పాయసంలో తీపి ఎక్కువైపోయిందా? ఈ పదార్థాలు కలిపితే తియ్యదనం తగ్గుతుంది
వేడుక ఏదైనా ఇంట్లో పాయసం ఉండాల్సిందే. పాయసం వండుతున్నప్పుడు ఒక్కోసారి పంచదార అధికంగా పడుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం కూడా. తీపిగా ఉండే పాయసం తినడం కూడా కష్టంగా ఉంటుంది. ఇలా పాయసం తీపిగా మారితే చిన్న చిట్కాల ద్వారా ఆ తీపిని తగ్గించవచ్చు.

పండుగైనా, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు వంటి వేడుకలు ఉన్నా ఇంట్లో పాయసం ఉండాల్సిందే. పాయసంలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా పాయసం చాలా తీపిగా ఉంటుంది. పాయసంలో కచ్చితంగా పంచదార పడాల్సిందే. తీపి తినాలనుకుంటే చాలు నిమిషాల్లో పాయసం వండేసుకోవచ్చు. పాయసం వివిధ పదార్థాలతో వివిధ రకాలుగా తయారు చేస్తారు. చాలా మంది దీన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, పాయసం చేసేటప్పుడు కొన్నిసార్లు పంచదాక ఎక్కువగా పడిపోతుంది. దీనివల్ల పాయసం చాలా తీయగా మారిపోతుంది. చాలా తీయగా ఉంటే పాయసం తినడం కష్టం అవుతుంది. తీపిగా ఉండే పాయసం తినడం చాలా కష్టం. అలాంటి సమయాల్లో పాయసంలోని తీపిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉపయోగపడతాయి.
పాయసం తీపిని తగ్గించడానికి చిట్కాలు
కొబ్బరి పాలు: పాయసం చాలా తీయగా అనిపిస్తే వెంటనే కొబ్బరి పాలు లేదా తురిమిన కొబ్బరిని కలపండి. ఇది తీపిని తగ్గిస్తుంది. ఇది మంచి రుచిని కూడా ఇస్తుంది. పైగా ఇది కొత్తగా ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
బాదం పొడి: పాయసం చాలా తీయగా ఉంటే బాదం పొడిని ఉపయోగించవచ్చు. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడిని పాయసం లో కలపండి. బాదం పొడిలో ఇంట్లో లేకపోతే బాదంపప్పులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిని తీపిని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ పొడిని కలిపినా పాయసం తీపి తగ్గుతుంది.
ఉప్పు కలపండి: ఉప్పు వంటకాల్లో తీపిని తగ్గిస్తుందని చాలా మందికి తెలియదు. పాయసం చాలా తీయగా ఉంటే చిటికెడు ఉప్పు కూడా కలపండి. ఉప్పు తీపిని సమతుల్యం చేస్తుంది. రుచిని కూడా పెంచుతుంది.
గసగసాల పొడి: పాయసం వంటకం తీపిని తగ్గించడానికి గసగసాల పొడిని కలపవచ్చు. పాయసంలో అది తీపిని తగ్గిస్తుంది. ఇది మంచి వాసనను కూడా ఇస్తుంది. ముందుగా గసగసాలను తక్కువ మంట మీద బాగా వేయించండి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో మెత్తగా పొడి చేయండి. ఆ తర్వాత పాయసం లో పొడిని కలపాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
పాయసం తీపిని తగ్గించడానికి పైన చెప్పిన చిట్కాలను ఫాలో అవ్వచ్చు. కానీ, పాయసం ఎంత ఉందనే దానిపై ఇవి ఆధారపడి ఉంటాయి. చాలా ఎక్కువగా కలిపితే రుచి మారిపోవచ్చు. అందుకే పాయసం ఎంత ఉందో, ఎంత తీపి కలపాలో తెలుసుకుని కలపాలి.
సంబంధిత కథనం