయని చెబుతారు. మధ్యాహ్నం వండిన అన్నం రాత్రికి తింటే ఎంతో బలమని అంటారు. కాబట్టి మిగిలిపోయిన అన్నాన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఇలా పాన్ కేకుల రూపంలో చేసుకొని తినవచ్చు.