Baby Girl Names: మీ కుటుంబంలో పాప పుట్టిందా? ఆమెకు అందం ఆధునికత కలగలసిన ఈ పేర్లలో నచ్చినది ఎంపిక చేసుకోండి-is there a baby in your family choose from these beautiful and modern names for her ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baby Girl Names: మీ కుటుంబంలో పాప పుట్టిందా? ఆమెకు అందం ఆధునికత కలగలసిన ఈ పేర్లలో నచ్చినది ఎంపిక చేసుకోండి

Baby Girl Names: మీ కుటుంబంలో పాప పుట్టిందా? ఆమెకు అందం ఆధునికత కలగలసిన ఈ పేర్లలో నచ్చినది ఎంపిక చేసుకోండి

Haritha Chappa HT Telugu

Baby Girl Names: ఇంట్లో బిడ్డ పుడితే ఆ కుటుంబమంతా ఎంతో ఆనందిస్తుంది. ఇక తల్లిదండ్రుల సంతోషానికి అంతే లేదు. మీకు పుట్టినది పాప అయితే ఆమెకు అందంగా ఉండే ఈ పేర్లలో మీకు నచ్చినది ఎంపిక చేసేందుకు ప్రయత్నించండి. ఇవి ఆధునికమైనవి కూడా.

బేబీ గర్ల్ నేమ్స్ (shutterstock)

ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని పొంగిపోతారు. పుట్టిన ఆ బిడ్డను చూసి మురిసిపోతారు. తమ పాపకు అందమైన పేరు పెట్టాలని ఆలోచిస్తారు. ఆ పేరు అందంగానే కాదు ఆధునికంగా, అర్థవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే పిల్లల పేరు వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుందని చెప్పుకుంటారు. మీ ఇంట్లో పాప పుడితే మీకు నచ్చే అందమైన పేర్లను ఇక్కడ ఇచ్చాము. ఇవన్నీ ఆధునికంగా ఉండేవే. కింద ఇచ్చిన పేర్లలో మీకు నచ్చినది ఎంపిక చేసుకుని మీ పాపకు పెట్టండి

బేబీ గర్ల్ నేమ్స్

శాలినా

వీరి స్వభావం ప్రశాంతంగా, వినయంగా ఉండాని కోరుకుంటే మీ పాపకు ఈ ఆధునిక పేరు పెట్టవచ్చు.

యానిషా

యానిషా అనే పేరుకు అర్థం ఆకాంక్షతో కూడిన, ఎత్తైన ఆశలతో ఉండే వ్యక్తి అని. మీ పాపకు ఈ అపురూపమైన, ఆధునిక పేరు పెడితే చక్కగా ఉంటుంది.

హేమాలి

హేమాలి అంటే మంచులా చల్లనిది అని అర్థం. ఈ కాలం పాపకు ఈ ఆధునిక పేరు చక్కగా సరిపోతుంది.

కిమయా

కిమయా అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దీని అర్థం రహస్యమైన విశ్వ శక్తులతో అనుసంధానించినది అని. మాయ లేదా దివ్యమైనది వంటి పదాల్లాంటిదే కిమయా కూడా.

కావి

కావి అనే పదం ఉర్దూ నుండి వచ్చింది. కానీ దీనికి ఒక అర్థం బలవంతురాలు అని. మీ పాపకు ఈ విభిన్నమైన పేరు పెట్టవచ్చు.

తాణిక

తాణిక అనే పేరుకు అర్థం అప్సర. మీరు మీ పాపకు ఆధునిక పేరు పెట్టాలనుకుంటే, తాణిక అనే పేరు చాలా అందంగా ఉంటుంది.

అధిరా

అధిరా అంటే మెరుపులా లేదా బలమైనది. మీరు మీ పాపకు బలమైన వ్యక్తిత్వంతో కూడిన పేరు పెట్టాలనుకుంటే, అధిరా అనే పేరు చాలా అందంగా ఉంటుంది.

వారిజ

ఈ పేరుకు అర్థం నీటిలో పుట్టి తామర పుష్పం.

అభిసారిక

ఈ పేరుకు అర్థం ప్రేమకావ్యంలోని నాయిక అని అర్థం. ఈ ప్రేమకు ప్రతిరూపం అని కూడా చెప్పుకోవచ్చు.

అలంకృతా

అందంగా అలంకరించుకునే అమ్మాయి కోసం ఈ అందమైన పేరు.

అల్కా

ఈ పేరుకు అర్థం మంచి సృజనాత్మకత కలిగి ఉన్న వ్యక్తి.

ఆపేక్షా

ఈ పేరుకు అర్థం అభిమానం. ప్రేమ, కోరిక వంటి అర్ధాలు వస్తాయి.

ఆర్యనా

ఈ పేరుకు అర్థం అత్యంత పవిత్రమై అని.

ఆత్వికా

ఇదొక ఆధునికమైన పేరు.

అయంతికా

ఈ పేరుకు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అని అర్థం.

ఆయుక్తా

ఈ పేరుకు సూర్యుడి అని అర్థం.

దీపశిఖ

వెలుగుతున్న దీపం అని ఈ అందమైన పేరుకు మీనింగ్.

దివిషా

అందరి దేవతలకు అధిదేవత అని అర్థం.

హితాన్షి

స్వచ్ఛమైన వ్యక్తి అని ఈ పేరుకు అర్థం.

ఇమాని

ఈ ఆధునిక పేరుకు అర్థం నమ్మకమైన అని.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం