భోజనం చేస్తూ మధ్య మధ్యలో నీళ్లు తాగేవారు ఎంతో మంది. కానీ అలా భోజనం తింటూ నీళ్ళు త్రాగకూడదని, భోజనం చేసిన వెంటనే కూడా కూడా నీళ్ళు త్రాగకూడదని చెబుతారు. అలా చేస్తే జీర్ణక్రియ నెమ్మదిస్తుందని అంటారు. అయితే అది పూనిజమా? కాదా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
భోజనంతో పాటు నీళ్ళు త్రాగడం గురించి చాలా మంది ఆయుర్వేద నిపుణులు సరైన సమాచారాన్ని అందించారు. ఆయుర్వేదం ప్రకారం భోజనంతో పాటు నీళ్ళు త్రాగవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనంతో పాటు నీళ్ళు త్రాగడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
నీరు మన శరీరానికి ఎంతో ముఖ్యం. శరీరంలోని కణాలకు పోషకాలు అందించే బాధ్యత నీటిదే. ఆక్సిజన్‌ను శరీరం అంతా మోసుకెళ్లి, టాక్సిన్స్ ను బయటికి పంపిస్తుంది. చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే భోజనం చేసేటప్పుడు ఆయుర్వేదం ప్రకారం మధ్యలో నీళ్లు తాగకూడదని చెబుతారు. దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతారు. కేవలం నీళ్లే కాదు భోజనం తింటూ కూల్ డ్రింకులు వంటివి కూడా తాగకూడదు. కొంతమంది బిర్యాని తింటూ పక్కన కూల్ డ్రింకులు పెట్టుకుంటారు. బిర్యానీ రెండు ముద్దలు తిని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆయుర్వేద ప్రకారం శరీరానికి హాని చేసే పనులు.
భోజనం చేయడానికి అరగంట ముందు నుంచి నీళ్లు తాగకూడదు. అలాగే భోజనం చేస్తున్నప్పుడు, మధ్యలో కూడా నీళ్లు తాగకూడదని చెప్తారు. భోజనం చేశాక ఒక అరగంట తర్వాతే నీరు తాగాలి. అప్పుడు శరీరంలో పోషకాల శోషణకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఆహారం సరిగా జీర్ణం అవ్వాలంటే మీరు అధికంగా తాగకూడదని ఆయుర్వేదం చెబుతుంది. మధ్య మధ్యలో నీళ్లు తాగడం లేదా భోజనానికి ముందే గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు అని వివరిస్తుంది. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియలో శక్తి చల్లబడిపోతుంది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. ఎక్కువ కాలం పాటు పొట్టలోనే నిల్వ ఉంటుంది. ఇది పొట్ట ఉబ్బరానికి, గ్యాస్టిక్ సమస్యలకు కారణం అవుతుంద.
ఒక్కోసారి కారం అధికంగా కావడం లేదా గొంతులో ఏదైనా అడ్డుపడినట్టు అనిపించడం జరుగుతుంది. అలాంటి సమయంలో మాత్రం కచ్చితంగా నీళ్లను తాగాలి. అయితే నీళ్లు గడగడా తాగేయకుండా నెమ్మదిగా సిప్ చేయాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వెంటనే నీళ్లు తాగవచ్చు. కానీ ప్రతిరోజూ భోజనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నీటిని తాగడానికి పద్ధతులు ఉన్నాయి. భోజనం తినడానికి ముందు తిన్న వెంటనే నీళ్లు తాగకుండా కాసేపు వేచి ఉండాలి. నీళ్లను తాగితే జీర్ణ రసాలు పలుచన అయిపోతాయి. దీని వల్ల అవి సక్రమంగా జీర్ణ క్రియను పూర్తి చేయలేవు. ఆహారం నుంచి పోషకాలు గ్రహించడం శరీరానికి కష్టంగా మారిపోతుంది.
మీకు మరీ దాహంగా అనిపిస్తే భోజనం మధ్యలో లేదా భోజనానికి ముందు, భోజనం తర్వాత ఎప్పుడైనా కూడా గోరువెచ్చని నీటిని తాగవచ్చు. గోరువెచ్చని నీరు జీర్ణరసాలను చల్లబరచకుండా అదే వేడితో ఉండేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణ ప్రక్రియకు కూడా ఆలస్యం కాదు. అంతేగాని చల్లని నీళ్లు తాగడం మాత్రం జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఆయుర్వేదం ప్రకారం నీరు తాగే పద్ధతులను తెలుసుకుంటే ఆహారం నుండి పోషకాలను పొందడమే కాదు. పొట్ట, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం